Guppedantha Manasu: సాక్షి, రిషీ సినిమా ప్లాన్.. కారు టైర్ పంచర్ చేసిన వసుధార!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వసుధార టేబుల్ పై కూర్చొని రిషీ గురించి ఆలోచిస్తూ గులాబీ రేకులతో లవ్ షేప్ చేస్తుంది. ఆ సమయంలోనే రిషీ వస్తాడు.. ఆ టేబుల్ పై కూర్చోండి అని అంటే నాకు ఆ టేబులే కావాలి అని అంటాడు.. అప్పుడు వెంటనే టేబుల్ పై గులాబీ రేకులను తుడిపేస్తుంది. ఇక రిషీ అక్కడ కూర్చొని ఇవి ఏంటి అని అడుగుతాడు.. గులాబీ రేకులు సార్ అని చెప్తుంది.
నాకు అలాగే కనిపిస్తున్నాయి కానీ ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని అడుగుతాడు. డెకరేషన్ కోసం పెట్టారు ఏమో అంటే సరే అని కూర్చుంటాడు. అతర్వాత గులాబీ రేకులతో రిషీ లవ్ షేప్ చేస్తాడు. అది అలానే చూస్తున్న వసును చూసి ఏం చూస్తున్నావ్ అంటే మీరు ఇంకా ఆర్డర్ చెప్పలేదు అని అంటుంది. అప్పుడు రిషీ వెటకారంగానే కాఫీ కోసం వచ్చాను కదా అని అంటాడు.
అయితే రిషీ చేసిన గులాబీ రేకుల హార్ట్ చూసి వసుధార ఒక ఫోటో తీసుకొనా సార్ అని అడిగితే రిషీ వెంటనే ఆ హార్ట్ ని తుడిపేస్తాడు. నా గుండె ముక్కలు చేసి ఈ హార్ట్ ఫోటో తీసుకుంటుందట అని ఉడుక్కుంటాడు. అప్పుడే కాఫీ తీసుకురావడానికి వెళ్లి రాగా అంతలోనే సాక్షి రిషీ పక్కన కూర్చొని ఉంటుంది. సీరియస్ గా చూస్తూనే రిషీకి కాఫీ ఇవ్వగా అప్పుడు హలో వసుధార అని సాక్షి అంటుంది.
అప్పుడు హలో మేడమ్ అనగా.. కొత్తగా మేడమ్ ఏంటో అని అంటే.. మీరు మా కస్టమర్ అందుకే ఇలా పిలుస్తున్న అని చెప్తుంది. ఓహ్ అలా కూడా ఉందా అని సాక్షి అంటుంది. ఇక సాక్షికి ఒక కాఫీ తీసుకురా అని వసుకి చెప్తే వసు వేరే వేయిటర్ కి చెప్పి అక్కడే ఉంటుంది. అప్పుడు సాక్షి రిషీతో నువ్వు నాకు ఒక సినిమా బాకీ ఉన్నావ్ అని అంటే హ వెళదాం అని అంటాడు.
ఆ మాట విన్న వసు ఓ రేంజ్ లో జలసీ ఫీల్ అవుతుంది. మరోవైపు గౌతమ్ వస్తాడు అని అంటే గౌతమ్ వస్తే ప్లాన్స్ అన్ని ఫెయిల్ అని దేవయనికి మెసేజ్ చెయ్యగా అక్కడ దేవయని గౌతమ్ ను ఆపేస్తుంది. గౌతమ్ కు వేరే పనులు చెప్పి నువ్వు వెళ్తే ఫీల్ అవుతా అని దేవయని అంటుంది. దాంతో గౌతమ్ అక్కడే ఉండిపోతాడు. ఇక మరోవైపు వసు వాళ్లిద్దరూ సినిమాకు వెళ్ళేది ఉహించుకుంటుంది.
ఆ కలను భరించలేక బయటకు వెళ్లి రిషీ కారు పంచర్ చేస్తుంది. సాక్షితో సినిమాకు వెళ్తారా.. ఇప్పుడు వెళ్ళండి ఎలా వెళ్తారో నేను చూస్తానని గాలి పీకేస్తుంది. ఇక వాళ్లిద్దరూ బయటకు రాగ అప్పుడే వసు బయటకు వచ్చి బై సార్.. బై సాక్షి అంటుంది. అదేంటి అప్పుడే మేడమ్ లేదు అంటే.. మీరు ఇప్పుడు మా కస్టమర్ కాదు కదా అని వసు అంటుంది.
ఇక అతర్వాత మీ కారు టైరులో గాలి లేదు అని అంటే అయ్యో పంచర్ అయ్యిందే అని వసు అంటుంది. పంచర్ అయ్యిందో.. చేశారో అని సాక్షి అంటే రిషీ వసు వైపు చూస్తాడు.. ఏంటి సార్ నేనే చేశాను అనుకుంటున్నారా.. నాకు ఎం అవసరం అని వసు అంటుంది. ఇక గౌతమ్ రాడు అని తెలుసుకున్న రిషీ.. కారు పంచర్ అయ్యింది.. గౌతమ్ రావడం లేదు నాకు మూడ్ లేదు సినిమాకు రాను అని రిషీ అంటాడు.
ఆ మాటలకు సాక్షి అప్సెట్ అవుతుంది. ఇక అప్పుడే జగతి మహేంద్ర కారులో వస్తారు.. సాక్షిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యండి డాడ్.. నా కారు పంచర్ అయ్యిందని రిషీ చెప్తాడు. దాంతో మహేంద్ర సాక్షిని తీసుకెళ్లగా జగతి వసుధార రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. అక్కడ వసు జరిగిన విషయం అంత చెప్పి జెల్సిగా ఫీల్ అవుతుంటుంది. అయితే వెనుక రిషీ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.