- Home
- Entertainment
- Janaki Kalaganaledu: దేవత రాకతో ఆనందంగా జరుగుతున్న బారసాల వేడుక.. మరో కుట్ర ప్లాన్ చేసిన మల్లిక!
Janaki Kalaganaledu: దేవత రాకతో ఆనందంగా జరుగుతున్న బారసాల వేడుక.. మరో కుట్ర ప్లాన్ చేసిన మల్లిక!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే రెండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఊర్మిళ (Urmila) తన కొడుకు బారసాల ఫంక్షన్ లో జ్ఞానంబ ఫ్యామిలీ గురించి ఎదురుచూస్తూ ఉంటుంది. ఈలోపు రుక్మిణి (Rukmini) కారులో జ్ఞానాంబ ఫ్యామిలీ ను తీసుకొని రాగా అది గమనించిన ఊర్మిళ ఎంతో ఆనంద పడుతుంది. నా నమ్మకం నిజమైంది అంటూ సంబరపడుతుంది.
ఇక జ్ఞానాంబ (Jnanamba) ఇంటి లోపలికి వస్తున్న క్రమంలో ఊర్మిళ తన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక పక్కనే ఉన్న మల్లిక దాని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతుంది. ఆ క్రమంలో ఇదంతా నీ వల్లే జరిగింది అని ఊర్మిళ (Urmila) రుక్మిణి ను పోగుడుతుంది. ఇక మల్లిక అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్ అంతా జరిగింది.
ఇక మా అత్తయ్య గారు రాకుండా ఎలా ఉంటారు అని చిరాకు పడినట్లుగా మాట్లాడుతుంది. దాంతో గోవిందరాజు (Govinda Raju) ఇలాంటి చోట్ల కూడా మీ పుల్లలు పెట్టే మాటలు మానుకోవా అని మల్లిక ను అంటాడు. ఆ తర్వాత జానకి (Janaki) మనకు అమ్మ అయినా అత్తయ్య అయినా.. అన్నీ అత్తయ్య గారే అని అంటుంది.
అంతే కాకుండా జానకి (Janaki) మీ చల్లని చేతులతో బాబును ఉయ్యాలలో పడుకో బెట్టండి అని అంటుంది. ఇక జ్ఞానంబ (Jnanamba) నవ్వుకుంటూ ఆ బాబును ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఆ తర్వాత బాబు మెడలో ఒక గోల్డ్ చైన్ కూడా పెడుతుంది. దాంతో రెండు ఫ్యామిలీలు ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతారు.
ఇక యోగి (Yogi) మీరందరూ వచ్చి మా బాబు బారసాల ఫంక్షన్ ను ఒక వేడుకలా చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది బావగారు అని అంటాడు. ఆ తర్వాత రుక్మిణి తాంబూలం తీసుకుని అక్కడి నుంచి వెళుతుండగా మల్లిక (Mallika) రుక్కు అని స్టైల్ గా పిలుస్తుంది. ఇక మల్లిక ఆలా ఎందుకు పిలుస్తుందో తరువాయి భాగంలో చూడాలి.
ఇక తరువాయి భాగంలో మల్లిక (Mallika).. యోగి మీ ఇద్దరి దంపతులకు విడాకులు ఇప్పించే ప్రయత్నం లో బారసాల ఫంక్షన్ కు లాయర్ ను ఇన్వైట్ చేసాడు అని రామచంద్ర తో అంటుంది. ఇదే క్రమంలో యోగి (Yogi) గురించి నానా రకాల మాటలు నూరిపోస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.