MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ ఫైట్ కు కురుక్షేత్రంలో రిఫెరన్స్ తీసుకున్నా: రాజమౌళి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ ఫైట్ కు కురుక్షేత్రంలో రిఫెరన్స్ తీసుకున్నా: రాజమౌళి

‘‘నా డ్రీమ్‌ ప్రాజెక్టు ‘మహాభారతం’ సాధ్యమయ్యేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ అడుగు దగ్గరపడేలా చేసింది. స్టోరీ టెల్లర్‌గా రామాయణం, మహాభారతం నుంచి స్ఫూర్తి పొందా. 

3 Min read
Author : Surya Prakash
Published : Dec 28 2024, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Rajamouli, Mahabharata, RRR Movie

Rajamouli, Mahabharata, RRR Movie


  యావత్‌ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్‌ఆర్‌ఆర్‌)లో మహాభారత ప్రభావం ఉందని స్వయంగా రాజమౌళి చెప్పారు.ముఖ్యంగా ఓ ఫైట్ లో మహాభారతంలోని యుద్దం రిఫెరెన్స్ తీసుకున్నామని చెప్పుకొచ్చారు.  ఇంతకీ  ఆయన ఏమన్నారు.

బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం ఆస్కార్‌ సైతం (నాటు నాటు పాటకుగానూ) అందుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు రామ్‌ చరణ్‌ (Ram Charan)- ఎన్టీఆర్‌ (NTR)లను ఒకే ఫ్రేమ్‌లో చూసిన సినీ అభిమానులు ఎంతగా ఆనందించారో.. ఆ మూవీ తెర వెనక సంగతులు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపారు. ఈక్రమంలోనే చిత్ర టీమ్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ & బియాండ్‌’ (RRR: Behind& Beyond) టైటిల్ తో డాక్యుమెంటరీని రూపొందించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
RRR (Rs 550 crore)

RRR (Rs 550 crore)


 రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రం బాహుబలి లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా  తెరకెక్కడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వచ్చి హై సక్సెస్ అయ్యింది. రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుతునే ఉన్నారు. 

39


  ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఇటీవల విడుదలైన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (RRR Documentory OTT Platform)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌, నిర్మాత డీవీవీ దానయ్య లు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో మహాభారతం ప్రభావం గురించి రాజమౌళి చెప్పుకొచ్చారు.
 

49


రాజమౌళి మాట్లాడుతూ....  ‘‘నా డ్రీమ్‌ ప్రాజెక్టు ‘మహాభారతం’ సాధ్యమయ్యేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ అడుగు దగ్గరపడేలా చేసింది. స్టోరీ టెల్లర్‌గా రామాయణం, మహాభారతం నుంచి స్ఫూర్తి పొందా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలా వచ్చిన ప్రొడక్టే’’ అని రాజమౌళి తెలిపారు. 
 

59


అలాగే ఆర్‌.ఆర్‌.ఆర్ లో హైలెట్ సీన్స్ లో ఒకటి రామ్ చ‌ర‌ణ్ – వేలాది మందితో ఫైట్ చేసే సీన్ . దాన్ని ఎలా డిజైన్ చేశారో, ఎలా తెర‌పైకి తీసుకొచ్చారో క‌ళ్ల‌కు క‌ట్టారు. రాజమౌళి ‘నేను తీయ‌గ‌ల‌నా, లేదా’ అని భ‌య‌ప‌డిన స‌న్నివేశం ఇదేన‌ట‌. అయితే.. ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకొన్న‌ది అనుకొన్న‌ట్టు ఆవిష్క‌రించ‌గ‌లిగాడు. కురుక్షేత్రంలో అభిమ‌న్యుడి యుద్ధాన్ని ఈ ఫైట్ కోసం రిఫ‌రెన్స్ గా తీసుకొన్నాడు ఫైట్ మాస్ట‌ర్‌.
 

69


 ఈ సీన్‌లో దాదాపు 10వేల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు ఉన్నార‌న్న భ్ర‌మ క‌ల్పించారు. కానీ అక్క‌డ ఉన్న‌ది కేవ‌లం 800మంది మాత్ర‌మే. క‌ట్ చెప్పిన‌ప్పుడు జ‌నం గుంపులో చ‌ర‌ణ్ ఎక్క‌డున్నాడో ఎవ‌రికీ తెలిసేది కాద‌ట‌. క‌ట్ అన‌గానే.. ఆ 800 జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు హీరో ఎక్క‌డ ఉన్నాడో తెలిసేలా.. ఓ తెల్ల జెండా ఊపేవార్ట‌. అలాగే ఈ ఫైట్ లో.. ఓ ఐకానిక్ షాట్ ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ క‌ళ్ల‌లో క్లోజ‌ప్ పెట్టిన‌ప్పుడు జ‌న స‌మూహం చ‌ర‌ణ్ క‌ళ్ల‌ల్లో క‌నిపిస్తుంది. నిజానికి అది సీజీ షాట్ అని అంతా అనుకొన్నారు. కానీ అది లైవ్ షాట్. అదెలా తీశారో సింధిల్ ఈ డాక్యుమెంట‌రీలో వివ‌రించాడు.

79


అలాగే ‘‘కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు దాదాపు ఒకే సమయంలో పుట్టారు. ఒకే సమయంలో ఇద్దరూ కనిపించకుండా వెళ్లిపోయారు. వారిద్దరూ ఒకచోట తారసపడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ. బుక్స్‌, కామిక్స్‌, మూవీస్‌.. ఇలా ఏదైనా అందులో యాక్షన్‌ ఉంటే ఇష్టపడతా. అందులో సాధ్యమైనంతవరకూ ఎమోషన్‌ను జోడించాలనుకుంటా. హీరోల ఇంట్రడక్షన్స్‌ సీన్స్‌ను యాక్షన్‌ ఓరియెంటెడ్‌గానే కాకుండా ఆయా పాత్రల గురించి ప్రేక్షకుడికి లోతుగా తెలియాలనుకుంటా.  అలా చేసేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరింత స్కోప్‌ దక్కింది’’ అని రాజమౌళి అన్నారు.
 

89


అంతేకాకుండా  ‘‘రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ విషయంలో ఆలోచించినంతగా మరే చిత్రానికి ఆలోచించలేదు. ఆ సీన్‌లో లుక్స్‌ పరంగా ఆ క్యారెక్టర్‌ హీరోగా కనిపించినా యాక్షన్‌ పరంగా విలన్‌గా కనిపిస్తుంది. ఫైట్‌ ఎలా ఉండాలో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌కు వివరించా. నా విజన్‌ ఏంటో సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌కూ చెప్పా. పోరాటం చేస్తున్నవారు చరణ్‌ కంటిలో స్పష్టంగా కనిపించాలనుకున్నా. ఆ మేరకు లైవ్‌ షాట్‌లో తీశాం. అది సీజీ కాదు’’ అని  రాజమౌళి చెప్పుకొచ్చారు.
 

99


రాజమౌళి కంటిన్యూ చేస్తూ...‘‘టైగర్‌ సీక్వెన్స్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. భీమ్‌ పాత్రతో అది కుదిరింది. తారక్‌ ఎంతో వేగంగా పరిగెత్తాడు. ఓచోట జంప్‌ చేసే క్రమంలో నేను ఊహించిన షాట్‌ దొరికిందనిపించింది. జంతువుల వేగాన్ని అందుకోవడం కష్టం. దానికి తగ్గట్టు తొలుత యానిమేషన్‌ చేశాం.

యానిమల్‌ ఉందని ఊహించుకొని ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేయడం ఒకెత్తు అయితే, ఎంత వేగంతో పరిగెత్తాలన్నది మరో ఎత్తు. భీమ్‌ క్యారెక్టర్‌ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ అయినా ఎమోషన్‌ ఎక్కువ. భీమ్‌- టైగర్‌ ఫేస్‌ టు ఫేస్‌ షాట్‌ ఐకానిక్‌. ఎన్టీఆర్‌ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క పులి కాదు రెండు పులులతో (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) షూటింగ్‌ చేశా’’ అని రాజమౌళి  చెప్పుకొచ్చారు ఈ డాక్యుమెంటరీలో.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved