తల్లీ తండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిజమెంత?
గత ఏడాది ప్రేమ పెళ్లి చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇక పెళ్లి తరువాత వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. లావణ్య కూడా పెద్దగా సినిమాలమల్లో యాక్టీవ్ గా లేదు. అయితే తాజాగా ఈ మెగా జంట తల్లీ తండ్రులు కాబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత?

Varun Tej
మెగా ఫ్యామిలీలో హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో హీరో వరుణ్ తేజ్.పవన్ కళ్యాణ్ తరువాత ఓ హీరోయిన్ తో ప్రేమలో పడింది వరుణ్ మాత్రమే. అయితే చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఆ జంట. తమ బంధాన్ని సీక్రేట్ గా ఉంచారు. పెళ్లి వరకూ ఎవరికి చెప్పాలేదు. ఇక గత ఏడాది వీరి బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.
ఇక యంగ్ కపుల్స్ అయిన హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ జంట త్వరలో త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ నెట్టింటజోరుగా రూమర్స్ తిరుగుతున్నాయి. గతేడాదే పెళ్ళి చేసుకున్న ఈ కపుల్స్ ను ఫ్యాన్స్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెపుతారు అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో వీరు పేరెట్స్ అవుతున్నారని, లావణ్య ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. మెగా ప్యాన్స్ మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సోసల్ మీడియాలో మాత్రమే జోరుగా ప్రచారం జరుగుతోంది. .లావణ్య తల్లి కాబోతుండటంతో మెగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి.
త్వరలోనే మెగా కుటుంబం ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటిస్తుందని కూడా కొందరు చెబుతున్నారు. మరో వైపు పెళ్లి తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు వరుణ్ తేజ్ 2023లో ఆయన నటించిన 'గాండీవధారి అర్జున', గతేడాది వచ్చిన 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' సినిమాలు ప్లాప్ లు గా నిలిచాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో 'VT-15' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మరి మెగా హీరో ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. గతంలో వరుసగా సినిమాలు చేసిన వరుణ్ జోరు తగ్గింది. హిట్లు పడకపోవడంతో కామ్ అయ్యాడా అని అంతా అనుకుంటున్నారు. మెగా హీరోలలో సాయి తేజ్, వైష్ణవ్ కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉన్నట్టు అనిపించడంలేదు.