వరుణ్ తేజ్-లావణ్యల రహస్య ప్రేమ, 5 ఏళ్లు బయట పడకుండా జాగ్రత్త పడ్డ జంట ..?
పిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కాని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలాగా ఇంత రహస్యంగా ప్రేమించుకున్నవారు మాత్రం ఎవరూ లేరనే చెప్పాలి.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు, ఎన్నో సినిమా పెళ్లిళ్లు.. మరెన్నో విడాకులు.. ఇలా అన్నీ చూస్తూనే ఉన్నాం. ప్రేమించుకున్ని పెళ్ళి వరకూ రాకుండా బ్రేకప్ చెప్పుకున్నవారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలది మాత్రం ఎవరూ ఊహించని ప్రేమ కథ. ఎవరూ కనిపెట్టలేకపోయిన రహస్య ప్రేమ కథ.
ప్రస్తుతం మెగాఫ్యామిలీలో పెళ్ళి వేడుకలు హట్టహాసంగా జరుగుతున్నాయి. ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్యల పెళ్ళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఇటలీలో వరుణ్ పెళ్ళిలో ఎంజాయ్ చేస్తున్నారు. సంగీత్, హల్దీ, మెహందీ వేడుకల తరువాత.. ఈరోజు (నవంబర్ 1) వరుణ్ లావణ్య మెడలో తాళి బొట్టుకట్టబోతున్నాడు.
అంతా బాగానే ఉంది.. కాని వీరిద్దరు ఎప్పుడు ప్రేమించుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు చూశాం.. చూస్తున్నాం. కాని వీరిది మాత్రం అత్యంత రహస్య ప్రేమ కథ. వీరి బంధం మిస్టర్ మూవీ సెట్స్ లో స్టార్ట్ అయ్యిందట. అయితే అప్పటికి వారి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందట. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకూ... లావణ్య పట్ల వరుణ్ ఆకర్షితుడు అయ్యాడట.
సన్నిహిత వర్గాలు సమాచారం ప్రకారం సమాచారం ప్రకారం వీరు గత ఐదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. 2017లో దర్శకుడు శ్రీను వైట్ల మిస్టర్ టైటిల్ తో ఒక మూవీ చేశారు. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. మిస్టర్ మూవీ వరుణ్ కి చేదు అనుభవం మిగిల్చింది. అయితే ఓ చక్కని తోడు మాత్రం దొరికింది.
మిస్టర్ మూవీ సెట్స్ లో లావణ్యఅంటే వరుణ్ కు ఇష్టం ఏర్పడిందట. ఆమె పట్ల మెగా ప్రిన్స్ ఆకర్షితుడు అయ్యాడట. లావణ్యతో ఆయన చనువుగా ఉండటం, తన విషయాలు శేర్ చేసుకోవడం లాంటివి చేశాడట. అయితే వరుణ్ తో లవణ్య కూడా అంతే క్లోజ్ గా ఉండేదట. ఈసినిమా షూటింగ్ అయిపోయే సరికి ఇద్దరు బాగా క్లోజ్ అవ్వడం.. వరుణ్ నేరుగా పెళ్లి చేసుకుందామా? అని అడిగాడట. అప్పటికే వరుణ్ ఆమెకు కూడా ఇష్టం ఉండటంతో.. లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
సినిమా హిట్ అవ్వడం..ప్లాప్ అవ్వడం తరువాత సంగతి కాని.. ఈసినిమా తరువాత నుంచి ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని కలిసి తిరగడం. టూర్లకు వెళ్ళడం లాంటివి చేసేవారట. కాని ఈ విషయంలో మాత్రం మీడియాకు కాని.. కెమెరా కళ్ళకు కాని ఏమాత్రం అనుమానంరాకుండా.. దొరక్కుండా మేనేజ్ చేయడంలో ఇద్దరు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అంతే కాదు ఎంత మందిస్టార్స్ ఇలా ట్రై చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోయేవారు కాని..వీరు మాత్రం ఆ విషయంలో బాగా మేనేజ్ చేశారు.
అయితే లాస్ట్ 2 ఇయర్స్ గా మాత్రం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాని వాటిని ఎవరూ పట్టించుకోలేదు. గట్టిగా చెప్పడానికి కూడా ఎవరికీ సాక్షలు దొరకలేదు. దాంతో ఎక్కడో ఒక సందిగ్ధత ఉండేది. ఆడియన్స్ ఈ కన్ఫ్యూజన్ లో ఉండగానే.. సోషల్ మీడియా సైట్లు రకరకాలుగా రాయకముందే.. వీరు తం ఊహాగానాలు, అనుమానాలు పటాపంచలు చేస్తూ అధికారిక ప్రకటన చేశారు.
Varun Tej - Lavanya Tripathi engagement
అయితే ఈ విషయాన్ని దాచాలని ఎంత ప్రయత్నించినా..వీరు కూడా ఒకటీ రెండు చోట్ల దొరికిపోయారు..2018లో అంతరిక్షం మూవీ లో కలిసి నటించారు. వరుణ్-లావణ్యల ఎఫైర్ నిహారిక పెళ్లి సాక్షిగా బయటపడింది. నిహారిక 2020 డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ వివాహం చేసుకుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పరిశ్రమ నుండి లావణ్య, రీతూ వర్మ హాజరుకావడం హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుండి మీడియా కళ్లు లావణ్య-వరుణ్ పై నిఘా పెట్టారు.
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించారు. జూన్ 9న మణికొండలో గల నాగబాబు నివాసంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ సతీసమేతంగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు.
ఇక తాజగా వీరి పెళ్ళి ఇటలీలో జరుగుతుండగా.. ఈ పెళ్లిలో కూడా మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మాత్రమే వెళ్ళారు. వీరితో పాటు హీరో నితిన్ వరుణ్ క్లోజ్ ఫ్రెండ్ అవ్వడంతో.. ఆయన కూడా సతీసమేతంగా ఇటలీలో సందడి చేస్తున్నాడు. ఇక ఈరోజు అక్కడ పెళ్ళి జరిగిన తరువాత హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.