- Home
- Entertainment
- Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
శ్రీధర్ జైల్ లోకి వెళ్ళడంతో.. దీపపై వేధిపులు మొదలు పెట్టారు పారిజాతం, జ్యోత్స్న. కాంచనకు ఫోన్ చేసి నానా మాటలు అంటుంది పారిజాతం. మరోవైపు శ్రీధర్ కు బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసులు షాక్ ఇస్తారు. ఇక ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో కాంచన ప్రశాంతంగా వంట చేసుకుంటు ఉంటుంది. అప్పుడే ఆమె ఫోన్ కు ఒక వీడియో వస్తుంది. అందులో తన భర్త శ్రీధర్ వల్ల ఫుడ్ బిజినెస్ లో కల్తీ జరిగిందని, దానికి పూర్తి భాత్యత తనదే అని అతను అంగీకరించడంతో.. శ్రీధర్ ను అరెస్ట్ చేసినట్టు ఆ వీడియోలో ఉంటుంది. దాంతో కాంచన కంగారుపడుతుండగా.. పారిజాతం ఫోన్ చేస్తుంది. వీడియో చూశావా అని అడుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది పిన్నీ అని కాంచన అడుగుతుంది. ఎప్పుడు జరిగితే ఏంటి..మీకు మా కుటుంబాన్ని ఇలా నాశనం చేయడం అలవాటే కదా..? అన్నం పెట్టినవారి నెత్తిన చేయి పెట్టడం మీకు బాగా తెలుసు అని తిడుతుంది. కాంచన వెంటనే స్పందించి.. నాకు నడిచే శక్తి లేదు కానీ.. లేకపోతే అరక్షణంలో నీ ముందు ఉండేదాన్ని అని అంటుంది. ఏంటి ఏం చేస్తావ్.. నేను అన్నదాంట్లో తప్పేముంది. అని అంటుంది పిన్ని. ఫోన్ లోనే కాదు ఎదురుగా ఉన్నా అదే మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు నేనేం చేశాను అని ప్రశ్నిస్తుంది కాంచన. ఇంకేం చేయాలి... నువ్వేమో నీ అన్నకి ఇచ్చిన మాట విషయంలో మోసం చేశావ్.. నీ కోడలు, నీ కొడుకు అందరు మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడేమో నీ భర్త .. అవకాశం ఇచ్చి, అందలం ఎక్కించినందుకు, ఇలా కల్తీలు చేసి.. మమ్మల్నీ మా వ్యాపారాలను మోసం చేశాడు అని సూటి పోటి మాటలతో వేధిస్తుంది.
కోడలు ఐడియా అదుర్స్.. మామగారి బ్రతుకు మటాష్
కాంచనాను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంది ఆమె పిన్ని. ఊర్లో ఎవరి ముందు తలెత్తుకోకుండా చేశాడని కాంచనను, తన భర్త శ్రీధర్ ను, అందరిని కలిపి విమర్శిస్తుంటుంది. అది విని కాంచన తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు చెప్పు శివన్నారాయణగారికి కుతురు ఉండటం వల్ల ఉపయోగం ఏంటి. డబ్బుకోసం మరీ ఇంతలా దిగజారిపోతారా, కడుపుకి పెట్టేదానిలో కూడా కల్తీ చేశారంటే .. ఇంతకంటే దారుణం ఏముంటుంది అని అంటుంది. ఇంకా నిజాలేమి తేలలేదు పిన్ని.. అని కాంచన అంటుంది. ఇంకా ఏం తేలాలి చెప్పు.. నీ భర్త, అతని అల్లుడు ఆఫీస్ లో పెత్తనం చేస్తుంటే.. నీ కొడుకు ,కోడలు నా ఇంట్లో పెత్తనం చేస్తున్నారు. ఆఫీస్ లో వాట అల్లుడికి, ఇంట్లో వాట కొడుక్కి అని అంటుంది. నువ్వు ఎలాంటిదానివో నాకు తెలుసు, నింద పడటానికి, నిజం అని నిరూపించడానికి తేడా నీకు ఎలా చెప్పాలి పిన్నీ అని కాంచన అంటుంది. నీ కోడలిని సన్మానించు.. నీ భర్త అరెస్ట్ కావడానికి కారణం నీ కోడలే, తాను చెపితే వినరని.. కార్తీక్ తో చెప్పించింది. నా ఇంట్లో వాళ్లు మాత్రం దీప, కార్తీక్ చెప్పినట్టు విని ఇదంతా చేశారు. శ్రీధర్ అరెస్ట్ అవ్వడానికి కారణం దీపనే. కోడలు ఐడియా అదుర్స్, మామగారి బ్రతుకు మటాష్ అంటూ.. టైటిల్ చెప్పి మరీ వెటకారం చేస్తుంది.
దీపపై మొదలైన వేధింపులు
నాకే ఫోన్ చేసి ఇన్ని మాటలు అన్నదంటే.. అక్కడ ఉన్న దీపను ఇంకెన్ని మాటలు అంటుందో .. అని కాంచన బాధపడుతూ ఉంటుంది. ఈక్రమంలో దీప వంట చేస్తూ.. అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. మామ శ్రీధర్ అరెస్ట్ గురించి మదిలో మెదులుతూ ఉంటుంది. శ్రీధర్ అరెస్ట్ సీన్ ఆమె కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లు నానా మాటలు అనడం ఆమెకు బాధ అనిపిస్తుంది. దీపను ఇంట్లో ఉన్న ఆమె వ్యతిరేక వర్గం ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. పారిజాతం, ఆమె మనవరాలు జ్యోత్స్న దీపను నానా మాటలు అంటారు. మామకు ఫుడ్ ఐడియా ఇచ్చి.. జైల్లో పడేలా చేసిందని అంటారు. శ్రీధర్ ఇద్దరు భార్యలతో హ్యాపీగా ఉండేవాడు. స్వప్నపెళ్లితో ఒక భార్యను దూరం చేసింది. ఇప్పుడిప్పుడే వాళ్లు కలుస్తున్నారు అనుకుంటే.. రెండో భార్యను కూడా దీప దూరం చేసింది. బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళా అంటారు. దీప మెడలో తాళ పడింది కార్తీక్ రోడ్డున పడ్డాడు. దీప కడుపులో బిడ్డ పడింది మామగారు స్టేషన్ లో పడ్డారు. ఇంక ఆ బిడ్డ భూమి మీద పడిత ఎంత మంది పోతారో అని పారిజాతం అంటుంది.
పారిజాతానికి ఇచ్చిపడేసిన దీప
పారిజాతం మాటలకు దీపకు కోపం వస్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి.. నా బిడ్డ గురించి మాట్లాడితే ఊరుకోను. ఇంతకు ముందే చెప్పాను అని దీప వార్నింగ్ ఇస్తుంది. నీ మామకు శిక్షపడి నీ పని అంతే.. కాంచనను అడ్డు పెట్టుకుని నీ ఆట కట్టిస్తాను అంటుంది పారిజాతం. బావతో కలిసి మామను బయటు తెస్తాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నావ్ అని అంటుంది జ్యోత్స్న. నిజం నిప్పులాంటిది. ఎలా అయినా బయటకు వస్తుంది. కార్తీక్ పట్టుదలతో అనుకున్నది సాధిస్తాడు అంటుంది దీప. చూద్దాం ఏం చేయగలుగుతారో మీరు అని జ్యోత్స్న వెటకారం చేస్తుంది. దీప ఇవన్నీ తలుచుకుని బాధపడుతుంది. జ్యోత్స్నమాత్రం మీరుఅనుకున్నవన్నీ జరగకుండా నేను చేస్తాను అని అనుకుంటుంది.
మరో ప్లాన్ వేసిన జ్యోత్స్న
ఫుడ్ లో కల్తీ ప్లాన్ అంతా జ్యోత్స్నదే. వైరాతో కలిసి ఇదంతా చేస్తుంటుంది. వైరాకు ఫోన్ చేసి. ఈ విషయంపై ఆమె మరో ప్లాన్ కూడా చెపుతుంది. దీప ఎలాగైనా విషయం భయటపెడుతుందన్న ఆలోచనతో ప్లాన్ బీ ని రెడీ చేస్తుంటుంది. శ్రీధర్ ను అక్కడి నుంచి వెళ్లగొట్టి.. కంపెనీకి సీఈవో అవ్వాలని ప్లాన్ వేస్తుంది. తనకు ఈ విషయంలో సహకరించిన వైరాకి సంగం షేర్స్ కూడా జ్యోత్స్న ఆఫర్ చేస్తుంది. అయితే తన మనసులో మాత్రం తాను సీఈవో అయిన తరువాత వైరాను కూడా అడ్డు తొలగించడానికి మరో పథకం రెడీ చేసుకుంటుంది.
శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు ఎదురుదెబ్బ
అటు పోలీస్ స్టేషన్ లో శ్రీధర్ బాధపడుతుండగా.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కొడుకు కార్తీక్, మామ శివ నారాయణ వస్తారు. ఎస్ఐ మాత్రం బెయిల్ ఇవ్వడం కుదరదు.అని అంటాడు. అసలు రెస్టారెంట్ ఓనర్ మీరే కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఫుడ్ ట్రక్ బాధ్యత అంతా నాదేనని శ్రీధర్ ఒప్పుకున్నాడు. కత్తీ ఫుడ్ తిని హాస్పిటల్ లో ఉన్నవారు ఎలా ఉన్నారో తెలియదు, డాక్టర్ రిపోర్ట్ కూడా రాలేదు. దాంతో పాటు.. కల్తీ ఫుడ్ ఇచ్చారనేదానికి తమ వద్ద బలమైన సాక్ష్యం ఉందని రికార్డింగ్ వినిపిస్తాడు ఎస్ఐ. అంతే కాదు సాక్ష్యంగా కాశీని చూపిస్తాడు. దాంతో అక్కడ ఉన్నవారు అంతా షాక్ అవుతారు. కాశీ సాక్ష్యం చెప్పాడని, బెయిల్ ఇవ్వడం కుదరని అంటాడు ఎస్సై. కావాలనే కొన్ని మాటలు ఎలా రికార్డు చేస్తారు? చిన్న మిస్టేక్ జరిగిందని కార్తీక్ అంటాడు. కానీ ఫుడ్ ఎక్కువగా మిగిలిపోయిందని మామయ్య కాల్ చేశారు. ఫుడ్ బాలేదు పడేస్తానని అంటే పంచమన్నారని కాశీ చెప్తాడు. నేను బెయిల్ ఇవ్వడం కుదరదు. మీరు కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోమంటాడు ఎస్సై.
కార్తీక్ తో బాధను పంచుకున్న శ్రీధర్..
కార్తీక్ వెళ్లి తండ్రితో మాట్లాడతాడు. అల్లుడు కదా.. మీతో కలిసి మంచిగా పనిచేసుకుంటాడు అనే స్వార్థంతో పీఏగా పెట్టుకున్నా. మామగారు నాపై ఎలా అధికారం చూపించాడో.. నేను కూడా నా అల్లుడి మీద అలాగే అధికారం చూపించా. కోపంతో మాటలంటే సిన్సియర్ గా ఉంటాడని అనుకున్నా. కానీ కానీ వాడికి బాధ ఉంది. నన్ను వదిలించుకునే రోజు కోసం వాడు ఎదురు చూస్తున్నాడని అనుకోలేదు. నేను ఈ విషయంలో నమ్మించలేను..అని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. నా తండ్రి ఏ తప్పు చేయడు, కాశీతో మాట్లాడతానని కార్తీక్ శ్రీధర్ కు ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు. ఇక్కడితో ఈ రోజు కార్తీక దీపం కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

