Induvadana Movie Review: వరుణ్ సందేశ్ `ఇందువదన` సినిమా రివ్యూ
తానేంటో నిరూపించుకునేందుకు కొంత గ్యాప్‌తో డిఫరెంట్ ప్రయోగంతో వచ్చాడు వరుణ్ సందేశ్. ఆయన నటించిన `ఇందువదన` చిత్రం కొత్త సంవత్సరం కానుకగా శనివారం విడుదలైంది. ఎం శ్రీనివాసరావు (ఎంఎస్‌ఆర్) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూతో తెలుసుకుందాం.

`హ్యాపీడేస్`, `కొత్తబంగారులోకం` చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడు వరుణ్ సందేశ్. లవర్ బాయ్‌గా టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. కాలేజ్ గర్ల్స్ డ్రీమ్ బాయ్‌గా మారిపోయారు. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనయ్యింది. కొన్ని సినిమాలు పరాజయం కావడం, బిగ్గెస్ట్ హిట్స్ లేకపోవడంతో వరుణ్ కెరీర్ స్ర్టగులింగ్‌లో పడింది. దీంతో తానేంటో నిరూపించుకునేందుకు కొంత గ్యాప్‌తో డిఫరెంట్ ప్రయోగంతో వచ్చాడు వరుణ్ సందేశ్. ఆయన నటించిన `ఇందువదన` చిత్రం కొత్త సంవత్సరం కానుకగా శనివారం విడుదలైంది. ఎం శ్రీనివాసరావు(ఎంఎస్‌ఆర్) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూతో తెలుసుకుందాం.
కథః
ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు వాసు ( వరుణ్ సందేశ్). తన టీమ్(ధన్‌రాజ్, మహేష్ విట్టా, పార్వతీశం)తో కలిసి అక్కడ అడవుల్లో జరుగుతున్న అక్రమ కలప స్మగ్లింగ్ ఆడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే అడవిలోనే ఉండే గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి) ప్రేమలో పడతాడు. తొలి చూపులోనే ఆమె అందానికి ఫిదా అయిపోతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కులం కారణంగా ఇందుని పెళ్లి చేసుకునేందుకు వాసు తల్లిదండ్రులు అంగీకరించరు. అదే సమయంలో ఊహించని రీతిలో ఇందు హత్యకు గురవుతుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దారుణంగా హత్యకి గురైన తర్వాత వాసు ఏమైపోయాడు? ఇందు హత్యకు కారకులెవరు? ఆ తర్వాత ఏం జరిగింది.. దెయ్యం కథేంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో అలరించిన వరుణ్ తేజ్ నుంచి వచ్చిన డిఫరెంట్ ప్రయోగం `ఇందువదన`. రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలకిది భిన్నంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు వరుణ్ సందేశ్. అందుకు తగ్గట్టుగానే సినిమాని లవ్, థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్‌ఎస్‌ఆర్. దర్శకుడుకు ఎంచుకున్న పాయింట్ పాతతే అయినప్పటికీ.. ట్రీట్‌మెంట్ మాత్రం కొత్తగా ఉంది. చక్కటి ప్రేమ కథకి హారర్‌ని జోడించి సినిమాని తెరకెక్కించాడు. ఇందుపై దాడి చేయడం.. అడవుల్లో మాఫియా ఎటాక్ లాంటి ఆసక్తికర అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు పర్లేదు అనిపిస్తాయి. అడవిలోనే సాగే కథ కావడంతో అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్, గిరిజిన యువతి కథ అంటే గతంలో కొన్ని తెలుగు సినిమాలు వచ్చాయి. ఆ ఒక్క పాయింట్ తప్పితే మిగిలిన కథ కొత్తగా అనిపిస్తుంది.
ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆత్మగా మారడం.. అక్కడ్నుంచి వరుణ్ సందేశ్ అనుభవాలు కొత్తగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో మహేష్ విట్టా, పార్వతీశం, ధన్‌రాజ్ కామెడీ అక్కడక్కడా పర్లేదు అనిపిస్తుంది. సీనియర్ కమెడియన్ ఆలీని కూడా దర్శకుడు బాగానే వాడుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా సాగడంతో పాటు కాస్త థ్రిల్లింగ్‌గానూ ఉంటుంది. పైగా క్లైమాక్స్‌లో వరుణ్ సందేశ్ విషయంలో ఇచ్చే ట్విస్ట్ కూడా అనూహ్యంగానే ఉంటుంది. బ్రహ్మణ కులంలోని వరుణ్ సందేశ్.. గిరిజన యువతితో ప్రేమలో పడితే.. అగ్రకులం వాళ్లు ఏం చేసారనేది యదార్థంగా కళ్లకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు. సమాజంలో కులం ఎంత లోతుగా పాతుకుని పోయిందో ఇందులో టచ్ చేశాడు దర్శకుడు ఎంఎస్‌ఆర్. అయితే కథని మరికాస్త బలంగా రాసుకుంటే, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించి ఉంటే సినిమా మరో లెవల్‌లో ఉండేది.
నటీనటులు:
వరుణ్ సందేశ్‌ను ఇప్పటి వరకు కేవలం లవర్ బాయ్‌గానే అలరించారు. `ఇందువదన` చిత్రంలో మాత్రం కొత్తగా కనిపించాడు. గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మాస్ హీరో స్టయిల్‌లో తనని తాను ప్రజెంట్ చేసుకున్నాడు. యాక్షన్ సీన్స్, లవ్, ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. నటన పరంగానూ వేరియేషన్ చూపించాడు. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొత్త హీరోయిన్ అయినా కూడా లా బాగుంది. గ్లామర్ ట్రీట్‌తోపాటు నటనతోనూ ఆకట్టుకుంది. ఆలీ, మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ అలరిస్తాయి. వరుణ్ సందేశ్‌కు తల్లిగా సురేఖ వాణి మెప్పించింది.
సాంకేతిక వర్గంః
దర్శకుడు శ్రీనివాస రాజు కాస్త రెగ్యూలర్ స్టోరీ అయినా కొత్తగా ప్రజెంట్ చేశాడు. కొత్త దర్శకుడైనా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తెరకెక్కించారు. హీరోయిన్ కారెక్టర్ బాగా రాసుకున్నాడు దర్శకులు. అలాగే వరుణ్‌ను కొత్తగా చూపించాడు.లవ్, ఎమోషనల్ సీన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్. అయితే కథపై ఇంకాస్త వర్క్ చేసుంటే బాగుండేది. హార్రర్, థ్రిల్లర్స్ తెలుగులో చాలానే వచ్చాయి కాబట్టి అదే ఛాయలు ఇందులో కనిపించాయి. సంగీత దర్శకుడు శివ కాకాని మ్యూజిక్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ బీ మురళీకృష్ణ పనితీరు బాగుంది. సీన్స్ రిచ్‌గా అనిపిస్తాయి. నిర్మాత మాధవి ఆదుర్తి నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాని రాజీపడకుండా నిర్మించారు. ఫైనల్‌గా వరుణ్ సందేశ్ ఓ కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు.
ఇందువదన చిత్ర యూనిట్..
నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు
దర్శకత్వం : ఎంఎస్‌ఆర్
నిర్మాత: మాధవి ఆదుర్తి
సంగీత దర్శకుడు: శివ కాకాని
స్క్రీన్ ప్లే : ఎంఎస్‌ఆర్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు