పాపం 'బేబీ జాన్' ని తీసేసి ఆ చిన్న సినిమాని వేస్తున్నారు?
వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లు సాధించినప్పటికీ, తర్వాత రోజుల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో థియేటర్ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
baby john
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ 2024 కలిసి వచ్చినట్లు లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వెళ్లిపోతోంది. ఎన్నో అంచనాలతో చేసిన బేబీ జాన్ సైతం ఇప్పుడు అదే పరిస్దితి ఎదుర్కుంటోంది. వరణ్ ధావన్ కు జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చేసినా ఫలితం కనపడటం లేదు. భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బయ్యర్లను బెంబేలెత్తిస్తోంది. బేబీ జాన్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరి సినిమా రీమేక్.
ప్రముఖ తమిళ్ డైరెక్టర్ కలిస్ దర్శకత్వం వహించగా మరో స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ నిర్మించాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ రోజు రూ.11.75 కోట్లు కలెక్షన్స్ రాబట్టి డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. కానీ రెండో రోజు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
baby john
బేబీ జాన్ సంవత్సరాన్ని బ్యాంగ్‌తో ముగించాల్సి ఉందని బాలీవుడ్ అంచనా వేసింది. కానీ అలా జరగలేదు. ఓపెనింగ్ డే రికార్డులు బాగున్నా రెండో రోజు బిజినెస్ క్రాష్ అయింది. హాలిడేస్‌లో విడుదలైనప్పటికీ, టీజర్ ట్రైలర్ వచ్చినప్పటి డల్ అవటం మొదలైంది. దానికి తోడు ఈ చిత్రం రీమేక్ కావడం, తక్కువ బజ్ ఉండటం వల్ల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయటంలో విఫలమైంది. దేశవ్యాప్తంగా డివైడ్ టాక్, నెగిటివ్ రివ్యూలతో పరిస్థితి దారుణంగా మారింది.
Pushpa 2 , Baby John, Christmas Day
మరోప్రక్క డిసెంబర్ 05 రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్ సినిమా ఎఫెక్ట్ బేబీ జాన్ జాన్ పై పడింది. దీంతో అనవసరంగా ఇయర్ ఎండ్ లో వరుణ్ ధావన్ తల పట్టుకుని కూర్చున్నాడట. మరో ప్రక్క ఇది చాలదన్నట్లు మళయాళ చిన్న చిత్రం మైక్రో ని ఇప్పుడు బేబి జాన్ తీసేసి వేస్తున్నారని తెలుస్తోంది.
బేబీ జాన్ భాక్సాఫీస్ దగ్గర అధ్వాన్నంగా ఉండటంతో, థియేటర్ యజమానులను ఆందోళనకు గురిఅవుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నష్టాల భయంతో, మలయాళం చిత్రం మార్కో ని హిందీ వెర్షన్‌తో షోలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా, యానిమల్ , కిల్‌తో పోల్చితే నెక్ట్స్ లెవిల్ లో ఉన్నట్లు చెప్పబడుతున్న దాని హింసాత్మక సీన్స్ కోసం మార్కో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మార్కెట్ లో మార్కోకు భారీ డిమాండ్ ఉంది.
ముంబైలోని ఒక మూవీమాక్స్ థియేటర్‌లో ఆదివారం నుండి మార్కో ఐదు షోలు ప్రదర్శించానికి ప్లాన్ చేసారు, బేబీ జాన్‌ను కేవలం మూడు షోలకు తగ్గించారు. ఐకానిక్ G7 మల్టీప్లెక్స్‌లో ఉన్న బేబీ జాన్, చిత్రం 200 సీట్లు ఉన్న గెలాక్సీకి మార్చబడింది.
ఇంతకుముందు ఇది 1000 సీట్లతో గైటీలో ప్రదర్శించబడింది. రాబోయే రోజుల్లో షోలు మరిన్ని తగ్గించబోతున్నారు, వాటిలో ఎక్కువ భాగం ముఫాసా: ది లయన్ కింగ్ వంటి ఇతర చిత్రాల ద్వారా భర్తీ చేయబడతాయి. ఇది వరుణ్ థావన్ తట్టుకోలేని విషయం.
బేబీ జాన్ కోసం చిత్ర యూనిట్ దాదాపుగా రూ.150 కోట్లు బడ్జెట్ వెచ్చించారు. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్ దాదాపుగా 50% శాతం ఉంది. మేకింగ్, ప్రమోషన్స్, ఇతర ఖర్చులు దాదాపుగా రూ.100 కోట్లు పైగా ఉన్నాయి. దీంతో బేబీ జాన్ బ్రేక్ ఈవెన్ తాగేట్ రూ.100 కోట్లు పైగా ఉంది. మరి ఈ వారాంతంలోనైనా కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి.