MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Uppal Balu : అప్పుడు ఇంటికి రావద్దన్నారు.. ఇప్పుడు నువ్వే కావాలి అంటున్నారు.. ఉప్పల్ బాలు సక్సెస్ స్టోరీ ..

Uppal Balu : అప్పుడు ఇంటికి రావద్దన్నారు.. ఇప్పుడు నువ్వే కావాలి అంటున్నారు.. ఉప్పల్ బాలు సక్సెస్ స్టోరీ ..

బ్రతుకుదెరువు కోసం తీసుకున్న నిర్ణయం ఉప్పల్ బాలు జీవితాన్ని మార్చేసింది. అయినవాళ్లను దూరం చేసింది, అవమానాలు, చిత్కారాలకు కారణం అయ్యింది. అయినా తగ్గలేదు బాలు.. తన పని తానుచేసుకుంటూ వెళ్లాడు.. అప్పుడు వద్దన్నవాళ్లే.. ఇప్పుడు నువ్వే కావాలి అంటున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పల్ బాలు ఫాలోయింగ్..
Image Credit : Uppal Balu faceBook

ఉప్పల్ బాలు ఫాలోయింగ్..

టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు ఉప్పల్ బాలు.. ఎంత పాపులర్ అయ్యాడో అంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు. బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేయడం, బాలు బాడీ లాంగ్వేజ్ నచ్చక చాలామంది అతన్ని విమర్శించేవారు. ఎంత విమర్శించినా.. అంతకు రెట్టింపు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. పేదరికం నుంచి వచ్చిన బాలు.. కుటుంబాన్ని పోషించడానికి రకరకాల వేశాలు వేసేవాడు. ఎవరు ఎన్ని అన్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. వందకి వెయ్యికి ప్రమోషన్లు చేశాడు. కుటుంబాన్ని పోషించాడు. ఆతరువాత కాలంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బాలు జీవితంలో అవమానాలు ఇబ్బందులు..
Image Credit : Uppal Balu faceBook

బాలు జీవితంలో అవమానాలు ఇబ్బందులు..

ఉప్పల్ బాబు టిక్ టాక్ వీడియోలు, వింత వేశాలు వేస్తున్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు కూడా బాలుతో సరిగ్గా మాట్లాడేవారు కాదట. బంధువులు అయితే దగ్గరకు కూడా రానివ్వలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బాలు. చిన్న తనం నుంచి తన కుటుంబంలో మేనమామలు, బాబాయిలు ఎంతో ప్రేమగా ఉండేవారని.. వారి ఇంట్లో ఏం జరిగినా తన సందడే ఎక్కువగా ఉండేదని బాలు అన్నాడు. అంతే కాదు టిక్ టాక్ వీడియోలు మొదలు పెట్టినప్పటి నుంచి బయటివారికంటే బంధువులే తనను దూరం పెట్టారని బాలు బాధపడ్డాడు. ఇంటికి రావద్దని చెప్పేశారట. ఎదురు పడితే ముఖం తిప్పుకుని వెళ్లేవారట. ఇంట్లో పెళ్లిల్లు ఫంక్షనస్ కు కూడా పిలవడం మానేశారని బాలు ఓ సందర్భంలో వెల్లడించాడు.

Related Articles

Related image1
మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Related image2
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కుళ్ళు జోకులు.. నిహారిక విడాకులపై వెకిలి కామెడీ, స్టాండప్ కమెడియన్ ను వదిలేదిలేదంటున్న మెగా అభిమానులు
35
అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు రమ్మంటున్నారు..
Image Credit : Uppal Balu faceBook

అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు రమ్మంటున్నారు..

కానీ ఇప్పుడు బాలు పూర్తిగా మారిపోయాడు కూల్ గా కామ్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. పిచ్చి పిచ్చి అరుపులు లేవు, వింత వేశాలు కూడా లేవు.. బుద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెద్దగా మాట్లాడటంలేదు. కామ్ గా ఉంటున్నాడు. నిదానంగా సమాధానం చెపుతున్నాడు. బాలు మాట్లాడుతూ.. ''ఒకప్పుడు నన్ను వద్దన్న వారు.. నేను ఫేమస్ అయ్యాక నా కోసం వెతుకుంటున్నారు.. ఇంటికి రమ్మని బ్రతిమలాడుతున్నారు. 

కానీ నేను రాను అని వారికి చెప్పేశాను. అప్పుడు నా దగ్గర డబ్బులేదు. కానీ ఇప్పుడు డబ్బుతో పాటు.. ఇమేజ్ కూడా ఉంది. అందుకే రమ్మని పిలుస్తున్నారు. కానీ మొదటి నుంచి నన్ను అర్ధం చేసుకుని.. నాతో ఉన్నవారే.. ముందు ముందు కూడా నాతోనే ఉంటారు. వారికి ఏ లోటు లేకుండా చూసుకోవడమే నా టార్గెట్'' అని బాలు ఓఇంటర్వ్యలో వెల్లడించారు.

45
బాలు జీవితాన్ని మార్చింది ఎవరు?
Image Credit : Uppal Balu faceBook

బాలు జీవితాన్ని మార్చింది ఎవరు?

సోషల్ మీడియా స్టార్ గా ఉన్న బాలుని హియ్యా మండి టీమ్ దగ్గరకు తీసింది. ఆ కంపెనీకి బాలు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఆ టీమ్ లీడర్ గౌతమి బాలుతో ప్రమోషన్లు చేయించుకుంటూ.. రకరకాల థీమ్స్ తో బాలుని బిజీ చేశారు. అంతే కాదు కంటీన్యూగా ఆ కంపెనికి పనిచేసినందుకు నెలకు లక్ష రూపాయల వరకూ జీతం కూడా ఇస్తున్నారు. బాలు గౌరవంగా బ్రతికేలా దారి చూపించారు.

55
పూర్తిగా మారిపోయిన ఉప్పల్ బాలు..
Image Credit : Uppal Balu faceBook

పూర్తిగా మారిపోయిన ఉప్పల్ బాలు..

దాంతో బాలు కూడా గతంలో మాదిరిగా పిచ్చి పిచ్చి వీడియోలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అరుపులు కేకలు లేకుండా కామ్ గా తన పని తాను చేసకుంటూ వెళ్తున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు. ఖాళీటైమ్ లో ఈవెంట్లు కూడా చేసుకుంటున్నాడు. గతంలో లా తాను పిచ్చి వీడియోలు చేస్తే.. నన్ను నమ్మి.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాడమ్ కు పేరు వస్తుంది అందుకే ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయాను అని బాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Related Stories
Recommended image1
మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Recommended image2
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కుళ్ళు జోకులు.. నిహారిక విడాకులపై వెకిలి కామెడీ, స్టాండప్ కమెడియన్ ను వదిలేదిలేదంటున్న మెగా అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved