MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: అసలు విషయం తెలుసుకుని షాకైన వేద.. సంతోషంలో అభిమన్యు..?

Ennenno Janmala Bandham: అసలు విషయం తెలుసుకుని షాకైన వేద.. సంతోషంలో అభిమన్యు..?

Ennenno Janmala Bandham: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 14 2022, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో వేద అక్కడికి రావడం చూసి యష్ మాళవిక ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు వేద సారీ అండి నేను మీకు చెప్పకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదిగో ఇతని వల్లే ఇతను మీ గురించి ఏదో వాగుతున్నాడు అని అంటుంది వేద. ఈ అభిమన్యు మీ గురించి నాకు మీరు అబద్ధాలు చెబుతున్నారని మీరు నన్ను మోసం చేస్తున్నారని, నా దగ్గర ఏదో రహస్యం దాచాలని ట్రై చేస్తున్నారంట, అంతేకాదు మీరు మాళవిక ని కాపాడాలని ట్రై చేస్తున్నారంట అనడంతో యష్, మాళవిక ఇద్దరు షాక్ అవుతారు. అసలు మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు ఈ మాళవికనే అని అభిమన్యు చెబుతున్నాడు అంటుంది వేద.
 

27

ఆ మాటలు యష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అభిమన్యు అసలు ఏ మనిషి ఏం పని లేనట్టు ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతున్నాడు. అప్పుడు వేద ఈ అభిమన్యు చెప్పిన మాటలు అన్ని నిజమని చెప్పండి యష్ అని అంటుంది. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా మాళవిక మా అమ్మకు యాక్సిడెంట్ చేసినట్టు అయితే ఆయన ఇక్కడికి వచ్చి మాళవికతో ఎంజాయ్ చేయరు అని అంటుంది వేద. అప్పుడు వేద తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు.
 

37

 అంతేకాదు ఈపాటికి జైల్లో ఈ మాళవికతో ఊచలు లెక్క పెట్టించేవాడు అదే నిజాయితీ అంటూ యష్ పొగుడుతూ ఉంటుంది. అప్పుడు వేద చెప్పండి ఆ అభిమన్యుకి అతను మాట్లాడిన ప్రతి ఒక్క మాట పచ్చి అబద్ధం అని తేల్చి చెప్పండి అని ఉంటుంది. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు వేద మాట్లాడండి అని గట్టిగా అనడంతో ఏం మాట్లాడాలని గట్టిగా అరుస్తాడు యష్. ఇప్పుడు యష్ టెన్షన్ చూసిన వేద కన్నీళ్లు పెట్టుకుంటుంది.
 

47

అప్పుడు యష్  వేద అనుకుంటున్నట్లుగా నేను దేవుడిని కాదు అని అంటాడు. దయచేసి చేసి నువ్వు గొప్పగా మాట్లాడి నన్ను దేవున్ని చేయకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది వేద అంటాడు. అప్పుడు వేద మీ మాటలకి అర్థం ఈ మాళవికనే ఈ యాక్సిడెంట్ చేసిందా అని అనగా షటాప్ అని అంటాడు యష్. అప్పుడు అభిమన్యు శభాష్ అని చెప్పట్లు కొడుతూ డ్రామా చాలా బాగుంది అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అభి ఇప్పుడైనా అర్థమైందా వేద నీ మొగుడు మోసాలు చేస్తాడని నిన్ను మోసం చేస్తున్నారని అనడంతో వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
 

57

 ఇంతలోనే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఆదిత్య మనం పిక్నిక్ ఎంజాయ్ చేసింది చాలు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని అనటంతో అదేంటి మామ్ రేపటి వరకు ఉందాము అనుకున్నాము కదా అనడంతో అదేమీ లేదు వెళ్ళిపోదాం పద అని ఆదిత్యను బలవంతంగా తీసుకొని వెళుతుంది మాళవిక. అప్పుడు యష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు వేద కింద పడి గుండెలు విలిసేలా రోదిస్తూ ఉంటుంది.

67

 అప్పుడు యష్ మాట్లాడాలి అని చూడగా నాతో మీరు మాట్లాడొద్దండి ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పారు మీరు అని అంటుంది వేద. మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది ఆ మాళవిక అలాంటిది తనని మీరు కాపాడాలి అనుకుంటున్నారా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. నేను చెప్పేది విను వేద ఆ పని నేను తప్పుని సరి పరిస్థితులలో చేయాల్సి వచ్చింది అని అంటాడు యష్. మనం ఏం మాట్లాడుకున్నాం ఏ విషయం అయినా కానీ దాచు కూడదు అనుకున్నాం కదా మరి నాతో ఎందుకు చెప్పలేదు. ఎందుకు నా దగ్గర దాచారు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. ఇంతలోనే ఖుషి అక్కడికి వస్తుంది.

77

ఇప్పుడు వేద ఖుషిని గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు అయిపోయిందమ్మ అంతా అయిపోయింది అని ఖుషిని అక్కడినుంచి తెలుసుకొని వెళ్ళిపోతుంది వేద. అప్పుడు యష్ గట్టిగా అరుస్తూ ఎలా చెప్పాలి వేద నేను అలసిపోయాను ఓడిపోయాను వేద అని అంటాడు. యష్ కుమిలిపోతూ ఉండగా మరొకవైపు వేద కారులో వెళుతూ మరింత ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
Recommended image2
Dhurandhar 2 Collection: అతి పెద్ద రికార్డుకు అడుగు దూరంలో ధురంధర్ 2 , 17వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved