MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ ని మాళవికతో చూసి బాధపడిన వేద.. మాళవిక మీద కోపంతో అభిమన్యు!

Ennenno Janmala Bandham: యష్ ని మాళవికతో చూసి బాధపడిన వేద.. మాళవిక మీద కోపంతో అభిమన్యు!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 28వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Oct 28 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వేద ఫోన్ ఎత్తడం లేదు అని యష్ కంగారు పడతాడు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో తనకి ముఖ్యమైన విషయాలు ఏమైనా తెలిసి ఉంటాయా అని అనుకుంటాడు. ఇంతలో ఏదో పొగ వచ్చేసరికి ఏంటి పొగ అని అనుకుంటాడు. అప్పుడు హోటల్ కి ఫైర్ ఆక్సిడెంట్ అయింది అని కింద ఉన్న వాళ్ళు చెప్పి, అక్కడి నుంచి బయటకు వచ్చేయమని చెప్తారు. ఇంతలో మేనేజర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫైర్ ట్రక్ కి ఫోన్ చేసి రమ్మని చెప్తారు. విషయం విన్న యష్ మాళవిక కోసం వెతుకుతాడు. అప్పటికే మాళవికకి ఊపిరి ఆడక నన్ను కాపాడు యష్ అని అంటుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 అదే సమయంలో వేద హోటల్ బయట ఏమైంది అని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది. ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది అని వాళ్ళు అనగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ పోలీసులు ఆపేస్తారు ఇంతలో యష్ మాలికని ఎత్తుకుంటూ హోటల్ బయటకు తీసుకు వస్తాడు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన వేద ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతుంది. వేదన చూసిన యష్ ఏం చేయలేక మాలవిక ను కారులో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడు బాధపడుతూ, నేను నీకు ఏం చెప్పలేని పరిస్థితి వస్తుంది వేద. నీకు అన్ని అర్థమయ్యేటట్టు తర్వాత చెప్తాను అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
 

37

 వాళ్ళిద్దర్నీ చూసిన వేద మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత సీన్లో అభిమన్యు తన కంపెనీలో కూర్చుని మాళవికకి ఫోన్ చేస్తాడు. మాళవిక ఫోన్ ఎత్తకపోవడంతో, మాజీ భర్తతో సమయం బాగా కడుపుతున్నట్టు ఉన్నది బంగారం నాకు తన పద్ధతి నచ్చడం లేదు, తన యాటిట్యూడ్ నచ్చడం లేదు, తన బిహేవియర్ నచ్చడం లేదు అని అనుకుంటాడు. ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి నాకు సిస్టర్ పద్ధతి ఏమి నచ్చడం లేదు. మీ ఉప్పు తిన్నాను, మీతోనే మందు తాగాను,  కానీ మీకే సలహా ఇస్తాను అని అనుకోలేదు. మీ వల్లే సిస్టర్ వేలకి వేలు పెట్టు బట్టలు కొనుక్కుంటూ అన్ని పార్టీలకు వెళ్తుంది. 
 

47

ఇప్పుడు ఎందుకు పనికిరాని మా బావతో వెళ్లి తిరుగుతుంది. మీరు ఇలా ఊరుకోకూడదు అని అనగా అవును నేను ఊరుకోకూడదు నాలో ఉన్న క్రూరత్వాన్ని కూడా బయటకు తెస్తాను బంగారానికి నేను ఏంటో చూపిస్తాను అని అనుకుంటాడు అభిమన్యు. అప్పుడు కైలాష్ మనసులో, కాపురాలకు నిప్పు పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో యష్ మాళవికను వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకువచ్చి మంచం మీద పడుకోబెడతాడు. నాన్న అమ్మకు ఏమైంది అని అడగగా, ఏమీ లేదు అది నేను బానే ఉన్నాను.
 

57

 లాయర్ కోసం హోటల్ కి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అని మాళవిక చెప్పగా థాంక్స్ నాన్న అని ఆది అంటాడు. నాన్నకి థాంక్స్ చెప్పడం ఎందుకురా మనిద్దరి కోసం నాన్న ఎప్పుడూ ఉంటారు అని మాళవిక అంటుంది. నేను ఇంక బయలుదేరుతాను అని యష్ అనగా ఇంకొంచెం సేపు ఉండు నాన్న అని ఆది అంటాడు.  వద్దు అది నాన్న కోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు కదా వెళ్లని అని మాళవిక అనగా, ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయ్యు ఆది నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు యష్. మరోవైపు జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకున్న వేద ఇంట్లో మంచం మీద కూర్చొని బాధపడుతూ, నాకెందుకు ఇలా జరుగుతుంది.
 

67

 ప్రతి అడుగులోనూ బాధలే ఉంటున్నాయి. ఇవన్నీ వదిలేసి దూరంగా పారిపోవాలని ఉన్నది, అన్ని సంబంధాలు తెంచుకొని వెళ్లిపోవాలని ఉన్నది. కానీ నా ఖుషి కి నేను దూరం అవుతాను అంటే భయం గా ఉంది. తనే నా ప్రాణం, తనే నా జీవం తనం లేకుండా నేను ఉండలేను. నేను ఇది అంతా ఓర్చుకుంటుంది కేవలం ఖుషి కోసమే అని వేద అనుకొని ఏడుస్తుంది. వెనకాతల నుంచి ఖుషి వేద కళ్ళు కప్పి నేనెవరు అని అంటుంది. అప్పుడు వేద కన్నీళ్లు చూసి, ఏమైందమ్మా బాధపడుతున్నావు అని అనగా ఏమీ లేదు ఖుషి కళ్ళల్లో నలకబడింది అని అంటుంది వేద.
 

77

 అప్పుడు ఖుషి, నువ్వు ఏడొద్దమ్మా నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని వేదని హద్దుకుంటుంది. నీకోసమే నమ్మ నేను బతుకుతున్నది నీ స్పర్శ కోసం, నీ భవిష్యత్తు కోసం అని వేదా అనుకుంటుంది వేద. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!
 

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved