- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9లో దిమ్మ తిరిగే ట్విస్ట్.. దెబ్బకి లెక్కలన్నీ మారిపోతాయి
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9లో దిమ్మ తిరిగే ట్విస్ట్.. దెబ్బకి లెక్కలన్నీ మారిపోతాయి
ఈసారి బిగ్ బాస్ షోలో అనేక మార్పులు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా షో ప్రారంభమైన మూడవరోజే బిగ్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో బిగ్ బాస్ తెలుగు 9
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక జరిగిందంటూ కొందరు సెలబ్రెటీల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి కొత్త అనుభూతిని అందించే దిశగా నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
సీజన్ 9 లో మార్పులు
తొలి సీజన్ నుంచి బిగ్ బాస్ షో రొటీన్ గా సాగుతోంది అనే విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సీజన్ 9 లో కొత్తదనం అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం బిగ్ బాస్ తెలుగు 9 లో సమూల మార్పులు చేయబోతున్నారట. కంటెస్టెంట్ లు గేమ్ ఆడే విధానం, టాస్కులు, వారిని ఎలిమినేట్ చేసే విధానం ఇలా అన్ని అంశాలు మారిపోబోతున్నట్లు తెలుస్తోంది.
ఎవ్వరూ ఊహించని బిగ్ ట్విస్ట్
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు నైన్ లో బిగ్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎలిమినేషన్ ప్రక్రియ షో ప్రారంభమైన వారం తర్వాత మొదలవుతుంది. కానీ సీజన్ 9లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా మూడవ రోజే తొలి ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు టాక్.
ప్రారంభంలోనే ఆసక్తి పెంచేలా ప్లాన్
ఇది కనుక నిజమైతే బిగ్ బాస్ సీజన్ 9 పై ప్రారంభంలోనే ఆసక్తి పెరిగిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. బిగ్ బాస్ షోలో గతంలో వీకెండ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగేది. కొన్నిసార్లు డబుల్ ఎలిమినేషన్ తో కూడా ట్విస్ట్ ఇచ్చారు. మరి కొన్నిసార్లు ఎలిమినేట్ చేసిన వారిని తిరిగి వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రేటింగ్ లెక్కలు మారిపోతాయి
కానీ షో ప్రారంభమైన మూడవ రోజే ఎలిమినేషన్ అనేది మాత్రం ఎవరూ ఊహించని ట్విస్ట్. ఇది జరిగితే టీఆర్పీ రేటింగ్ లెక్కలు కూడా మారిపోతాయి అని అంటున్నారు. మరి దీనిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సీజన్లో జబర్దస్త్ ఇమ్మానుయేల్, తేజస్విని గౌడ, కల్పిక గణేష్, నవ్య స్వామి, హీరో సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, నటుడు సాయికిరణ్, రీతూ చౌదరి లాంటి సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.