MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: రిషి ముందు దేవయాని నటన.. జగతి కోసం రిషీతో వసు గొడవ?

Guppedantha Manasu: రిషి ముందు దేవయాని నటన.. జగతి కోసం రిషీతో వసు గొడవ?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Sep 28 2022, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దేవయాని జగతితో, రిషి అంటే చిన్నపిల్లాడు తనకి నీ గురించి తెలీదు కానీ నేను నీ గురించి అంతా తెలుసుకునే మాట్లాడుతున్నాను. చిన్నప్పటినుంచి నువ్వు ఎప్పుడు రిషికి హాని చేద్దామని చూస్తున్నావు అని అంటుంది  అప్పుడు మహేంద్ర దేవయానితో, వదినగారు మీరు ఇందులో తలదూర్చోద్దు ఇది మా సమస్య అని అంటాడు.దానికి దేవయాని ఏడుస్తున్నట్లు నటిస్తూ, అంటే నేను మీకు కాని దాన్ని అయిపోయానా! నువ్వు,రిషి,జగతి  ముగ్గురు ఒక కుటుంబం అంటున్నావా అని అంటుంది.అప్పుడు రిషి అక్కడికి వచ్చి మీ బాధపడొద్దు పెద్దమ్మ అని తీసుకెళ్లిపోతాడు.డాడ్ మీరు ఆ మాట అనడం నాకు నచ్చలేదు  అని అంటాడు.

28

దానికి మహీంద్రా నా ఉద్దేశం అది కాదు అని అన్నా వాళ్ళు పట్టించుకోరు.వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత జగతి మహీంద్రనీ హద్దుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రిషి కార్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఆ తర్వాత సీన్ లో  వసు గుడిలోకి వచ్చి దేవుడితో, రిషి సార్ చాలా మంచివారు తన తల్లి నీ తల్లి అని కూడా ఎందుకు పిలవలేక పోతున్నారు.అసలు మేడం చేసిన తప్పేంటి, రిషి సార్ ఎలాగైనా మేడమ్ ని అమ్మ అని పిలవాలి అని అనగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి అది జరగదు, జరిగే అవకాశం కూడా లేదు అని అంటాడు.అప్పుడు వసు మనం అనుకున్న ఏ విషయం అయినా ఎప్పటికైనా జరుగుతుంది సార్. దాన్నే మనం అద్భుతం అంటాము నాకు నమ్మకం ఉన్నది అని అంటుంది. 

38

ఎవరిని ఏం కోరుతున్నావు వసుధార,గురుదక్షణ వాగ్దానం నిలబెట్టుకోవడానికి బాగా కష్టపడుతున్నావ్ కదా అని అంటాడు.అప్పుడు వసు కష్టమంటే ఇది కాదు సార్ ఒక తల్లి తన కొడుకుకి దూరమై, కన్న కొడుకు చేత కూడా తల్లి అని పిలిపించుకోకుండా ఉండడం సార్ కష్టమంటే అని అంటుంది. అప్పుడు రిషి, నేను జగతి మేడం కోసం ఎన్నో మెట్లు దిగాను, కాలేజీలోకి రానిచ్చాను,లెక్చరర్ గా ఉండనిచ్చాను, ఇంట్లోకి రానిచ్చాను ఇంత చేసినా సరే తల్లి అని పిలవట్లేదు అని అంటారు కానీ చేసినవి ఏవి గుర్తు ఉండదు. నాకు జగతి మేడం అంటే గౌరవం ఉన్నది కానీ నేను తల్లి అని పిలవలేను అని అంటాడు. అప్పుడు వసు, నేను ఎలాగైనా మీ చేత పిలిపిస్తాను సార్ అని అంటుంది.

48

 దానికి రిషి నేను ముందే చెప్పాను వసుధార, ఇంక జగతి మేడం విషయం మనిద్దరి మధ్య రాకూడదని అయినా సరే నువ్వు నా మాట వినకుండా పదేపదే ఆవిడ ప్రస్తావనే తెస్తున్నావు అని అంటాడు. దానికి వసు,ప్రేమించడం అంటే ఇంకొకరి మాట వినడం కాదు సార్ వాళ్ళు తప్పు చేస్తే తప్పుని చెప్పడం కూడా.అన్ని విషయాలు లోనూ మంచిగా ఉండి ఈ ఒక్క విషయంలోనే చెడ్డగా ఉంటే మీకు ఆ మచ్చ ఉండడం నాకు నచ్చదు సర్. మా రిషి సార్ ఏ మచ్చ లేకుండా ఉండాలి అని అంటుంది.దానికి రిషి కోపంతో, అయినా జగతి మేడం మీ ఇంటికి ఎందుకు వచ్చారు? నీతో ఏం మాట్లాడారు?. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఎందుకు అన్నారు? అని అడగగా వసు ఆశ్చర్యపోయి, ఏమన్నారో తెలుసా సర్!మీ గురించే మాట్లాడారు. 

58

ఆవిడని అమ్మ అని పిలవకపోయినా పర్లేదు కానీ మనిద్దరిని బాగా ఉండమన్నారు. అది సార్ తల్లి ప్రేమ అని అనగా,ఆవిడకి లేని బాధ నీకెందుకు? ఆవిడే పిలవద్దంటుంది కదా అని అనగా ఒక తల్లి తన కొడుకు చేత అమ్మా అని పిలవకపోయినా పర్లేదు అని అన్న మాట రావాలంటే ఎన్నిసార్లు తన మనసు చంపుకుని ఉంటుంది సార్. అంత మంచి మనసు ఉన్న మేడం కోసమైనా నేను మీ చేత అమ్మా అని పిలిపిస్తాను అని అంటుంది వసు. దానికి రిషి కోపంతో నేను పిలవను అని చెప్పి  గంటను కోపంతో గట్టిగా కొడతాడు దానికి రిషి చేతిలో నుంచి రక్తం వస్తుంది. సార్ రక్తం వస్తుంది అని వసు  అనగా దెబ్బ తలిగితే రక్తమే వస్తుంది 

68

వసుధార,మనసుకి దెబ్బ తగిలితే రాదు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు  ఆ తర్వాత సీన్లో జగతి, మహీంద్రా,గౌతమ్ ఇంట్లో కూర్చుని ఉంటారు. అప్పుడు వాళ్లు రిషి ఎక్కడికి వెళ్లాడు అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో గౌతమ్ వసుధార దగ్గరికి వెళ్లి ఉంటాడా అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో వసు,రిషి లు కారులో వెళ్తూ సార్ మనం ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్దాం సర్ అని ఫస్ట్ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ రిషికి ఫోన్ చేస్తూ ఉంటాడు. రిషి ఫోన్ కట్ చేస్తాడు. మీకు ఎవరు ఫోన్ చేస్తున్నా సర్ అని అడిగిన రిషి చెప్పడు. తర్వాత గౌతమ్ వసుకి ఫోన్ చేయగా రిషి వసు తో ఫోన్ కట్ చేయని అంటాడు. అప్పుడు రిషి వసుధార తో, వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి అడిగితే నువ్వు ఇక్కడ జరిగిందేమి వాళ్ళకు చెప్పొద్దు అని అంటాడు.

78

నేను చెప్పను సార్ కానీ మీరు కట్టు కట్టించుకోవడానికి హాస్పటల్ కి పదండి అని అనగా రిషి వసుని బస్ స్టాప్ లో ఆపి దిగు ఇక్కడి నుంచి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. వసుధార నీ బస్ స్టాప్ లో వదిలేసి రిషి కాలేజ్ కి వస్తాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ కి పదండి సార్ అని వసు  అన్నట్టు ఊహించుకుంటాడు రిషి.దాని తర్వాత రిషి లోపలికి వెళ్లి  సోఫాలో పడుకుంటాడు. అప్పుడు వసు రిషి చేతికి మందు రాసి కట్టు కడుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని రిషి అనగా ప్రేమ సర్ నాకు మీ మీద ఉన్న ప్రేమ. మీరు అందర్నీ అంతలా ప్రేమిస్తారు కానీ ప్రేమించే గుణం ఉన్నప్పుడు క్షమించే గుణం కూడా ఉండాలి సార్ అని అనగా రిషి ఇంకా చాలు వసుధార.

88

నువ్వు నాకు క్షమించడం నేర్పిస్తున్నావా నువ్వు నా దగ్గర విషయాలన్నీ దాస్తావు ఏంటి అని అడిగితే లోకకళ్యాణం అంటావు అంతే కదా! నన్ను నా ఆలోచనను,మార్చే ప్రయత్నం చేయకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు వసు, మీరు ఇక్కడి నుంచి వెళ్తేనే నేను వెళ్తాను సార్ అని అంటుంది.అప్పుడు రిషి, నా మనసేం బాలేదు నేను వెళ్ళను అని అనగా, అయితే నేను వెళ్ళను సార్, మీకేనా మనసు ఉంది నాకూ మనసుంది అని వసు అంటుంది.నాతో నీకేంటి అని రిషి  అడగగా మీరు నేను ఒకటే కద సార్ అని వసు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గరు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image3
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved