వరుణ్ తేజ్ తో పెళ్ళి.. ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పిన లావణ్య త్రిపాఠి, ఎవరతను..?
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ ఆమె ఎవరిగురించి ఈ పోస్ట్ పెట్టింది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. రీసెంట్ గా ఆమె మెగావారింటి కోడలుగా అడుగు పెట్టింది. మెగా ప్రిన్స్.. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. దాదాపు 5 ఏళ్లుగా రహస్యంగా ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.
లాస్ట్ ఇయర్ నవంబర్ 1న ఇటలీలో లావణ్య మెడలో మూడు ముల్లు వేశాడు వరుణ్ తేజ్. ఈ పెళ్ళిలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కూడా సందడి చేశారు. ఇక పెళ్లి బడ్డల్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి తళుక్కున మెరిశారు. వారి పెళ్ళి బట్టలు ప్రత్యేక ఆకర్శణ గా నిలిచాయి.
ఇక పెళ్ళి జరిగిన రెండు నెలల తరువాత తాజాగా లావణ్య త్రిపాఠి ఓ పోస్ట్ పెట్టారు. వరుణ్ తేజ్ తో తన పెళ్లికి సబంధించి ఓ వ్యక్తికి ఆమె ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు., అతను ఎవరో కాదు మనీష్ మల్హోత్రా. అవును వరుణ్ , లావణ్య పెళ్ళికి ఆయన ప్రత్యేకంగా పెళ్లి బట్టలు దిజైన్ చేశారు. అవి వారికి ఎంతో స్పెషల్ గా నిలిచాయి.
క్రీమ్ కలర్ శర్వాణీలో వరుణ్ తేజ్.. రెడ్ కలర్ పెళ్లి చీరలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా కనిపించారు. అంతే కాదు పెళ్లికి వచ్చిన వారు కూడా వీరి పెళ్లి డ్రెస్ పై ప్రత్యేకంగా రివ్యూలు ఇచ్చారట. చాలా మంది సెలబ్రీటీలు వీరి పెళ్ళి ఫోటోలు చూసి కితాబిచ్చారట.
దాంతో ఈ రివ్యూస్ ను చూసిన లావణ్య త్రిపాటి... మనీష్ మల్హోత్రకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. తాజాగా ఫోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో తమ పెళ్ళి పోటోను శేర్ చేసింది లావణ్య.
ఇక మనీష్ మల్హోత్రా.. ఫేమస్ డిజైనర్.. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్ళి బట్టలన్నీ ఆయనే ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ వచ్చారు. హీరోయిన్ల స్పెషల్ అకేషన్స్ కు కూడా మనీష్ స్పెషల్ డ్రెస్ లు డిజైన్ చేస్తుంటారు. ఇప్పటి వరకూ జరిగిన సినీ,రాజకీయ ప్రముఖుల బట్టలు ఆయనేడిజైన్ చేశారు.
ఇక పెళ్ళి తరువాత వారి వారి సినిమాల్లో బిజీ అయిపోయారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి. లావణ్య కుసబంధించి ఓ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు..మరో సినిమా కూడా చేస్తున్నాడు వరుణ్.