21 ఏళ్లకే మాతృత్వం.. స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి తెలియని నిజాలు
`పుష్ప 2`లో ఐటెమ్ సాంగ్ చేసిన శ్రీలీల గురించి ఎవరికీ తెలియని నిజాలు. ఈ యంగ్ స్టార్ హీరోయిన్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
శ్రీలీల
తన డాన్సు తో ఉర్రూతలూగించే శ్రీలీల అతి తక్కువ కాలంలోనే అభిమానులను సంపాదించుకుంది. 2019లో `కిస్` అనే కన్నడ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో `పెళ్లి సందడి` (2021), జేమ్స్ (2022) లలో అతిథి పాత్రల్లో నటించింది.
నటి శ్రీలీల
రవితేజ `ధమాకా` సినిమా శ్రీలీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. బాలకృష్ణ `భగవంత్ కేసరి`, మహేష్ బాబు `గుంటూరు కారం` సినిమాల్లోనూ నటించి మెప్పించింది. `గుంటూరు కారం`లో కుర్చీ మాడతబెట్టి పాటకు శ్రీలీల వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.
శ్రీలీల తల్లిదండ్రులు
పుష్ప 2లో అల్లు అర్జున్‌తో ఓ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. శ్రీలీల గురించి తెలియని విషయాలు చూద్దాం. గైనకాలజిస్ట్ స్వర్ణలత, వ్యాపారవేత్త సురబనేని సుధాకర్ రావు దంపతుల కుమార్తె శ్రీలీల. ఆమె పుట్టకముందే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లితో పెరిగిన శ్రీలీల డాక్టర్ కావాలనుకుంది.
శ్రీలీల దత్తత
కానీ, నటి కావాలనే కోరిక మొదలైంది. కుటుంబ సభ్యులు ముందు అభ్యంతరం చెప్పినా, తర్వాత ఒప్పుకున్నారు. ఓ వైపు డాక్టర్ (ఎంబీబీఎస్) చేస్తూనే సినిమాలు చేస్తూ రాణిస్తుంది. శ్రీలీల రెండేళ్ల క్రితం ఇద్దరు వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది. బై టు లవ్ అనే కన్నడ చిత్రంలో చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించింది.
దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అబ్బాయి, అమ్మాయిని దత్తత తీసుకుంది. దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పుడు శ్రీలీల వయసు 21. ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తోంది.
`పుష్ప 2`లో ఐటెమ్ సాంగ్ చేసిన శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్‌గా `మాస్ జాతర`, `రాబిన్‌హుడ్`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాల్లో నటిస్తుంది. `దమాకా` హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో వచ్చిన అన్ని అవకాశాలకు ఓకే చెప్పింది. దీంతో వాటిలో చాలా వరకు బోల్తా కొట్టాయి. శ్రీలీల ఎంత ఫాస్ట్ గా రైజ్ అయ్యిందో అంతే వేగంగా డౌన్ అయ్యింది. ఇప్పుడు నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తుంది.
read more: శోభిత దూళిపాళని తీసేసి కుక్కని పెట్టుకున్నారు, నాగచైతన్య రెండో భార్యకి ముంబయిలో తీవ్ర అవమానం
also read: 40ఏళ్ల క్రితమే 10 లక్షలు వదిలేసిన రజనీకాంత్, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనందుకు డేరింగ్ డెసీషన్