Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • క్రేజీ హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి.. రూ.25 లక్షల రింగ్ తో బెంగుళూరుకు పయనం ?

క్రేజీ హీరోయిన్ తో మెగా హీరో పెళ్లి.. రూ.25 లక్షల రింగ్ తో బెంగుళూరుకు పయనం ?

మెగా ఫ్యామిలిలో పెళ్లీడుకు వచ్చిన హీరోలు ముగ్గురు నలుగురు ఉన్నారు. పెళ్లి కానీ హీరోల గురించి తరచుగా గాసిప్స్ వైరల్ కావడం కామనే. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోల గురించి తరచుగా మ్యారేజ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

team telugu | Asianet News | Published : Jan 19 2022, 02:01 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

మెగా ఫ్యామిలిలో పెళ్లీడుకు వచ్చిన హీరోలు ముగ్గురు నలుగురు ఉన్నారు. పెళ్లి కానీ హీరోల గురించి తరచుగా గాసిప్స్ వైరల్ కావడం కామనే. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోల గురించి తరచుగా మ్యారేజ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఓ బలమైన క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

27
Asianet Image

ఓ మెగా హీరో బెంగుళూరులో నివాసం ఉంటున్న హీరోయిన్ కోసం 25 లక్షల ఖరీదైన రింగ్ తో బెంగుళూరుకు పయనమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతటి కాస్ట్లీ రింగ్ ఆమె కోసం కొన్నాడంటే విషయం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

37
Asianet Image

ఆ మెగా హీరో మరెవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో టాక్. ఇక హీరోయిన్ ఎవరంటే క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాఠి అంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా మిస్టర్, అంతరిక్షం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. పైగా నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ రూమర్స్ కు బలం చేకూరుతోంది. 

 

47
Asianet Image

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖరీదైన రింగ్ తో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మీడియాకు తెలియకుండా సీక్రెట్ గా ఇన్నేళ్లు ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి ఇటీవల హీరోయిన్ గా కాస్త వెనుకబడింది. దీనితో ఆమె వరుణ్ తో పెళ్ళికి సుముఖంగానే ఉన్నట్లు టాక్. 

57
Asianet Image

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిహారిక పెళ్ళికి హాజరైన అతితక్కువ మంది సెలెబ్రిటీలలో లావణ్య త్రిపాఠి ఒకరు. లావణ్య త్రిపాఠి ఆ సమయంలో వరుణ్ తేజ్ ఫ్యామిలీకి బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది. నిహారిక పెళ్లి తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేస్తానని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

67
Asianet Image

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించి వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది. కొందరు ఫ్యాన్స్ ఈ న్యూస్ ని రొటీన్ రూమర్ అంటూ కొట్టి పారేస్తుంటే.. మరికొందరు నిజం కావాలని కోరుకుంటున్నారు. వీరిద్దరూ జంటగా నటించిన మిస్టర్ మూవీ నిరాశపరిచింది. అంతరిక్షం చిత్రం మంచి ప్రయోగంగా ప్రశంసలు దక్కించుకుంది. 

77
Asianet Image

వరుణ్ తేజ్ ఈ ఏడాది గని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాక్సింగ్ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ సోదరి నిహారికకి కూడా పెళ్లయింది. దీనితో ఈ మెగా ప్రిన్స్ మ్యారేజ్ పై తరచుగా వార్తలు వస్తున్నాయి. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories