`బేబీ` హీరోయిన్‌కి ఆఫర్ల పంట.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. వైష్ణవి పంట పండినట్టే!
`బేబీ` సినిమాతో పాపులర్ అయ్యింది వైష్ణవి చైతన్య. ఈ సినిమా ఆమెకి ఎక్కువ పేరొచ్చింది. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లని అందుకుంటుంది.
`బేబీ`(Baby) సినిమా ఒక కల్ట్ క్లాసిక్. లవ్ స్టోరీస్‌లో ఓ నయా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేటి యువత తీరుతెన్నులను ఆవిష్కరించిన చిత్రమిది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవిచైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ సినిమా దాదాపు వంద కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. దాదాపు అరవై కోట్ల షేర్ సాధించింది. దాదాపు యాభై కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ సినిమాతో పాపులర్ అయ్యింది వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఇందులో ఆమె తనదైన సహజమైన నటనతో మెప్పించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ప్రశంసలందుకుంది. అంతేకాదు ఇప్పుడు వరుసగా అవకాశాలను అందుకుంటుంది. మిడిల్ రేంజ్ బడ్జెట్ చిత్రాలకు హీరోయిన్‌గా బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీకి నాలుగైదు సినిమా ఆఫర్లుండటం విశేషం.
వాటిలో పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తోన్న `ఇస్మార్ట్ 2`లో ఆఫర్ వచ్చిందని సమాచారం. రామ్ పోతినేని ఆమెకి విషెస్ చెబుతూ సర్‌ప్రైజ్ బొకే పంపించడంలోనే ఆ విషయం స్పష్టమైంది. పూరీ నుంచి కూడా ఆఫర్ ఉంటుందనే హామీ వచ్చిందట. ఇదే నిజమైతే వైష్ణవి హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌లోకి వెళ్లిపోతుందని చెప్పొచ్చు.
ఇదే కాదు గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా ఓకే అయ్యిందట. అల్లు శిరీష్ హీరోగా రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఈ ఆఫర్ వెనకాల సాయి రాజేష్ ఉన్నారని సమాచారం. `బేబీ` డైరెక్టర్ సాయి రాజేష్ గీతా ఆర్ట్స్ మనిషి. ఆయన చెబితే పనైపోతుంది. అంతేకాదు మరో రెండు ఆఫర్లని కూడా ఇప్పిస్తానని వైష్ణవికి భరోసా ఇచ్చాడట.
దీంతోపాటు తాజాగా కొత్తగా మరో రెండు ఆఫర్లు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చాయట. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యిందని సమాచారం. దిల్‌రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్‌తో సినిమా చేయబోతుందట. ఆశిష్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే `రౌడీ బాయ్స్` చిత్రంలో మెప్పించాడు. ఇప్పుడో సినిమా చేస్తున్నారు. నెక్ట్స్ దిల్‌రాజు బ్యానర్‌లో అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. ఇందులో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్యని ఫిక్స్ చేశారట.
ఇదే కాదు `డీజే టిల్లు` ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్‌గా అనుకుంటున్నారట. సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా వైష్ణవిని అనుకుంటున్నారట. ఇంకా కన్ఫమ్ కాలేదు కానీ, కాకపోతే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇవే కాకుండా ఇంకాచాలా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవే ఫైనల్ అయితే వైష్ణవ పంట పండినట్టే అని చెప్పొచ్చు. హీరోయిన్‌గా ఆమె నెక్ట్స్ లెవల్ వెళ్లగలుగుతుందని చెప్పొచ్చు.