- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషీ ఉగ్రరూపాన్నీ చూసిన వసు.. జగతి గురించి తప్పుగా మాట్లాడుతున్న కాలేజ్ స్టాఫ్?
Guppedantha Manasu: రిషీ ఉగ్రరూపాన్నీ చూసిన వసు.. జగతి గురించి తప్పుగా మాట్లాడుతున్న కాలేజ్ స్టాఫ్?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నీ సీరియల్స్ లా కాకుండా చదువు గొప్పతనం చూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. మరీ అలాంటి ఈ సీరియల్ లో ఈరోజు మార్చ్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు రిషీ కోసం కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తుంటుంది.. అప్పుడే రిషీ వస్తాడు.. ఆనందంలో అతని దగ్గరగా వెళ్ళినప్పటికి ఇంత త్వరగా వచ్చావు ఏంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె అదే ప్రశ్న వెయ్యగా.. నాకంటూ వేరే ప్రపంచం ఏం ఉందంటూ చెప్తాడు.
ఇక అప్పుడే జగతి వస్తుంది.. మహేంద్ర కూడా ఆ విషయాన్ని తెలుసుకుని వస్తాడు.. ఇద్దరు బాధ ముఖం పెట్టుకొని వస్తుండగా రిషీ ఇప్పుడు నన్నేం అడగకు అని వసు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రిషీ జగతి ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడుతారు. దూరం నుంచి వసు, మహేంద్ర ఆ విషయాన్ని గమనిస్తారు.
నీ కళ్ళల్లోకి ఎలా చూడగలను నాన్న.. జరిగిన దానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో కదా అని జగతి మనుసులో అనుకుంటుంది. అప్పుడే జగతి, వసు వస్తారు.. థాంక్స్ జగతి.. ఇక రావు ఏమో అని భయపడ్డాను అంటాడు. జగతి మాట్లాడుతూ సేమ్ రిషీ చెప్పిన ప్రపంచం డైలాగ్ చెప్తాడు.
అప్పుడు వసు.. ఇద్దరు ఒక్కట్టే, ఇద్దరి మనస్తత్వం ఒక్కటే కానీ దారులే వేరు అనుకుంటూ ఫీల్ అవుతుంది. ఇక ఆమె క్లాస్ లోకి వెళ్లగా పుష్ప వాళ్ళ ఇంట్లో విషయాన్నీ చెప్తుంది. కానీ వసు అది పట్టించుకోదు.. రిషీని ప్రశ్నించినట్టు వసు ఉహించుకుంటుంది.
ఇక రిషీ మనసు బాగు చెయ్యడం కోసం రిషీ కథ ప్రిన్స్, రాకుమారుడు అంటూ ఇండైరెక్ట్ గా చెప్తుంది.. నా గురించే కథలు చెప్తున్నావ్ కదా నీకు చులకన అయ్యాను అంటూ వసుపై రిషీ సీరియస్ అవుతాడు.. నా సమస్య నాది నీకు ఎలాంటి సంబంధం లేదంటూ సీరియస్ అవుతాడు.
అప్పుడే గౌతమ్ ఎంట్రీ ఇవ్వగా.. ఏంట్రా ఇద్దరు అలా ఉన్నారు అని అడుగుతాడు. పెద్దమ్మ భోజనం పంపింది దా తిందాం అంటాడు. నాకు భోజనం వద్దంటాడు రిషీ.. అప్పుడు మన ఇద్దరం తిందాం అంటూ గౌతమ్ అంటాడు.. దీంతో కుళ్లు తెచ్చుకున్న రిషీ మనం భోజనం చేద్దాం పదా అంటాడు.
మరోవైపు జగతి బాధ పడుతుంటుంది.. మహేంద్ర రిషీ గురించి ఆలోచించకు ఇద్దరి బాధ ఒక్కటే అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ తరువాయి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.