- Home
- Entertainment
- Guppedantha Manasu: అడ్డంగా దొరికిపోయి అవమానపడ్డ సౌజన్య రావు.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన మినిస్టర్!
Guppedantha Manasu: అడ్డంగా దొరికిపోయి అవమానపడ్డ సౌజన్య రావు.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన మినిస్టర్!
Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీరందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు.. పర్మిషన్లు పది రోజుల్లో రావటం కష్టమే కానీ అసాధ్యం కాదు కదా అంటాడు రిషి. అతను నిన్ను కావాలనే రెచ్చగొడుతున్నాడేమో అనిపిస్తుంది అంటాడు మహేంద్ర. అవును సార్ అతను మనల్ని కలిసిన ప్రతిసారి మాట మారుస్తున్నాడు. పెద్ద కన్నింగ్ ఫెలో లాగా ఉన్నాడు అంటుంది వసు. అతను ఏ ఎత్తుగడలతో ఈ ఛాలెంజ్ చేసాడో అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచించు అంటాడు మహేంద్ర. అక్కర్లేదు డాడీ.. పది రోజుల్లో పర్మిషన్స్ తీసుకువచ్చి ఈ రిషి అంటే ఏంటో సౌజన్య రావు కి చూపిస్తాను అంటాడు రిషి.
ఒకసారి ఆలోచించు అంటాడు మహేంద్ర. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి అని రిషి అనడంతో మహేంద్ర వాళ్ళు బయలుదేరుతారు. డల్ గా ఉన్న వసుని ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు రిషి. నాకు ఒక ప్రామిస్ చేయండి. ఒకవేళ అనుకున్నది జరగకపోతే అంటూ.. ఏదో మాట్లాడుతున్న వసు నోరు మూసేస్తాడు రిషి. నేనేమైపోతానో అని భయపడుతున్నావు కదా ఈ రిషికి ఎంత బాధనైనా భరించే ఓపిక ఉంది నువ్వేమి బాధపడకు అయినా మనం అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది అని వసు కి ధైర్యం చెప్తాడు రిషి. మరోవైపు డిబిఎస్టీ కాలేజీకి పర్మిషన్ రాకుండా చూసుకోమని ఎవరికో మెసేజ్ పెడతాడు సౌజన్య రావు.
కొన్ని రోజుల తర్వాత పర్మిషన్ రాలేదని తెలుసుకున్న రిషి మన కాలేజీకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కదా ఎందుకు రాలేదు అని వసుని అడుగుతాడు రిషి. సౌజన్య రావు ఇదంతా కావాలనే చేసాడు అంటుంది వసు. అవును ఇదంతా అతని కుట్రే అంటుంది జగతి. ఎమ్మెస్సార్ నీతో మాట్లాడటానికి వస్తానని ఫోన్ చేశారు అని చెప్తాడు మహేంద్ర. మరోవైపు సౌజన్య రావు, రిషి దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ చెప్పి మెడలో దండ వేస్తాడు. కోపంతో రగిలిపోయిన రిషి ఆ దండని విసిరి పారేస్తాడు. కోపాన్ని దానిమీద ఎందుకు చూపించడం నాతో చాలెంజ్ చేసే ముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి అంటాడు సౌజన్య రావు.
మీరు కుట్రలు, కుతంత్రాలు చేసి గెలిచారు అంటాడు మహేంద్ర. అలాంటి చేతకాని మాటలు మాట్లాడకండి ఎలా గెలిస్తే ఏముంది కావలసింది రిజల్ట్ అంటాడు సౌజన్య రావు. ఇంతకీ ఎప్పుడు మీ కాలేజ్ మా కాలేజీలో మెర్జ్ అవుతుంది, నువ్వు టైం చెప్తే మన కాలేజీలో రెండు కలిసిపోయినట్లుగా మీడియా వాళ్ళని పిలిచి చెబుదాము అంటాడు సౌజన్య రావు. అప్పుడే అక్కడికి వసుతో పాటు వచ్చిన జగతి కచ్చితంగా పిలుద్దాము వాళ్లు వస్తే మీరు ఎలాంటి కుట్రలు చేసి పర్మిషన్ తెచ్చుకున్నారో చెబుదాము అంటుంది. అంతకన్నా ముందు మనం ఒకటి వినిపించాలి మేడం అంటూ ఒక ఆడియో వినిపిస్తుంది వసు.
అది సౌజన్య రావు పర్మిషన్ కోసం లంచం ఇవ్వటానికి మాట్లాడిన మాటలు. ఆ వాయిస్ నాది కాదు అంటాడు సౌజన్య రావు. అయితే వీడియో చూడండి అంటూ తను డీలింగ్ మాట్లాడిన వీడియో చూపిస్తుంది వసు. ఇది కూడా మీరు కాదా అంటూ వెటకారంగా అడుగుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది అంటుంది వసు. తను అన్నట్లుగానే ఒక ఫోన్ కాల్ వస్తుంది సౌజన్య రావు కి. ఫోన్ చేసిన వ్యక్తి మీరు పర్మిషన్స్ లంచం ఇచ్చి కొనుక్కున్నారని రుజువైంది అందుకే మీ పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్తాడు. సౌజన్య రావు మొహం మాడిపోవడం చూసిన మహేంద్ర ఇంక వచ్చిన దారిన బయలుదేరండి అంటూ అతను తెచ్చిన దండని అతని మెడలోనే వేసి పంపిస్తాడు.
అవమానంతో వెళ్ళిపోతాడు సౌజన్య రావు. జరిగిన సంఘటనకి జగతి వాళ్ళు సంతోషిస్తుంటే రిషి మాత్రం సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతాడు. అతనిని కూల్ చేయటానికి నువ్వే కరెక్ట్ అంటూ వసుని పంపిస్తారు మహేంద్ర దంపతులు. భయపడుతూనే రిషి దగ్గరికి వెళ్లి ఏం జరిగినా బాధపడనని మాట ఇచ్చారు అంటుంది వసు. పర్మిషన్ తెచ్చుకోకుండా ఓడిపోయాను అంటాడు రిషి. ఓటమి మీ దరిదాపుల్లోకి కూడా రాదు అయినా మినిస్టర్ గారు మనతో అర్జెంటుగా మాట్లాడాలంట రమ్మన్నారు అంటుంది వసు. ఎందుకు అని అడుగుతాడు రిషి. తెలీదు కానీ రమ్మన్నారు ఆల్రెడీ జగతి మేడం వాళ్ళు వెళ్లిపోయారు అని వసు అనటం తో రిషి కూడా బయలుదేరుతాడు.
మరోవైపు తన దగ్గరికి వచ్చిన జగతి వాళ్లతో రిషి ఏడి అని అడుగుతాడు మినిస్టర్. వసు, రిషి కలిసి వస్తున్నారు సార్ అంటుంది జగతి. అప్పుడే వచ్చిన రిషి ని కంగ్రాట్స్ డి బి ఎస్ టి మెడికల్ కాలేజ్ ఎండి గారు అంటూ విష్ చేస్తాడు మినిస్టర్. ఆశ్చర్యంగా చూస్తాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.