- Home
- Entertainment
- ఓ మై గాడ్! రాంచరణ్, ఉపాసన ఆ నిర్ణయం తీసుకున్నారా.. ఫేక్ న్యూస్ పై మెగా కోడలి రియాక్షన్ ఇదిగో
ఓ మై గాడ్! రాంచరణ్, ఉపాసన ఆ నిర్ణయం తీసుకున్నారా.. ఫేక్ న్యూస్ పై మెగా కోడలి రియాక్షన్ ఇదిగో
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. అయితే ఇన్నేళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగడం విషయంలో ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
ఇటీవల ఈ చర్చ కాస్త ఎక్కువైంది. ఇటీవల ఉపాసన.. సద్గురుతో ఓ కార్యక్రమంలో పాల్గొంది. తాను పిల్లల్ని కనడం, కనకపోవడం గురించి బయట చర్చ జరుగుతోంది అంటూ ఉపాసన సద్గురు వద్ద ప్రస్తావించింది. ఈ టాపిక్ గురించి ఉపాసనే మాట్లాడడంతో బాగా వైరల్ అయింది. ఉపాసన అడిగిన ప్రశ్నకు సద్గురు కూడా ఆసక్తికరంగా బదులిచ్చారు.
పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి తాను అవార్డు ఇస్తానని అన్నారు. ఎందుకంటే ప్రపంచ జనాభా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి టైంలో పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి అవార్డు ఇవ్వాలి. మానవులు ఏమీ అంతరించిపోతున్న జాతి కాదు అని సద్గురు అన్నారు. ఆ తర్వాత ఉపాసన సోషల్ మీడియాలో.. సద్గురు మాటలకు బదులిస్తూ.. 'సద్గురు.. మీ అవార్డు తీసుకునేందుకు మా తాత అంగీకరించడం లేదు' అని కామెంట్ పెట్టింది.
అంటే తాను పిల్లని కనేందుకు సిద్దంగానే ఉన్నానని ఉపాసన చెప్పకనే చెప్పింది. కానీ ఉపాసన అడిగిన ప్రశ్న, సద్గురు సమాధానం విని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతే కాదు ఫేక్ న్యూస్ వైరల్ చేయడం మొదలు పెట్టారు. పాపులేషన్ పెరిగిపోతోంది కాబట్టి రాంచరణ్, ఉపాసన పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్నారు అంటూ అసత్య ప్రచారం మొదలు పెట్టారు.
ఇన్స్టాగ్రామ్లో తాను చరణ్ పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్నట్లు రాసి ఉన్న ఆర్టికల్ ని ఉపాసన గమనించింది. ఈ న్యూస్ చూసిన ఉపాసన షాక్ కి గురైంది. ' ఓ మై గాడ్.. ఇది నిజం కాదు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి' అంటూ ఉపాసన బదులిచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాంచరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాంచరణ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటించాల్సి ఉంది.