- Home
- Entertainment
- VarunLav:వరుణ్, లావణ్య హల్దీ వేడుక ఫొటోస్.. పసుపు బట్టల్లో కొత్త జంట రొమాంటిక్ హగ్, మెగా స్వాగ్ చూశారా..
VarunLav:వరుణ్, లావణ్య హల్దీ వేడుక ఫొటోస్.. పసుపు బట్టల్లో కొత్త జంట రొమాంటిక్ హగ్, మెగా స్వాగ్ చూశారా..
వరుణ్ తేజ్, లావణ్య వెడ్డింగ్ లో భాగంగా నేడు హల్దీ వేడుక మొదలైంది. హల్దీ వేడుకలో భాగంగా లావణ్య, వరుణ్ తేజ్ ఇద్దరూ పసుపు బట్టల్లో మెరిసిపోతున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం ఇటలీలో చేరిపోయారు. ఆల్రెడీ గ్రాండ్ పార్టీతో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ సతీసమేతంగా ఇటలీ వెళ్లారు. నేడు వరుణ్, లావణ్యలకు హల్దీ మెహందీ వేడుక జరగనుంది. అయితే ఇటలీలో పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు కొద్దిమంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరవుతారు.
వరుణ్ తేజ్, లావణ్య వెడ్డింగ్ లో భాగంగా నేడు హల్దీ వేడుక మొదలైంది. హల్దీ వేడుకలో భాగంగా లావణ్య, వరుణ్ తేజ్ ఇద్దరూ పసుపు బట్టల్లో మెరిసిపోతున్నారు. రొమాంటిక్ గా హగ్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక హల్దీ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ గా అదిరిపోయే స్వాగ్ తో కూర్చుని ఉన్న పిక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. అదేవిధంగా నాగబాబు తన భార్యతో కలసి అదిరిపోయే ఫోజు ఇచ్చారు. నవంబర్ 1 అంటే రేపు మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఖరారు చేయబడింది.
అనంతరం సాయంత్రం 8 గంటలకు చిన్న రిసెప్షన్ ఉంటుంది. అది పూర్తయ్యాక కొత్త జంట ఇండియాకు పయనమవుతారు. నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ పెళ్లి కోసం అతిథులంతా సపరేట్ డ్రెస్ కోడ్ లో రావాలని రిక్వస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్లో, వైట్ లేదా పింక్ డ్రెస్సుల్లో పెళ్ళికి హాజరు కావాలని కోరారట.
వివాహానికి మొత్తం 120 మంది అతిథులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అతిథులంతా ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. మిస్టర్ చిత్రంలో తొలిసారి వరుణ్, లావణ్య జంటగా నటించారు. ఆ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.