- Home
- Entertainment
- మెగా ఫ్యామిలీకి రీతూ వర్మకి సంబంధం ఏంటి ?.. ఐదేళ్లు పెద్దదైన హీరోయిన్ తో డేటింగ్ పై వైష్ణవ్ క్లారిటీ
మెగా ఫ్యామిలీకి రీతూ వర్మకి సంబంధం ఏంటి ?.. ఐదేళ్లు పెద్దదైన హీరోయిన్ తో డేటింగ్ పై వైష్ణవ్ క్లారిటీ
రుణ్ తేజ్ పెళ్ళికి ముందు నుంచి వైష్ణవ్ తేజ్ గురించి ఒక రూమర్ సోషల్ మీడియా మొత్తం వ్యాపించింది. ఆ నోటా ఈ నోటా పడి సినీ అభిమానులంతా చర్చించుకోవడం ప్రారంభించారు. అదే వైష్ణవ్ తేజ్ లవ్ ఎఫైర్ గురించి.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్న చిత్రం ఆది కేశవ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
నవంబర్ 24న రిలీజ్ కి ఈ చిత్రం రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలీల, వైష్ణవ్ ఇద్దరూ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుణ్ తేజ్ పెళ్ళికి ముందు నుంచి వైష్ణవ్ తేజ్ గురించి ఒక రూమర్ సోషల్ మీడియా మొత్తం వ్యాపించింది. ఆ నోటా ఈ నోటా పడి సినీ అభిమానులంతా చర్చించుకోవడం ప్రారంభించారు. అదే వైష్ణవ్ తేజ్ లవ్ ఎఫైర్ గురించి.
వరుణ్ తేజ్ పెళ్ళిలో క్రేజీ హీరోయిన్ రీతూ వర్మ తెగ సందడి చేసింది. ఇటలీలో వరుణ్ లావణ్య వెడ్డింగ్ కి కొత్త జంట కుటుంబాలు తప్ప ఇతరులకు అతి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందింది. వారిలో రీతూ వర్మ కూడా ఉంది. వరుణ్, లావణ్య పెళ్ళిలో రీతూ వర్మ సందడి చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ తో తీసుకున్న సెల్ఫీ ఇంటర్నెట్ ని షేక్ చేసింది. దీనితో ఊహించని విధంగా పుకార్లు మొదలయ్యాయి. రీతూ వర్మ మెగా కోడలు కాబోతోంది అని.. వైష్ణవ తేజ్ తో ఆమె రిలేషన్ లో ఉందని ఇలా రకరకాలుగా రూమర్స్ వ్యాపించాయి.
ఎలాంటి సంబంధం లేకుండా రీతూ వర్మ వరుణ్ తేజ్ పెళ్ళికి ఎందుకు వెళ్ళింది అంటూ ప్రశ్నలు మొదలుపెట్టేశారు. ఇలా పుకార్లు ఎక్కువైపోతుండడంతో తాజాగా ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అసలు మెగా ఫ్యామిలీతో రీతూ వర్మకి ఎలాంటి రిలేషన్ లేదు. వైష్ణవ్ తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లు పూర్తిగా అవాస్తవం. పైగా వైష్ణవ్ తేజ్ కన్నా రీతూ వర్మ ఐదేళ్లు వయసులో పెద్ద.
వైష్ణవ్ మాట్లాడుతూ.. మరీ అండీ.. ఆమె లావణ్య త్రిపాఠికి ఫ్రెండ్ అందుకే పెళ్ళికి వచ్చింది అని క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ పెళ్ళికి హాజరైంది లావణ్య తరుపున అని ఫుల్ క్లారిటీ వచ్చేసింది.