Guppedantha Manasu: వసు నిర్ణయానికి షాకైన చక్రపాణి.. మహేంద్రలో మొదలైన అనుమానం?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనని నమ్ముకున్న వాళ్లే తనకి ద్రోహం చేయటంతో వాళ్ల మీద ద్వేషంతో ఒంటరిగా మిగిలిపోయిన ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి కాలేజీకి రావడానికి చూస్తారు కేడి బ్యాచ్. వీడు మళ్ళీ వస్తున్నాడు బహుశా లెక్చరర్ ఏమో అంటాడు ఒక వ్యక్తి. నిన్న క్లాస్ తీసుకోకుండా వెళ్ళిపోయాడు అంటే ఈ రోజు నుంచే కాలేజీలో జాయిన్ అవుతున్నాడేమో వీడి సంగతి చూద్దాం పదండి అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు కేడి బ్యాచ్.
మరోవైపు ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చిన వసుధార మురుగన్ కి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి గురించి అడుగుతుంది. అవును మేడం ఆయన మన చైర్మన్ గారికి కావాల్సిన వ్యక్తి అంట. ఈరోజు నుంచి మన కాలేజీలో లెక్చరర్ గా కూడా జాయిన్ అవుతున్నారు. ఆయన వల్ల అయితేనే ఈ కాలేజీ బాగుపడుతుంది. మన కాలేజీకి మంచి రోజులు రాబోతున్నాయి మేడం అని సంతోషిస్తాడు ప్రిన్సిపల్. ఆయన పేరు ఏంటి సార్ అని అడుగుతుంది వసు.
రిషి అంటాడు ప్రిన్సిపల్. ఒక్కసారిగా షాక్ అవుతుంది వసు. ఏంటి మేడం అలా అయిపోయారు ఆయన మీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతాడు ప్రిన్సిపల్. అంతలో అటెండర్ వచ్చి రిషి సార్ వస్తున్నారు అని చెప్తాడు. వాళ్ళిద్దరి కన్నా ముందే వసు తొందరగా బయటికి వెళుతుంది. ఆ తొందరలో అట్నుంచి వస్తున్న రిషికి డాష్ ఇస్తుంది. ఒకరిని చూసుకుని ఒకరు షాక్ అవుతారు.
నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఇకమీదట ఇలా చేయను అంటూ రిషిని హత్తుకుంటుంది వసు. ఇంతలో పక్కనున్న మేడం ఏంటి మేడం అలా చూస్తూ ఉండిపోయారు ఆయనే మన కాలేజీకి కొత్తగా వచ్చిన లెక్చరర్ అని పక్కన ఉన్న లెక్చరర్ చెప్పడంతో స్పృహలోకి వస్తుంది వసు. ఆయన పేరు అని లెక్చరర్ చెప్తూ ఉండగానే రిషి అంటుంది వసుధార. ఏంటి మేడం మీకు ఇంతకుముందే తెలుసా అంటుంది లెక్చరర్. ఈవిడ వసుధార సర్ మన కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ అని పరిచయం చేసి క్లాస్ కి టైం అవుతుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లెక్చరర్. కోపాన్ని ఆపుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
రిషి వెనుక పరిగెడుతుంది వసు కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వసుని చూసి షాక్ అవుతాడు చక్రపాణి ఈ టైంలో వచ్చింది ఏంటి అనుకుంటాడు.అదే విషయం కూతుర్ని అడుగుతాడు చక్రపాణి. రిషి సార్ గురించి చెప్తుంది వసు. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం నాన్న అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిన చక్రపాణి ఎందుకు అలా అనుకుంటున్నావు అంటాడు. ఆరోజు ఆయన కళ్ళల్లో ఉన్న కోపం ఇప్పటికీ ఉంది. ఇక మీదట ఆయన నన్ను క్షమించేది లేదు కోపంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే స్టూడెంట్స్ నష్టపోతారు.
ఇప్పుడు కాలేజీకి ఎన్ని అవసరం కన్నా ఆయన అవసరమే ఎక్కువ ఉంది అని ఊరు బదిలీ వెళ్ళిపోవటానికి తండ్రిని ఒప్పిస్తుంది వసు. ఆ తర్వాత రిషి సార్ కోసం మహేంద్ర సర్ ఎంతో తపన పడుతూ ఉంటారు ఆయనకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అనుకొని ఫోన్ చేస్తుంది. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటాడు చక్రపాణి. మహేంద్ర సర్ కి అంటుంది వసు. వెంటనే ఆమె దగ్గర ఫోన్ లాక్కొని అలాంటి పని చేయకు ఇప్పటికే రిషి సార్ కోపంగా ఉన్నారు అన్నావు.
అలాంటిది మహేంద్ర సర్ ని చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. కొద్దిరోజుల్లో సార్ కోపం తగ్గొచ్చు అప్పుడు మహేంద్ర సార్ కి చెబుదాము అనడంతో ఫోన్ పెట్టేస్తుంది వసు. మరోవైపు తన ఫోన్ చూసుకున్న మహేంద్ర ఎవరిదో మిస్డ్ కాల్ ఉందని చెప్పి తనే కాల్ చేస్తాడు. చేసింది మహేంద్ర అని తెలియక నేను చక్రపాణిని మాట్లాడుతున్నాను ఎవరు కావాలి అని అడుగుతాడు చక్రపాణి. చక్రపాణి అనేసరికి షాక్ అవుతాడు మహేంద్ర. ఇంతలోనే వసు రావడంతో ఎవరు మాట్లాడుతున్నారు చూడు అని కూతురికి ఫోన్ ఇస్తాడు చక్రపాణి. ఫోన్ చుసిన వసు కంగారుపడి మహేంద్ర సార్ నాన్న అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది.
ఫోన్ చేసింది చక్రపాణి, వసుధార అని అర్థం చేసుకున్న మహేంద్ర మళ్లీ మళ్లీ తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చెయ్ అమ్మ లేకపోతే ఆయనకి అనుమానం వస్తుంది అంటాడు చక్రపాణి. ఫోన్ లిఫ్ట్ చేసిన వసుతో నాకు ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు మహేంద్ర. తరువాయి భాగంలో తన పోలీస్ ఫ్రెండ్ ని పిలిపించి చాలా సంవత్సరాలు తర్వాత వసు ఫోన్ చేసింది. నాకెందుకో వసుకి రిషి కనిపించాడేమో అనిపిస్తుంది అంటాడు మహేంద్ర.