చిరంజీవి కాళ్ల మీద పడిన ఈ పిల్లవాడు ప్రస్తుతం స్టార్ హీరో అని మీకు తెలుసా..? ఎవరో కనిపెట్టండి..?
ఈ ఫోటో చూశారా.. ఈ ఫోటోలో చిరంజీవికి సాష్టాంగ నమస్కారం పెడుతున్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరో అనీ మీకు తెలుసా..? ఇంతకీ ఎవరా చిన్నారి..?
ఈ ఫోటోచూశారా..? ఆ ఫోటోలో చిరంజీవి తో పాటు.. ఆయన తండ్రి ఉన్నాడు.అయితే చిరంజీవి కాళ్ళ మీద ఓ పిల్లాడు సాస్టాంగ నమస్కారం చేస్తున్నాడు చూశారా..? ఆ పిల్లోడు ఎవరు.. ? అతను ప్రస్తుతం ఓ స్టార్ హీరో అని మీకు తెలుసా..? ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఎందుకు ఇలా చిరంజీవి కాళ్ళకు మొక్కుతున్నాడు..?
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? అతను మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే.. అతను ఎవరో కాదు బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఈమెగా హీరో తన పెదనాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోని, అట్లాగే తన పెళ్లిలో చిరంజీవిని కౌగిలించుకున్న ఫోటోని షేర్ చేశాడు వరుణ్ తేజ్. అయితే ఈ ఫోటోను గతంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్.
గతంలో ఈ ఫోటోలు షేర్ చేసిన వరుణ్ తేజ్.. ఓ నోట్ కూడా రాశారు. మాకు ప్రతి సమస్యని నవ్వుతో ఎదుర్కోవడం నేర్పించినందుకు, ప్రేమ, అనుభంధాలతో మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్ డాడీ.... నువ్వే మాకు అతి పెద్ద ఇన్స్పిరేషన్. నువ్వు మాతో ఉన్నందుకు థ్యాంక్యూ. హ్యాపీ బర్త్ డే డాడీ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన పిల్లలతో పాటు నాగబాబు పిల్లలయిన వరుణ్ తేజ్, నిహారికలను కూడా ఎంతో ప్రేమగా పెంచారు. అంతే కాదు వరుణ్ చిరంజీవిని డాడీ అనిపిలుస్తాడు. నిహానిక కూడా చిరంజీవి దగ్గర చాలా స్వతంత్రంగా ఉంటుంది. మెగాస్టార్ ఇంట్లోనే ఎక్కువ శాంత నాగబాబు పిల్లలు పెరిగారట. ఇక ఫ్యామిలీ గెట్ టు గెదర్స్ లో మెగా కజిన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి సాలిడ్ హిట్ సినిమా పడి చాలా కాలం అయ్యింది. రీసెంట్ గా మట్క సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు వరుణ్. కాని ఈసినిమా నిరాశను మిగిల్చింది. ఎన్ని ప్రయోగాలు చేసినా మంచి హిట్ ను సాధించలేకపోతున్నాడు వరుణ్ తేజ్. గద్దల కొండ గణేష్ తరువాత ఆరేంజ్ సినిమాపడలేదు వరుణ్ తేజ్ కు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే వరుస ప్లాప్ లతో అల్లాడుతున్నాడు. ఈమధ్య కాలంతో వచ్చిన నాలుగైదు సినిమాల్లో వాల్తేరు వీరయ్య తప్పించి చిరంజీవికి పెద్దగా వర్కౌట్ అయిన సినిమాలు లేవు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మెగాస్టార్.. చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా పై మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఏమౌతుందో చూడాలి.