#VarunTej:వరుణ్ తేజ్ నెక్ట్స్ చిత్రం 'బ్యాక్ డ్రాప్' వింటే షాకే, మతి పోయే ఇన్ సైడ్ స్టోరీ
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. ఇంతకు ముందెప్పుడూ వరుణ్ ఇలాంటి పాత్ర చేయలేదని, ఈ పాత్ర కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాత్రేమిటో? దాని కథేమిటో? అసలు ఈ సినిమా ఏ జోనరో చూద్దాం.
Varun Tej
వరుణ్ తేజ్ రీసెంట్ గా చేసిన స్పోర్ట్స్ డ్రామా 'గని' డిజాస్టర్ అయ్యంది. ఇందులో అతను బాక్సర్ పాత్రను పోషించాడు. కిరణ్ కొర్రపాటి డైరక్ట్ చేసిన ఈ చిత్రం దారుణంగా ఫెయిలైంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించినా కలిసిరాలేదు. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచించి నిర్ణయించి ప్రకటించారు.
Varun Tej
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విషయం...వరుణ్ తేజ్ కొత్త చిత్రం గురించి. రొటీన్ కి భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టు లను ఎంచుకునే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ కొత్త ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ సారి కూడా ఏదొక కొత్తదనం ట్రై చేస్తూ ...వరుణ్ తేజ్ ఇప్పుడు తన 13వ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వీడియో అయితే బయటకి రాగా ఇది ఆసక్తి రేపుతోంది అని చెప్పాలి.
ఏదో స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా కనిపించి చివరిలో దానికి ఒక హ్యాపీ ఎండ్ కనిపించడంతో ఆనందించిన వరుణ్ లాస్ట్ లో ఒక జెట్ ని దానిపై పెట్టడంతో ఈ సినిమా ఒక దేశ భక్తి సినిమాల తరహాలో ఉంటుంది అని అనిపిస్తోందంటూ చర్చ మొదలైంది. అయితే ఇంతకీ ఈ స్క్రిప్టు దేని గురించి.....
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కథ బాలకోట్ వైమానిక దాడి చుట్టూ తిరుగనున్నట్లు తెలుస్తోంది. ఇది వరుణ్ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్టు అని సమాచారం. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది.
Varun Tej
ఇందులో భారతదేశానికి చెందిన అభినందన్ వర్ధమాన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.బాలకోట్ వైమానిక దాడి కు లీడ్ చేసిన విధానం...ఎలా ఆ దాడి సీక్రెట్ గా జరిగింది..దాని పర్యవసానాలు ఏమిటి అనే విషయాలు ఈ సినిమాలో చూపించనున్నారని వినికిడి.
Nagababu -Varun tej
ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి, పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్ పట్టణానికి సమీపంలో బాంబులు వేసాయి. ఇదే 2019 బాలకోట్ వైమానిక దాడి. ఫిబ్రవరి 26 ఉదయాన, పాకిస్తాన్ మిలిటరీ ఈ వైమానిక దాడి జరిగినట్లు ప్రకటించింది.
Nagababu -Varun tej
భారత విమానాలు తమ పేలోడ్‌ను బాలకోట్ సమీపంలో జనావాసాలు లేని కొండ ప్రాంతంలో వేసినట్లు ఆ ప్రకటనలో చెప్పింది. ఆ తరువాత అదే రోజున, వైమానిక దాడిని ధ్రువీకరించిన భారతదేశం, ఇదొక ఉగ్రవాద శిక్షణా శిబిరం లక్ష్యంగా చేసిన ముందస్తు దాడి అని, ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారనీ పేర్కొంది. మరుసటి రోజు, ఫిబ్రవరి 27 న పాకిస్తాన్, భారత్‌పై వైమానిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. దాని పైలట్, అభినందన్ వర్థమాన్ను పాకిస్తాన్ బందీగా పట్టుకుంది. మార్చి 1 న అతన్ని విడిచిపెట్టింది.
Nagababu -Varun tej
ఇక ఇప్పటికే విడుదల చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాపై అయితే ఫుల్ డీటెయిల్స్ ఈ సెప్టెంబర్ 19న బయటకు రానున్నాయి. మళ్ళీ వరుణ్ తేజ్ నుంచి ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ రాబోతుందని చెప్పాలి.
టేకాఫ్‌కి సిద్ధమవుతున్న ఓ ఫ్లైట్ బొమ్మని చూపించి `ఇక ఈసినిమా మొదలైపోతోంది` అంటూ హిట్ ఇచ్చారు. మొత్తానికి తొలి అడుగులోనే క్రియేటీవ్‌గా ఆలోచించి, ప్రాజెక్టుపై కాస్త పాజిటీవ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేశారు. సినిమాలోనూ ఇంతే క్రియేటివిటీ కనిపిస్తే వరుణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టే అంటున్నారు.
టాలీవుడ్( Tollywood) నుంచి వస్తున్న సినిమా కావడంతో.. పాన్ ఇండియా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పుకార్లు గట్టిగానే షికారు చేస్తున్నయి. అయితే ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈ సినిమా కన్ ఫార్మ్ అయితే మాత్రం.. ఫస్ట్ నుంచే అంచనాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.
టేకాఫ్‌కి సిద్ధమవుతున్న ఓ ఫ్లైట్ బొమ్మని చూపించి `ఇక ఈసినిమా మొదలైపోతోంది` అంటూ హిట్ ఇచ్చారు. మొత్తానికి తొలి అడుగులోనే క్రియేటీవ్‌గా ఆలోచించి, ప్రాజెక్టుపై కాస్త పాజిటీవ్ వైబ్రేషన్స్ వచ్చేలా చేశారు. సినిమాలోనూ ఇంతే క్రియేటివిటీ కనిపిస్తే వరుణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టే అంటున్నారు.
ఇక ఈ ఇన్ స్పైరింగ్ స్టోరీతో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కథతో సినిమా చేయాలని చాలా మంది ప్రత్నం చేశారు. కాని అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ రియల్ స్టోరీని వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కించాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీని కోసం చర్చలు కూడా జరుగుతున్నాయట. ఈ మూవీలో అభినందన్ వర్ధమాన్(Abhinandan Varthaman) పాత్రలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
బాలాకోట్‌పై భారత్ ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన మర్నాడు 2019 ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం ఎఫ్-16 యుద్ధ విమానంతో భారత్‌పై దాడికి ప్రయత్నించింది. పాక్ యుద్ధ విమానాన్ని భారత వైమానికదళ కమాండర్ అభినందన్ మిగ్-21 విమానంతో వెంబడించి నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో దూకేయగా అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
అభినందన్‌ను అప్పగించాలని భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో దాయాది దిగిరాక తప్పలేదు. అదే ఏడాది మార్చి 1న అభినందన్‌ను పాక్ సైన్యం అప్పగించిన తర్వాత.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి విధుల్లోకి చేరి దేశసేవను కొనసాగిస్తున్న క్రమంలోనే అభినందన్‌కు పదోన్నతి లభించింది. పాక్‌తో పోరాటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది.