- Home
- Entertainment
- 98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
బాలీవుడ్‌లో 98 హిట్ సినిమాలతో టాప్ లో ఉన్న హీరో ఎవరో తెలుసా? అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక హిట్ చిత్రాలు ఇచ్చిన 10 మంది స్టార్ల గురించి తెలుసుకుందాం.ఇంతకీ వారెవరంటే?

ధర్మేంద్ర
IMDb నివేదిక ప్రకారం, బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర తన కెరీర్‌లో 98 హిట్ సినిమాలు చేసి టాప్ ప్లేస్ లో ఉన్నారు.
జితేంద్ర
ఇక ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ జితేంద్రకు దక్కింది. ఆయన తన కెరీర్‌లో 69 హిట్ చిత్రాలు అందించారు. బాలవుడ్ లో తన దైన ముద్ర వేసుకున్నారు.
అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ తన కెరీర్ మొత్తంలో 63 హిట్ చిత్రాలు అందించారు. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అమితాబ్ శిఖర సమానంగా ఉన్నారు.
మిథున్ చక్రవర్తి
ఇక బాలీవుడ్ రొమాంటిక్ హీరో మిథున్ చక్రవర్తి తన కెరీర్‌లో 58 హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నారు.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ లో మొదటి 100 కోట్ల హీరో అక్షయ్ కుమార్. కాని ఆయన కెరీర్ లో హిట్ సినిమాలు 44 మాత్రమే. ఈ లిస్ట్ లో అక్షయ్ కుమార్ 5వ స్థానంలో ఉన్నారు.
రాజేష్ ఖన్నా
IMDb నివేదిక ప్రకారం, రాజేష్ ఖన్నా తన కెరీర్‌లో 57 హిట్ చిత్రాలు ఇచ్చారు. బాలీవుడ్ లోనే కాదు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజేష్ ది ప్రత్యేక స్థానం.
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో కేవలం 38 హిట్ సినిమాలు చేయడం ఆశ్చర్య. కాని సల్మాన్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాాదు.
ఋషి కపూర్
బాలీవుడ్ లో ఒకప్పుడు కపూర్స్ ఫ్యామిలీ హవా గట్టిగా నడిచింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఋషి కపూర్ తన కెరీర్‌లో 35 హిట్ చిత్రాలు ఇచ్చారు.
అజయ్ దేవగన్
IMDb నివేదిక ప్రకారం అజయ్ దేవగన్ తన కెరీర్‌లో 34 హిట్ చిత్రాలు ఇచ్చారు. బాలీవుడ్ లో అజయ్ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు.
గోవిందా
IMDb నివేదిక ప్రకారం, గోవిందా తన కెరీర్‌లో 33 హిట్ చిత్రాలు ఇచ్చారు. ఆతరం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ పొందిర హీరో గోవిందా.