MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రీమ్-గోల్డ్ షేర్వాణిలో వరుణ్ తేజ్, కాంచీపురం పట్టు చీరలో లావణ్య.. పెళ్లి బట్టలు ఎవరు డిజైన్ చేశారంటే..?

క్రీమ్-గోల్డ్ షేర్వాణిలో వరుణ్ తేజ్, కాంచీపురం పట్టు చీరలో లావణ్య.. పెళ్లి బట్టలు ఎవరు డిజైన్ చేశారంటే..?

డెస్టినేషన్ వెడ్డింగ్ ను ఇటలీలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మూడు రోజుల పాటు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరగ్గా.. చివరి రోజు లావణ్య మెడలో మూడు ముళ్లు వేసి.. మెగా కోడలిని చేశాడు వరుణ్. ఇక పెళ్లికి వీరు ధరించిన బట్టల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇంతకీ ఆ బట్టలు ఎవరు డిజైన్ చేశారో తెలుసా..?  
 

Mahesh Jujjuri | Updated : Nov 02 2023, 07:28 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

మెగా బ్రదర్ నాగబాబు - పద్మజ తనయుడు..  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. ఇటలీలోని అత్యంత పూరాతన గ్రామం అయిన  టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఈ వేడుకలు అత్యద్భుతంగా  జరిగాయి. 

27
Asianet Image

తమ ప్రేమను మొదటి సారి వెల్లడించుకున్న చోటు ఇదే కావడంతో.. ఇక్కడే పెళ్ళి చేసుకుని..ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు జంట. మెగా హీరోల డాన్స్ లు, కోలాహలం మధ్య అందమైన ప్రకృతి అందాల నడుమ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ వెడికతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయారు. 
 

37
Asianet Image

అయితే ఈ వెడ్డింగ్ లో ప్రత్యేకతలు చాలా ఉన్నా.. ఈజంట పెళ్ళికి ధరించిన డ్రెస్ మరింత  ప్రత్యేకం అని చెప్పాలి. పెళ్ళిలో వరుణ్ తేజ్ క్రీమ్-గోల్డ్ షేర్వాణిని ధరించి చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.. అటు లావణ్య త్రిపాఠి కూడా.. ప్రత్యేకంగా  కూర్చిన కాంచీపురం చీరలో అద్భుతంగా కనిపించింది. ఇంతకీ ఈ జంట వేసుకున్న బట్టలు ఎవరు డిజైన్ చేశారంటే.. ఇండియాలో సెలబ్రిటీల కు వెడ్డింగ్ డిజైనర్ గా పేరున్న మనీష్ మల్హోత్రా  ఈ పెళ్ళి బట్టలు డిజైన్ చేశారు. 

47
Asianet Image

అయితే ఈ పెళ్ళి డ్రెస్ కోసం వారు లక్షల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరి పెళ్ళి బట్టలు దాదాపు 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఈ వెడ్డింగ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నితిన్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. 

57
Asianet Image

మొత్తంగా ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు కొంత మంది కలుపుకుని 120 మంది వరకూ హాజరయ్యారని అంచనా. అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం అవ్వగా.. ఆతరువాతి రోజు ఉదయం హల్దీ వేడుక, సాయంత్రం మెహందీ వేడుక జరిగింది. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 
 

67
Asianet Image

వరుణ్ పెళ్ళి సందర్భంగా అల్లు ఫ్యామిలీ  సందడి చేశారు. అల్లు అర్జున్ ఈ జంటకు సోషల్ మీడియా వేధికగా శుభాకాంక్షలు తెలిపారు. తన తనయుడు అయాన్ మరియు భార్య స్నేహతో స్పెషల్ సెల్ఫీ కూడా పంచుకున్నారు. 

77
Asianet Image

5 ఏళ్ల తమ ప్రేమ బంధానికి పెళ్ళి బంధంతో శుభం కార్డ్ వేసుకున్నారు టాలీవుడ్ జంట. చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్న వీరు.. వివాదాలు లేకుండా పెళ్ళి చేసుకున్నారు. నవంబర్ 1న వీరి పెళ్ళి ఘనంగా జరిగింద. ఇక ఈ వీక్ లోనే హైదరాబాద్ లో ఇండస్ట్రీ ప్రముఖులు, బంధువుల కోసం రిసెప్షెన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories