- Home
- Entertainment
- నేను అన్ని సార్లు విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. నాన్నే నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు
నేను అన్ని సార్లు విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. నాన్నే నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు
సెలెబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వనిత విజయ్ కుమార్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ ల పెద్ద కుమార్తె వనిత. ఆమె కోడిరామకృష్ణ దేవి చిత్రంలో సుశీలగా నటించిన సంగతి తెలిసిందే.

సెలెబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వనిత విజయ్ కుమార్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ ల పెద్ద కుమార్తె వనిత. ఆమె కోడిరామకృష్ణ దేవి చిత్రంలో సుశీలగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వనిత తమిళంలో వరుసగా చిత్రాల్లో నటిస్తోంది.
వనిత ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రాపర్టీల విషయంలో వనితకు తన తండ్రి విజయ్ కుమార్ కు వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వనిత ఓ ఇంటర్వ్యూలో తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ కుమార్, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అమ్మ రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్స్ కి వెళ్లి నటిస్తూ మా కోసం డబ్బు సంపాదించింది.
మాకు ఆస్తులు సమానంగా రావాలి. కానీ నాన్న మాత్రం నాకు ఏది ఇవ్వను అని అంటున్నారు. నా మీదే కేసులు పెట్టాడు. దీనితో నేను సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. కేవలం నాన్నకు మాత్రమే కాదు.. మా ఫ్యామిలిలో అందరికి నేనంటే ఇష్టం లేదు. ఎవర్ని అడిగిన ఆమె మా ఫ్యామిలీ కాదు అని చెప్పేస్తుంటారు. నేనంటే వాళ్లకు ఎందుకు పడదో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు అంటూ వనిత ఎమోషనల్ అయింది.
నాన్న అయితే నాకు తమిళనాడులోనే అడ్రస్ లేకుండా చేస్తాను అని ఛాలెంజ్ చేశారు. మా అమ్మ ఇంట్లోనుంచే నన్ను గెంటేశారు అని వాపోయింది. కట్టు బట్టలతో ఇంట్లో నుంచి పిల్లలని తీసుకుని వచ్చేశా. ఎన్నో ఇబ్బందులు పడ్డా. కానీ ఇప్పుడు తమిళ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది అని వనిత పేర్కొంది.
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చిన్న తనంలోనే నాకు పెళ్లి జరిగింది. ఆ ప్రభావం నాపై బాగా పడింది. నేను చేసుకున్న వివాహాలు ఎక్కువ కాలం నిలబడక పోవడానికి కారణం అదే అని వనిత పేర్కొంది. వనితకు మూడు పెళ్లిళ్లు జరగగా మూడు సార్లు ఆమె వివాహ బంధం నిలబడలేదు.
ఇక తాను ఎవరికోసమో తన తీరు మార్చుకోను అని తేల్చి చెప్పేసింది. నా మాటలు చూసి ఆమెకు పొగరు అని భావించే వారు కూడా ఉన్నారు. అయినా పర్వాలేదు. నేను మాత్రం నా తీరు మార్చుకోను అని వనిత తేల్చి చెప్పేసింది.