- Home
- Entertainment
- Guppedantha Manasu: కిడ్నాపర్స్ నుంచి ఎస్కేప్ అయిన వసుధార, రిషి.. అదిరిపోయే ప్లాన్ వేసిన రిషి?
Guppedantha Manasu: కిడ్నాపర్స్ నుంచి ఎస్కేప్ అయిన వసుధార, రిషి.. అదిరిపోయే ప్లాన్ వేసిన రిషి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో సౌజన్య రావ్ మిస్టర్ రిషేంద్ర భూషణ్ నిన్ను పడగొట్టాలని చాలాసార్లు ప్రయత్నించాను. ప్రతిసారి తప్పించుకున్నావు కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేవు అని అనుకుంటూ ఉంటాడు. మీ పేరు ప్రాక్యతలు మొత్తం ఈరోజుతో స్మాష్ మంట కలిసి పోతాయి అని అంటాడు. మరొకవైపు వసుధార, రిషి బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. సరి ఏం చేద్దాం ఇప్పుడు ఎలాగోలా బయటపడాలి అనడంతో కొద్దిసేపు ఆగు వసుధార అని అంటాడు రిషి. అప్పుడు పక్కనే ఒక కిటికీ ఉండడంతో దాన్ని ఓపెన్ చేయగా బయటకు వెళ్లడానికి మార్గం ఉండడంతో సంతోషపడుతూ రిషి వసుధార ఇద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు.
ఆ తర్వాత గేటు దగ్గరికి వెళ్ళగా అక్కడ రౌడీలు ఉండటం చూసి దాక్కుంటారు. ఇంతలోనే ప్రెస్ వాళ్లు రావడంతో ఇక్కడే ఉంటే ప్రమాదం జరిగిపోతుంది ఎలాగైనా వెళ్లిపోవాలి అని వసుధార రిషి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత బయటకు వెళ్తారు. మనల్ని మన కాలేజీలని పరువు తీయాలని చాలా పకడ్బందీగా ప్లాన్ వేశారు అందుకే ఇద్దరిని ఒకటే గదిలో బంధించారు అని అంటాడు రిషి. మనం మొబైల్ ఫోన్స్ కార్లు అని అక్కడే ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఎలా అనడంతో అవన్నీ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతే ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది అని అంటారు రిషి.
అర్జెంటుగా ఇంటికి వెళ్లాలి వెళ్దాం పద అని వసుధార,రిషి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతుండగా అప్పుడు వసుధర కాలికి గాజు పెంకు కుచ్చుకోవడంతో రిషి టెన్షన్ పడుతూ ఆ గాజు పెంకును తీసేస్తాడు. అప్పుడు తన కర్చీఫ్ తో వసుధార కాలికి కట్టు కడతాడు. అప్పుడు వసు నొప్పితో అల్లాడుతుండగా స్వారీ నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాను అని అంటాడు రిషి. అదేం లేదులెండి సార్ అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార నడవడానికి ఇబ్బంది పడుతూ ఉండగా రిషి వసుధారని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు.
ఆ తర్వాత ఆటో రావడంతో ఆటో డ్రైవర్ తో ఫోన్ తీసుకొని జరిగింది మొత్తం పోలీసులకు ఫోన్ చేసి వివరిస్తాడు రిషి. మరొకవైపు ఇంట్లో అందరూ వసుధార, రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని రిషి వాళ్ళు రాలేదు అని జగతి,మహేంద్ర లపై సీరియస్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ నేను అన్న మాటలే కనిపిస్తాయి కానీ రిషి మీద ఉన్న ప్రేమ మాత్రం కనిపించదు అని అరుస్తూ ఉంటుంది దేవయాని. మీ శిష్యురాలికి ఇదేమైనా పుట్టినిల్లు ఇక్కడ ఎలా ఉండాలో చెప్పాలి కదా అని జగతిపై సీరియస్ అవుతుంది. అప్పుడు ఓపికతో భరించిన ఫణింద్ర దేవయాని అని కోపంగా అరిచి ఓపికతో భరిస్తున్నారు కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే వసుధార, రిషి ఇద్దరు ఆటో దిగి రావడంతో అది చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
అప్పుడు దేవయాని రిషి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రిషి మీద సీరియస్ అవ్వగా పెద్దమ్మ ఆగండి అని సీరియస్ అవుతాడు రిషి. మేడం వసుధార కాలికి దెబ్బ తగిలింది ఫస్టైడ్ చేయండి అని చెప్పగా ఏం జరిగింది రిషి అనడంతో చెప్తాను ఆగండి పెద్దనాన్న అని అంటాడు రిషి. పెద్దమ్మ మేము ఇంటికి లేటుగా రావడానికి కారణం ఉంది కానీ మేము కావాలని లేట్ చేయలేదు అని అంటాడు రిషి. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని కాదు మేమిద్దరం సంతోషంగా ఉన్నాము అలా బయటకు వెళ్ళాము కానీ మాకు అపాయం పొంచి వస్తుందని ఊహించలేదు పెద్దమ్మ అని అంటాడు. సొసైటీ ఏమవుతుందని అంటున్నారు మీరు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు పెద్దమ్మ తప్పు చేసేవాళ్లే అలా భయపడతారు మేము అలా కాదు అని దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు రిషి.
మరొకవైపు సౌజన్య రావు నువ్వు చాలా సమర్థవంతుడివి రిషి నేను వేసిన ప్లాన్స్ ఎస్కేప్ అయ్యావు అని అనుకుంటూ ఉంటాడు నో ప్రాబ్లం మరొక ప్లాన్ వేస్తాను అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. మరొకవైపు వసుధార కాలికి జగతి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంత జరిగిందా అని అనగా అవును పెదనాన్న అని అంటాడు రిషి.
ఇదంత ఎవరు చేశారు బయటికి చెప్తే వాళ్ల పరువు పోతుంది అనగా నువ్వు ఇలా చేసే వాళ్ళని రెచ్చగొడుతున్న రిషి వాళ్లపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే ఎలా రిషి అనగా నేను వాళ్ళని వదిలిపెట్టి కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అని అంటాడు రిషి. అప్పుడు రిషి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను డాడ్ మనం విషయం గురించి పేపర్ లో యాడ్ న్యూస్ ఇద్దాము. అంటూ రిషి తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు.