MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?

Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?

Killer Movie Accident: చెన్నైలో ఎస్.జె. సూర్య దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న 'కిల్లర్' సినిమా షూటింగ్ సెట్‌లో సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 03 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మళ్లీ దర్శకుడిగా మారిన ఎస్‌ జే సూర్య
Image Credit : facebook

మళ్లీ దర్శకుడిగా మారిన ఎస్‌ జే సూర్య

ఎస్‌ జే సూర్య తెలుగు ఆడియెన్స్ కి బాగా సుపరిచితమే. ఇక్కడ దర్శకుడిగా, విలన్‌గా బాగా పాపులర్‌. ఇటీవల ఆయన `సరిపోదా శనివారం` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. అంతకు ముందు `ఖుషి` సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళంలో పాపులర్‌ స్టార్‌గా రాణిస్తోన్న ఎస్‌ జే సూర్య.. మళ్లీ దర్శకుడిగా మారారు.  స్వీయ దర్శకత్వంలో 'కిల్లర్' సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో ఆయనే హీరో కావడం విశేషం. అయితే ఈ మూవీ షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కిల్లర్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం
Image Credit : X/iam_sjsuryah

కిల్లర్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

`కిల్లర్‌` సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం అందరినీ షాక్‌కు గురిచేసింది. చెన్నై పెరంబూర్‌లోని బిన్నీ మిల్స్ ప్రాంగణంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ఊహించని ప్రమాదంలో మదన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, వెంటనే అతనికి వైద్య సహాయం అందించారు. కానీ, చికిత్స పొందుతూ అతను మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో చిత్ర యూనిట్ సభ్యులు, సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

34
 నటనపై ఫోకస్‌ పెట్టిన సూర్య
Image Credit : our own

నటనపై ఫోకస్‌ పెట్టిన సూర్య

తమిళంలో 'వాలి', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్.జె. సూర్య, గత కొన్నేళ్లుగా నటుడిగా ఫుల్ బిజీ అయ్యారు. ముఖ్యంగా 'మానాడు' సినిమా తర్వాత విలన్‌గా, కీలక పాత్రల్లో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి, నటనపైనే పూర్తి దృష్టి పెట్టారు.

44
 పాన్‌ ఇండియా మూవీగా కిల్లర్‌
Image Credit : X/iam_sjsuryah

పాన్‌ ఇండియా మూవీగా కిల్లర్‌

దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఎస్.జె. సూర్య మళ్లీ 'కిల్లర్' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పాన్-ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతటి ప్రస్టీజియస్‌ మూవీ షూటింగ్‌లో ఈ దుర్ఘటన జరగడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్
Recommended image2
Rakul Preet Singh: రాంచరణ్ సినిమా నుంచి అజయ్ దేవగన్ మూవీ వరకు.. రకుల్ కెరీర్ లో టాప్ 10 బెస్ట్ రోల్స్ ఇవే
Recommended image3
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Related Stories
Recommended image1
Peddi Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ, రామ్‌ చరణ్‌కి అసలు పరీక్ష ఇదే..
Recommended image2
Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved