- Home
- Entertainment
- Guppedantha Manasu: నువ్వు రిషీని ప్రేమిస్తున్నావ్ వసుధార.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్?
Guppedantha Manasu: నువ్వు రిషీని ప్రేమిస్తున్నావ్ వసుధార.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుటుంది. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు (Vasu) ఒక పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్లి మా రిషి (Rishi) సార్ ను నువ్వే బాగు చేయాలి అమ్మ అంటూ.. గట్టిగా దండం పెట్టుకుంటుంది. ఇక వసు తిరిగి మళ్లీ దేవయాని ఇంటికి వెళ్లగా.. మళ్లీ ఎందుకు వచ్చావ్? అని దేవయాని వసుకు అడ్డు పడుతుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? లేక నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేదా? అని అంటుంది.
రిషి (Rishi) సార్ ని ఒకసారి చూసి వెళ్తాను మేడం అని వసు (Vasu) అంటుంది. రిషి ను చూడ్డానికి నువ్వు ఎవరు అని దేవయాని విరుచుకుపడుతుంది. అసలు నువ్వు ఈ ఇంటికి ఎందుకు రావాలి అని అడుగుతుంది. ఇక రాజుల ఉండే రిషి నీ మాయలో పడి ఇలా అయిపోయాడు అని అంటుంది. ఇక నీకు ఇంట్లో ఎవరూ హెల్ప్ చేయరు. చెయ్యనివ్వను కూడా అని అంటుంది.
ఇక మీకు దండం పెడతాను మేడం.. ఒకసారి నన్ను లోపలికి వెళ్లడం ఇవ్వండి అని వసు (Vasu) దేవయానిని వేడుకుంటుంది. ఆ మాటకు దేవయాని (Devayani) మెడ పట్టి గెంటించే దగ్గరకు తెచ్చుకోకు అని అంటుంది. ఇక వసు మాటలకు అసహనం వ్యక్తం చేసిన దేవయాని.. వసు ను గేటు దగ్గరకు గెంటేసి రా అని ధరణి తో చెబుతుంది. ఆ మాటకు వసు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.
ఇక మరోవైపు సృహ లో లేని రిషి (Rishi) వసు ను ఊహించుకొని ఒక్కసారిగా కళ్లు తెరిచి వసుధరా అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాట విన్న వసు (Vasu) వెనక్కి తిరుగుతుంది. ఇక రిషి కింద పడుతూ ఉండగా సాక్షి రిషి ను పట్టుకో బోతుంది. దానికి రిషి నేను కింద పడ్డా..పరవాలేదు కానీ నువ్వు నన్ను పట్టుకోవద్దు అని అంటాడు. ఇక ఈ పరిస్థితుల్లో రిషి ను డిస్టర్బ్ చేయవద్దు అని మహేంద్ర దంపతులు సాక్షి కి చెబుతారు.
ఇక ఆ తరువాత రిషి (Rishi) నాకు ఏం జరిగింది డాడ్.. నన్నెవరు ఇంటికి తీసుకువచ్చారు అని అడుగుతాడు. ఇక పక్కనే ఉన్న చున్నీ చూసి నన్ను వసుధరా (Vasudhara) తీసుకొని వచ్చింది కదా అని అంటాడు. ఇక మహేంద్ర నువ్వు కాలి నడక న నడవడం ఏమిటి? నానా అని అడుగుతాడు. ఈ క్రమంలో మహేంద్ర రిషి ని తన భుజం మీద సపోర్టివ్ గా పెట్టి నడిపించుకుంటూ బయటకు తీసుకు వెళ్తాడు.
తరువాయి భాగం లో గౌతమ్ (Goutham) వసు దగ్గరకు వెళ్లి నువ్వు నిజంగా రిషి (Rishi) ను వద్దనుకునే దానివైతే.. ఈ రకంగా ఎందుకు బాధ పడుతున్నావు అని అడుగుతాడు. ఇక వసు రిషిను వీడియో కాల్ ద్వారా చూసి.. ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.