- Home
- Entertainment
- జాన్వీ కపూర్‌కి ఉపాసన స్వీట్ సర్‌ప్రైజ్.. రామ్ చరణ్ తల్లి ఏం పంపిందో తెలుసా? `ఆర్‌సీ16` అప్ డేట్
జాన్వీ కపూర్‌కి ఉపాసన స్వీట్ సర్‌ప్రైజ్.. రామ్ చరణ్ తల్లి ఏం పంపిందో తెలుసా? `ఆర్‌సీ16` అప్ డేట్
Janhvi Kapoor-Upasana: జాన్వీ కపూర్ ని సర్‌ప్రైజ్ చేసింది ఉపాసన. `ఆర్‌సీ16` మూవీ సెట్‌లో ఆమెకి సురేఖ పంపించిన గిఫ్ట్ ని అందించింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.

Ram Charan
రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం `ఆర్‌సీ16`(వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీ సెట్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చరణ్ వైఫ్ ఉపాసన.
janhvi kapoor, upasana
రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షూటింగ్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. ఈ మూవీ సెట్‌ని ఉపాసన విజిట్ చేసి టీమ్‌ని సర్‌ప్రైజ్ చేసింది. దీంతోపాటు గిఫ్ట్ తో జాన్వీని ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ తల్లి, ఉపాసన అత్తగారు సురేఖ.. జాన్వీ కోసం సెపరేట్‌గా గిఫ్ట్ పంపించడం విశేషం.
అదేంటో కాదు `అత్తమ్మ కిచెన్` కిట్. సురేఖ, ఉపాసన, అంజనాదేవిలు కలిసి `అత్తమ్మ కిచెన్` పేరుతో స్పెషల్ రిసిపీలు ప్రిపేర్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని సేల్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అమ్మకం కూడా జరుగుతుంది.
Megastar Chiranjeevi, surekha
ఆ స్పెషల్ రెసిపీ ఐటెమ్స్ కిట్‌ని జాన్వీ కపూర్ కి గిఫ్ట్ గా ఇచ్చింది ఉపాసన. అయితే ఇందులో మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. దీన్ని ఒక బ్రాండ్‌గా ప్రమోట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అందుకు జాన్వీ కపూర్ చేత ప్రమోట్ చేయిస్తున్నారా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ హీరోయిన్‌కి ఆయన తల్లి, భార్య కలిసి ఇలా సర్‌ప్రైజ్ చేయడం విశేషం. దీన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది జాన్వీ కపూర్. అది వైరల్ అవుతుంది.
Ram charan, rc16
ఇదిలా ఉంటే `ఆర్‌సీ16`మూవీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సాగుతుందని తెలుస్తుంది. కబడ్డీ, కుస్తీ, క్రికెట్ గేమ్స్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో గుడ్డివాడిగా చరణ్ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అప్ డేట్ కూడా వినిపిస్తుంది. దీనికి `పెద్ది` అనే టైటిల్‌ని అనుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి.
దీనిపై ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు. కానీ అదే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలో ఈ మూవీ ఢిల్లీలో చిత్రీకరణ జరుపుకోబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఎండింగ్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.