MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

అయిపోయిందనుకున్న వివాదం మళ్లీ మొదలయ్యింది. ఆమధ్య శివాజీ కామెంట్స్, అనసూయ కౌంటర్లు ఎంత సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో తెలిసిందే. ఇక అంతా సర్ధుమణిగింది అనుకున్న టైమ్ లో.. అనసూయ మళ్లీ మొదలెట్టింది.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2026, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శివాజీ vs అనసూయ
Image Credit : Anasuya

శివాజీ vs అనసూయ

రీసెంట్ గా లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపాయి.. చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో శివాజీని విమర్శించారు. అందులో యాంకర్ అనసూయ అయితే పెద్ద యుద్దమే చేసింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత వచ్చినా.. తగ్గలేదు స్టార్ యాంకర్. శివాజీ పై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. ఇండస్ట్రీలో కూడా ఈ విషయం పెద్ద దుమారమే రేపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సోషల్ మీడియావార్
Image Credit : Instagram/Anasuya

సోషల్ మీడియావార్

ఈ వివాదంలో కొంత మంది శివాజీకి సపోర్ట్ చేయగా.. మరికొంత మంది మాత్రం ఆయన్ను విమర్శించారు. శివాజీ vs అనసూయ గా మారి తెగ హడావిడి చేశారు. ఇక ఈ సోషల్ మీడియావార్ లో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Prabhas : బిర్యానీ ఆఫర్ చేసి.. ప్రభాస్ ను లంచ్ కు పిలిచిన అమ్మాయి, పాన్ ఇండియా స్టార్ ఏమన్నాడో తెలుసా?
Related image2
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కుళ్ళు జోకులు.. నిహారిక విడాకులపై వెకిలి కామెడీ, స్టాండప్ కమెడియన్ ను వదిలేదిలేదంటున్న మెగా అభిమానులు
36
దుమారం రేపిన శివాజీ కామెంట్స్..
Image Credit : youtube/@iDreamCelebrities

దుమారం రేపిన శివాజీ కామెంట్స్..

‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ, మహిళలు నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, శరీరం కనిపించేలా దుస్తులు ధరించడం సరైంది కాదని కామెంట్స్ చేశారు.. అంతేకాదు, అలాంటి దుస్తులు వేసుకునే వారిపై ప్రజలు బయట నవ్వినా, లోపల మాత్రం విమర్శిస్తారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.

46
అయిపోయిందనుకుంటే మళ్లీ మొదలయ్యింది..
Image Credit : youtube/@iDreamCelebrities

అయిపోయిందనుకుంటే మళ్లీ మొదలయ్యింది..

ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ భరద్వాజ్, మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత ఎంపిక అని స్పష్టం చేశారు. అసలు సమస్య దుస్తుల్లో లేదని, పురుషుల ఆలోచనా విధానం, మహిళల పట్ల ప్రవర్తనలో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె అభిప్రాయానికి అనేక మంది సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు  సపోర్ట్  తెలిపారు. కొన్ని రోజులు ఇలానే కొనసాగిన వివాదం.. ఆతరువాత సర్దుమణుగుతూ వచ్చింది.

56
అనసూయ పోస్ట్ తో మొదలయైన రచ్చ..
Image Credit : i nstagram / Anasuya

అనసూయ పోస్ట్ తో మొదలయైన రచ్చ..

ఇక ఈ వివాదం అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో తాజాగా అనసూయ చేసిన పోస్ట్ మళ్లీ రచ్చకు దారి తీసింది. ఒక వీడియోతో మళ్లీ ఈ వివాదాన్ని మొదలు పెట్టింది అనసూయ. ఆ వీడియోలో ఆమె సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని తన భర్తతో కలిసి కనిపించారు. ఈ వీడియోను ఒక న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ” అంటూ క్యాప్షన్ ఇవ్వడం కొత్త వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన అనసూయ తనదైన మార్క్ లో కౌంటర్ ఇచ్చింది.

66
శివాజీ సృష్టించిన చీర అంటూ సెటైర్లు..
Image Credit : Asianet News

శివాజీ సృష్టించిన చీర అంటూ సెటైర్లు..

అనసూయ పోస్ట్ లో ఏముందంటే.. “తప్పు తప్పు.. ‘శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ’ అని కదా హెడ్డింగ్ ఉండాలి. ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు” అంటూ ఆమె సెటైరికల్‌గా స్పందించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనసూయ తన కామెంట్ సెక్షన్‌ను లాక్ చేయడంతో నెటిజన్లు స్పందించే అవకాశం లేకుండా పోయింది. మరి ఈ వివాదం మళ్ళీ ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Prabhas : బిర్యానీ ఆఫర్ చేసి.. ప్రభాస్ ను లంచ్ కు పిలిచిన అమ్మాయి, పాన్ ఇండియా స్టార్ ఏమన్నాడో తెలుసా?
Recommended image2
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కుళ్ళు జోకులు.. నిహారిక విడాకులపై వెకిలి కామెడీ, స్టాండప్ కమెడియన్ ను వదిలేదిలేదంటున్న మెగా అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved