- Home
- Entertainment
- Guppedantha Manasu: ప్రేమిస్తున్నారంటే నాకు భయం వేస్తుంది సార్.. రిషీకి షాకిచ్చిన వసుధార!
Guppedantha Manasu: ప్రేమిస్తున్నారంటే నాకు భయం వేస్తుంది సార్.. రిషీకి షాకిచ్చిన వసుధార!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి(sakshi) మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి మీకు నాపై ప్రేమ పుట్టింది. ఒకవేళ సాక్షి రాకపోయి ఉంటే ఇది ప్రేమ అని తెలిసేది కాదేమో కదా సార్ అని అనడంతో అప్పుడు రిషి(rishi) వసుధార అని గట్టిగా అరుస్తాడు.
ఏం మాట్లాడుతున్నావు.. సాక్షి(sakshi) నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని అనడంతో అవును సార్ మీకు తనకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇప్పుడు సాక్షి వచ్చింది తనని వద్దు అనాలి అంటే ఒకరిని అవును అనాలి ఆ ఒక్కరిని నేనే అయ్యాను అంతే కదా సార్ అని అనడంతో అప్పుడు రిషి షట్ అప్ వసు(vasu) అంటూ కోపంగా అరుస్తాడు.
అప్పుడు రిషి నీ పై ఉన్న ప్రేమ కాస్త నాకు లేట్ గా తెలిసింది.. అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా. సాక్షి(sakshi) కి నాకు ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి నేను తప్పు చేశానా అని నిలదీస్తాడు. నిన్ను ప్రేమించడం తప్పు అంటావా అని రిషి(rishi) అనగా అప్పుడు వసు అసలు మీది ప్రేమ కాదు అని అంటాను సార్ అని అనడంతో స్టన్ అవుతాడు.
అప్పుడు వసు (vasu)మీరు అంటే నాకు ఇష్టమే కానీ మీరు అనుకుంటున్న ఇష్టం కాదు అని అనడంతో రిషి షాక్ అవుతాడు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఐలవ్యూ చెప్పగానే ఒప్పుకుంటాను అనుకుంటున్నారా అని అనగా నాకేమి తక్కువ అని అనడంతో వెంటనే క్లారిటీ అని అంటుంది వసుధార.
అప్పుడు వసు(vasu) సాక్షి మీద గెలవడానికి నన్ను ప్రేమిస్తున్నారు. అంతేకాకుండా మీరు జగతి మేడం అని అంటుండగానే మళ్లీ కోపంగా విరుచుకు పడతాడు రిషి(rishi) . మీరు కూడా అందరిలాంటి వారేనా సార్ అని అనడంతో అందరి లాంటి వాడిని కాదు కాబట్టి నువ్వు నన్ను గౌరవించి నన్ను ఇష్టపడ్డావు.
అంతేకాదు నేను రాత్రికి రాత్రి ఐ లవ్ యు అని చెప్పాలి అని అనుకోలేదు అని చెప్పి వసు(vasu) ని పట్టుకొని నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను వసు అని అంటాడు రిషి(rishi) . అప్పుడు రిషి చాలా ఎమోషనల్ అవుతు నా మీద నా ప్రేమ నిజం కాదు అని అంటుంది.
అప్పుడు రిషి నన్ను కాదు అనడానికి కారణం చెప్పు అని అనగా నేను మిమ్మల్ని ప్రేమించలేను మీరు సీజన్ మారినట్లుగా మారుతారు అంటూ చాలా దారుణంగా మాట్లాడుతుంది. అప్పుడు వసు మాటలకి రిషి ఆపు వసు(vasu) గట్టిగ అరుస్తాడు. అప్పుడు వర్షం పడుతున్న కూడా వసు పై ప్రేమ గా మాట్లాడుతున్న కూడా వసు మాత్రం పదే పదే సాక్షి పేరు ప్రస్తావన తెస్తూ రిషి ప్రేమ అపద్దం అని మాట్లాడడంతో రిషి(rishi) ఎమోషనల్ అవుతాడు.
అప్పుడు నేను నీకు వస్తువులా కనిపిస్తున్నానా సార్, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనగానే నేను నిన్ను ప్రేమించాలా సార్ అని గట్టిగా నిలదీస్తుందీ వసు(vasu). నేను నిన్ను ఎప్పటికి ప్రేమించలేను అని అనడంతో రిషి(rishi) ఎమోషనల్ అవుతాడు. అప్పుడు వసు రిషి గిఫ్ట్ రిటర్న్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తరువాత సాక్షి(sakshi) అక్కడికి వస్తుంది. ఆ తరువాత సాక్షి నువ్వు రిషి లైఫ్ లో నుంచి వెళ్ళిపోవాలి అని అనడంతో అప్పుడు వసు ఆపండి నేను రిషి సార్ స్టూడెంట్ ని ఆయన లైఫ్ లో నేను ఎందుకు ఉంటాను అని అనడంతో అసలు పూర్తిగా రిషి (rishi) లైఫ్లో లేకుండా వెళ్లిపోవాలి అని అంటుంది సాక్షి. తనని వదిలేసి వెళ్ళిపో అని అంటుంది.
నా చెల్లెలు లాంటిదని నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అని వసు(vasu)చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసినట్లుగా చేసి ఇలా రిక్వెస్ట్ చేసే టైప్ కాదు నేను అని నేను సాక్షి(sakshi) నేను అంటూ వసు పై అరుస్తుంది. ఇప్పటికి అయినా ఏమి కాలేదు రిషి నుంచి దూరంగా వెళ్ళిపో అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.