MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధారని ఇంట్లోనుంచి వెళ్లిపోమని చెప్పిన చక్రపాణి.. రిషికి అబద్ధాలు చెప్పిన వసు?

Guppedantha Manasu: వసుధారని ఇంట్లోనుంచి వెళ్లిపోమని చెప్పిన చక్రపాణి.. రిషికి అబద్ధాలు చెప్పిన వసు?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
Published : Dec 26 2022, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో వసుధార, చక్రపాణి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్లగా ఎందుకొచ్చావు అని అంటాడు. అప్పుడు వసుధార నేను యూనివర్సిటీ టాపర్ వచ్చాను అనడంతో సుమిత్ర సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర ఏవండీ ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి రాకరాక ఇంటికి వస్తే ఇలాగేనా మాట్లాడేది అనగా మిత్ర అంటూ ఆమెపై కళ్ళు ఎర్ర చేస్తాడు చక్రపాణి. అప్పుడు వసుధార నాన్న అని పిలవడంతో నోరు ముయ్యి సిగ్గు లేదా నన్ను నాన్న అని ఎలా పిలుస్తున్నావు అని అంటాడు. నిన్ను కన్న పాపానికి ప్రతిరోజు నన్ను వీధిలో తల ఉంచుకొని నడుస్తున్నాను అని అంటాడు. పలానా చక్రపాణి కూతురు పెళ్లి పీట నుంచి లేచిపోయింది అని ప్రతి ఒక్కరు అంటుంటే ప్రాణాలు పోయేలా ఉండేవి అనగా నాన్న నేను గొప్ప చదువులు చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నాను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 విజయం సాధించాను అనడంతో ఎవరికి కావాలి నీ గొప్ప అని అంటాడు చక్రపాణి. పెళ్లి పీటల నుంచి ఎప్పుడైతే లేచిపోయావో అప్పుడే మీ నాన్న చక్రపాణి చచ్చిపోయాడు అని అంటాడు. నువ్వు కూడా ఎక్కడో ఒక చోట చచ్చిపోయావు అనుకోని బ్రతుకుతున్నాను అని అంటాడు. నాన్న నామీద ఎందుకు ఇంత కోపం అనడంతో చేసిందంతా చేసి నా మీద ఎందుకు కోపం అంటున్నావా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఏవండీ ఏంటండీ ఇది అని సుమిత్ర అనడంతో నువ్వు మాట్లాడకు కోపం వస్తే నేను మనిషిని కాదు అన్న విషయం నీకు తెలుసు కదా అని అంటాడు. ఊర్లో వాళ్లకు మాట్లాడుకోవడానికి ఇంకొక టాపిక్ దొరికింది ఇన్నాళ్లకు చక్రపాణి కూతురు వచ్చింది ఎక్కడ ఉందో ఏం చేసిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు అని బాధగా మాట్లాడతాడు.
 

37

ఆడపిల్ల తండ్రిగా పుడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని కోపంగా మాట్లాడుతాడు చక్రపాణి. ఇప్పుడు వసుధార వెళ్లి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి నేను బాగా చదువుకున్నాను నాన్న అనగా వసుధార పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధార, సుమిత్ర ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మరోవైపు రిషి ఒక హోటల్ కీ రూమ్ తీసుకోవడానికి  వెళ్తాడు. అప్పుడు వసుధార నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను అని మెసేజ్ చేస్తాడు. మరొకవైపు వసుధార తన సుమిత్ర ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఏడుస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్లినా కూడా మీ గురించే ఆలోచిస్తూ బాధపడ్డాను అమ్మ అనడంతో మళ్ళీ ఒక్కసారి అయినా ఫోన్ చేయలేదు కదా వసు  అని అనడంతో ఫోన్ చేసినట్టు తెలిస్తే మళ్లీ నాన్న నీపై ఎక్కడ కోప్పడతాడు అని నేను చేయలేదు అని అంటుంది వసు. 
 

47

ఇప్పుడు వసుధార సంతోషంతో అమ్మ నేను ఏ లక్ష్యంతో అయితే వెళ్లానో అది సాధించాను యూనివర్సిటీ టాపర్గా నిలిచాను అనడంతో సుమిత్ర సంతోషపడుతుంది. ఇంట్లో వాళ్ల గురించి అడగడంతో ఏం చెప్పాలి మనకు ఆ బాధలు ఎప్పటికీ తప్పవు అందరూ తలా ఒక దిక్కు విడిపోయారు మీ అక్క మాధవికి ఇంకా కష్టాలు తప్పలేదు అని బాధపడుతుంది. అమ్మ నువ్వేం బాధపడకు నేను వచ్చాను కదా ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాను అని ధైర్యం చెబుతుంది వసుధార. అన్ని బాగుంటే మన పెద్దక్క కొడుకుని మన దగ్గర పెంచుకుందాము అని సంతోషంగా మాట్లాడుతుంది వసుధార. యూనివర్సిటీ టాపర్ అయినందుకు కప్పు చూపిస్తూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి ఆ కప్పును విసిరి కొడతాడు.
 

57

నాన్న అనడంతో ఏం గొప్పగా చేశావని గొప్పగా చెప్పుకుంటున్నావు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తే ముఖం మీద ఉమ్మేస్తున్నారు అని అంటాడు చక్రపాణి. ఆడపిల్లకు పెళ్లి చేయడం చేతకాక బిడ్డనే వీడే పంపించాడని మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు వసుధర ఫోన్ రింగ్ అవుతుంది. నువ్వు గెలిచిన గెలుపు పోయిన పరువు తీసుకువస్తుందా నువ్వు చేసిన పనికి మెడ పైకెత్తుకోలేక తల దించుకుని వెళ్తున్నాను అని అంటాడు చక్రపాణి. రిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వసుధార ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళ నాన్నతో పోట్లాడుతూ ఉంటుంది. నేను అన్న మాటలు ఇంకా ఎవరినైనా అని ఉంటే విషయం తాగి చచ్చేవాళ్లు నువ్వు అలాగే ఉన్నావు అని అంటాడు చక్రపాణి. సుమిత్ర ఏం మాట్లాడకుండా కుమిలిపోతూ ఉంటుంది.
 

67

సుమిత్ర దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు ఇక్కడే ఉంటే మళ్ళీ నా పరువు తీస్తుంది అని అంటాడు. ఇది నా కడుపున ఎందుకు పుట్టిందో పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది అని అంటాడు చక్రపాణి. మరొకవైపు రిషి టెన్షన్ పడుతూ వసుధార కీ ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చినట్టు ఊహించుకుంటాడు. రూమ్ బాయ్ ఉండడంతో స్వారీ అని చెప్పి అసలు నాకేమైంది అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు జరిగిన విషయాలు తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే రిషి ఫోన్ చేయడంతో వసుధార కాల్ చేస్తాను అన్నావు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఏమైంది అని అడుగుతాడు రిషి.
 

77

అక్కడ అంతా ఓకే కదా ఏం ప్రాబ్లం లేదు కదా అనడంతో వసుధార అబద్ధాలు చెబుతూ అంతా ఒకే సార్ ఇది మా ఇండ్లే కదా ఏం ప్రాబ్లం ఉంటుంది అని అంటుంది. అప్పుడు వెంటనే రిషి నీ వాయిస్ లో ఎందుకో తేడాగా ఉంది నిజం చెప్పవచ్చు వసుధార అని అంటాడు. నిజం చెప్పు వసుధార నువ్వు ఏ విషయం గురించో బాధపడుతున్నావు కదా అనగా ఏం లేదు సార్ అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది వసుధార. రిషి ఫోన్ మాట్లాడుతుండగా అమ్మ వస్తున్నాను అని అబద్ధాలు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. స్వారీ రిషి సార్ నన్ను క్షమించండి మీకు అబద్ధాలు చెప్పాను అని అనుకుంటూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved