ఇది కదా అభిమానం అంటే, అల్లు అర్జున్ ని కలిసిన ఉపేంద్ర.. భార్య ముందు ఖిలాడీగా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు. దీనితో అల్లు అర్జున్ పరామర్శించేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా క్యూ కట్టారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు. దీనితో అల్లు అర్జున్ పరామర్శించేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా క్యూ కట్టారు. వెంకటేష్, అఖిల్, అడివి శేష్, సుధీర్ బాబు, ఆకాష్ పూరి, శ్రీకాంత్, దిల్ రాజు, రాఘవేంద్ర రావు, కొరటాల శివ అల్లు అర్జున్ ని కలసి పరామర్శించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో అల్లు అర్జున్ ని కూడా బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. కానీ అల్లు అర్జున్ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొంది రిలీజ్ అయ్యారు.
అల్లు అర్జున్ ని టాలీవుడ్ సెలెబ్రిటీలు మాత్రమే కాదు ఇతరులు కూడా పరామర్శిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ని ఆయన ఇంటికి వెళ్లి కలవడం విశేషం. దీనితో ఉపేంద్ర మరోసారి అల్లు అర్జున్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర యుఐ చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ లోనే ఉన్నారు. అల్లు అర్జున్ రిలీజ్ అయిన విషయం తెలుసుకున్న ఉపేంద్ర వెంటనే వెళ్లి కలిశారు.
Upendra Rao
కాసేపు అల్లు అర్జున్ తో ముచ్చటించి తిరిగి వెళ్లారు. ఉపేంద్ర, అల్లు అర్జున్ కలసి గతంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం సూపర్ హిట్ కాలేదు కానీ.. ఉపేంద్ర పాత్రకి, ఆయన నటనకి ప్రశంసలు దక్కాయి. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో తాను పోషించిన దేవరాజ్ పాత్ర అంటే చాలా ఇష్టం అని ఉపేంద్ర పలు వేదికలపై తెలిపారు.
భార్య ముందు ఖిలాడీగా నటించే పాత్ర తనకి ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని ఉపేంద్ర గతంలో అన్నారు. ఆ చిత్రం నుంచి ఉపేంద్ర, అల్లు అర్జున్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఉపేంద్ర కన్నడ స్టార్ అయినప్పటికీ తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. కొన్ని దశాబ్దాలుగా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచయం.