- Home
- Entertainment
- Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
బిగ్ బాస్ తెలుగు 10 లో హౌస్ లో 18వ రోజు ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. హౌస్ లో కి వైడ్ కార్డు ఎంట్రీ రాబోతున్నట్లు ప్రకటించారు. అగ్ని పరీక్షలో పాల్గొన్న వారిలో ఒకరు కొత్తగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు 10లో భాగంగా 18 రోజు హౌస్ లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హౌస్ లోకి అగ్ని పరీక్ష నుంచి కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీ రాబోతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన సంఘటనలు 18 రోజు చోటు చేసుకున్నాయి. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు కొనసాగాయి.
సంచాలక్ గా త్రిగుణ్ గందరగోళం
బజర్ ఎవరు ముందుగా మోగించారు అనే దానికి త్రిగుణ్ సంచాలక్ గా వ్యవహరించారు. అయితే త్రిగుణ్ తప్పులో కాలేశారు. వంశీ, నరేష్ విషయంలో ఎవరు ముందుగా బజర్ మోగించారు అనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. కానీ త్రిగుణ్ .. నరేష్ పేరు చెప్పారు. అందరికీ నరేష్ అని ప్రకటించాడు. 5 నిమిషాలు ఆలోచించుకుని కాదు వంశీ అని మాట మార్చాడు. దానికి వివరణ ఇస్తూ నేను కన్ఫ్యూజ్ అయ్యాను తప్పు నాదే.. బిగ్ బాస్ ఏ శిక్ష వేసినా తీసుకుంటా. కానీ బజర్ మొదట మోగించింది మాత్రం వంశీ అని చెప్పాడు. దీనికి నరేష్ బాగా హర్ట్ కావడంతో కాసేపు ఆర్గుమెంట్ జరిగింది. మరో వైపు బయట బజర్ ని ఝాన్సీ మోగించింది. దీనితో వంశీ, ఝాన్సీ మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది.
వర్షిణి వల్ల డీవియేట్ అవుతున్నాడు
ఈ టాస్క్ లో ఝాన్సీ విజయం సాధించింది. మొత్తంగా కెప్టెన్సీ కంటెండర్స్ గా ముఖేష్, అమన్, సృష్టి, ఝాన్సీ కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత సాధించారు. ఆ తర్వాత టీవీలో హౌస్ లో ఉన్న కొందరు సభ్యుల గురించి కామెంట్స్ డిస్ ప్లే అయ్యాయి. ముఖేష్ గురించి వచ్చిన కామెంట్ లో అతడు వర్షిణితో రిలేషన్ మైంటైన్ చేస్తూ గేమ్ పై ఫోకస్ పెట్టడం లేదు. అందరితో కలవడం లేదు. హౌస్ లో యాక్టివ్ గా ఉండడం లేదు అని ఉంది. ఆ తర్వాత షాలినికి కామెంట్ వచ్చింది. ఆమె మాటలు జారుతోంది. ఒక్క గేమ్ గెలవలేదు. బ్యాక్ బిచింగ్ స్టార్, ట్రిగ్గరింగ్ క్వీన్ అంటూ కామెంట్ పెట్టారు. రామ్ ప్రసాద్ గురించి అతడు కన్నింగ్, సేఫ్ గేమ్ ఆడతాడు అని పెట్టారు.
గేమ్ తక్కువ హంగామా ఎక్కువ
వర్షిణి గురించి వచ్చిన కామెంట్ లో ఆమె గేమ్ ఆడేది తక్కువ హంగామా చేసేది ఎక్కువ, ముఖేష్ తప్పు చేసినా బ్లైండ్ గా సపోర్ట్ చేస్తుంది అని పెట్టారు. అసలు ఈ కామెంట్స్ అన్నీ పెట్టింది ఎవరో కాదు.. అగ్ని పరీక్షలో పాల్గొన్న మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ.
వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరు
ఈ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ గేటు వరకు వచ్చారు. ఈ ముగ్గురిలో ఒకరికి హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని.. కానీ అది ఎవరు అనేది హౌస్ లో ఉన్న సభ్యులే డిసైడ్ చేయాలి అని బిగ్ బాస్ తెలిపారు. ఈ ముగ్గురు తమని తాము పరిచయం చేసుకుని హౌస్ లోకి వస్తే గేమ్ ఎలా ఆడతామో వివరించారు. ముఖేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ గురించి కామెంట్స్ తానే పెట్టాను అని మిథిలేష్ ఒప్పుకున్నారు. త్రిగుణ్ మ్యానిపులేటివ్ అంటూ మిథిలేష్ కడిగిపారేశారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లోకి వస్తారు అనేది శుక్రవారం ఎపిసోడ్ లో తేలనుంది.

