వరుణ్ తేజ్ - లావణ్య రిసెప్షన్ ఫొటోలు.. విచ్చేసిన టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరు వచ్చారంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖుల, సినీ తారలు ఈ వేడుకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. రిసెప్షన్ ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, అతిథులు విచ్చేస్తున్నారు. గెస్ట్ లను తండ్రి నాగబాబు దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నారు.
వరుణ్ తేజ్ - లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరుగుతోంది.
రిసెప్షన్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేయించారు. ముఖ్యంగా ఈ వేడుకలోని అరెంజ్ మెంట్స్ ఆకట్టుకున్నాయి. డెకరేషన్ ఆకర్షణీయంగా ఉంది.
ఈ వేడుకకు నాగబాబు కుటుంబీకులతో పాటు బంధువులు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శకులు, నటీనటులు, కమెడియన్లు, ఇతర టెక్నిషీయన్లు కూడా హాజరై ఫొటోలకు ఫోజులిచ్చారు.
నటి ప్రగతి బ్యూటీఫుల్ శారీలో వేడుకలో మెరిసింది. న్యూలీ మ్యారీడ్ కంపుల్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఫొటోకు ఇలా ఫోజిచ్చింది.
వేడుకకు హాజరైన అతిథులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా తక్కువ కాకుండా గ్రాండ్ గా అరెంజ్ మెంట్స్ చేశారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ - లావణ్యల రిసెప్షన్ వేడుకకు కమెడియన్ అలీ కుటుంబంతో కలిసి హాజరయ్యారు. బోకే అందించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు దర్శకులు శేఖర్ కమ్ముల, వశిష్ట, డీవోపీ చోటాకే నాయుడు, పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు.
ప్రముఖ నటుడు, ట్రైయినర్ సత్యానంద్ కూడా వీరి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. వధూవరులనూ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫ్యామిలీతో కలిసి రిసెప్షన్ కు హాజరయ్యారు. నరూతన వధూవరులను ఆశీర్వదించారు.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సునీల్, సుబ్బరాజ్, జయసుధ, మురళీకృష్ణ, యాంకర్ సుమ కూడా హాజరయ్యారు. చైతూ స్టైలిష్ లుక్ లో మెరిసి వేడుకలో అట్రాక్షన్ గా నిలిచారు.
మిగితా అతిథులు, బంధువులు, సన్నిహితులు, సినీ ఇండస్ట్రీలోని ముఖ్యమైన వారు వేడుకకు హాజరై మెగా కపుల్స్ కు ఆశీర్వాదం అందించారు.
గ్రాండ్ ఏర్పాట్ల మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతోంది. గెస్ట్ లు, సన్నిహితులు నూతన వధూవరులకు గిఫ్ట్ అందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక, వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఇటలీలోని టుస్కానీ నగరంలో జరిగింది. ఓ లగ్జరీ రిస్టార్ట్ లో ఘనంగా పెళ్లి వేడుక ముగిసింది.
ఇప్పటికే వరుణ్ తేజ్ - లావణ్యల వెడ్డింగ్ ఫొటోలు, ఈ పెళ్లి మూలంగా ఓకే ఫ్రేమ్ లో మెరిసిన మెగా ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రస్తుతం రిసెప్షన్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేకంగా డిజైన్ చేయించిన అవుట్ ఫిట్లలో గ్రాండ్ లుక్ ను సొంతం చేసుకున్నారు.
ఈ రిసెప్షన్ కు ఇంకా మెగా హీరోలు, సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు కూడా హాజరుకానున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేళలకు వరుణ్ తేజ్ - లావణ్య ఒక్కటవడం.. పెళ్లి, రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరుగుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
పెళ్లి తరహాలోనే.. రిసెప్షన్ లోనూ ఎక్కడా తగ్గకుండా ఘనంగా వేడుకను నిర్వహిస్తున్నారు. అతిథులకు అన్ని రకాల మర్యాదలు చేస్తున్నారు.
మరోవైపు వరుణ్ - లావణ్యల పెళ్లి, రిసెప్షన్ సందర్భంగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సామాజిక మాధ్యామాల్లో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.