- Home
- Entertainment
- హైపర్ ఆది బర్త్ డే రోజున వర్షిణి లవ్ ప్రపోజ్ ?.. నా లైఫ్ మొత్తం నీ తోడు కావాలి అంటూ షాకింగ్ పోస్ట్
హైపర్ ఆది బర్త్ డే రోజున వర్షిణి లవ్ ప్రపోజ్ ?.. నా లైఫ్ మొత్తం నీ తోడు కావాలి అంటూ షాకింగ్ పోస్ట్
హైపర్ ఆది గురించి లవ్ అఫైర్ విషయాలు వినిపించడం తక్కువే. కానీ తాజాగా హైపర్ ఆది, వర్షిణి ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఇది ఆన్ స్క్రీన్ పై కాదు. రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే అనుమానాలు బలంగా మొదలయ్యాయి.

జబర్దస్త్ తో పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లు పలు షోలలో పాల్గొంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది. ఇదిలా ఉండగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి దూరం అవుతున్నారు. సుడిగాలి సుధీర్ అయితే ఆ ఛానల్ నే విడిచి పెట్టాడు. హైపర్ ఆది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
డబుల్ మీనింగ్ డైలాగులు, అదిరిపోయే కామెడీ సెటైర్లతో ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక వేళ్ళు చేసే స్కిట్స్ లో కావాలనే లవ్, మ్యారేజ్ లాంటి అంశాలని ఆకర్షణ కోసం పెడతారు. సుధీర్, రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వస్తున్న వార్తలు ఇప్పటివి కావు. అయితే అది ఆన్ స్క్రీన్ వరకే పరిమితమా అనేది క్లారిటీ లేదు.
ఇక హైపర్ ఆది గురించి లవ్ అఫైర్ విషయాలు వినిపించడం తక్కువే. కానీ తాజాగా హైపర్ ఆది, వర్షిణి ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఇది ఆన్ స్క్రీన్ పై కాదు. రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే అనుమానాలు బలంగా మొదలయ్యాయి.
అందుకు కారణం వర్షిణి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్. ఇటీవల హైపర్ ఆది జన్మదిన వేడుకలు జరిగాయి. హైపర్ ఆది తన బర్త్ డే ని వర్షిణితో ప్రయివేట్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆ వీడియోని వర్షిణి పోస్ట్ చేయడం అందరికి షాకింగ్ గా మారింది. ఏ వీడియోలో వర్షిణి ఆదికి కేక్ తినిపించడం.. అతడిని ప్రేమగా కౌగిలించుకోవడం రొమాంటిక్ గా ఉంది. ఇదంతా చూస్తుంటే వర్షిణి ఆదికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉంది.
ఇక వర్షిణి ఈ వీడియోకి కామెంట్ పెడుతూ.. డియర్ ఆది.. హ్యాపీ బర్త్ డే. న జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి. నా ఫేవరిట్ పర్సన్, సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది' అంటూ వర్షిణి లవ్ ఎమోజిలు పోస్ట్ చేసింది. దీనితో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
నెటిజన్లు కూడా అదే రకంగా కామెంట్స్ పెడుతున్నారు. నీ లాస్ట్ కామెంట్ చూస్తుంటే డౌట్ గా ఉంది.. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వీరిద్దరి జోడి బావుందని కామెంట్స్ చేస్తున్నారు. ఢీ షోలో ఉన్నప్పుడు ఆది, వర్షిణి చాలా సార్లు రొమాంటిక్ డాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరిది ఫ్రెండ్ షిప్ మాత్రమేనా లేక నిజంగానే ఎఫైర్ లో ఉన్నారా అనేది తెలియాలంటే వాళ్లే స్పందించాలి.