నిధి అగర్వాల్ పై సీఎం తనయుడి కామెంట్స్.. మరోసారి తెరపైకి మ్యారేజ్ రూమర్స్ ?
నిధి అగర్వాల్ పేరు చెప్పగానే బొద్దుగా ఉండే అందాల రూపం యువతకు గుర్తుకు వస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ.

Nidhhi Agerwal
నిధి అగర్వాల్ పేరు చెప్పగానే బొద్దుగా ఉండే అందాల రూపం యువతకు గుర్తుకు వస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.
ప్రస్తుతం నిధి అగర్వాల్ కి వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో హీరో, సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి జోడిగా కలగ తలైవన్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 18న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉదయనిధి.. నిధి అగర్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నాకంటే ఎక్కువ కష్టపడింది. యాక్షన్ సీన్స్ లో కూడా నటించింది. దీనితో ఆమెకి గాయాలు కూడా అయ్యాయి. పాపం నిధి అగర్వాల్ ఇకపై తమిళ సినిమాలు చేస్తుందో లేదో అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
ఉదయనిధి అలా మాట్లాడడంతో నిధి అగర్వాల్ పై మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. ఆ మధ్యన నిధి అగర్వాల్.. స్టార్ హీరో శింబుతో ప్రేమలో ఉందని. . త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఉదయనిధి కామెంట్స్ తో.. శింబు, నిధి త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.
వివాహం తర్వాత నిధి సినిమాలు మానేస్తుందేమో.. అందుకే ఉదయనిధి అలా అన్నారు అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మరికొందరు ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. కలగ తలైవన్ కోసం నిధి గాయాలపాలై ఎంతో కష్టపడింది. అందుకే ఆమె ఇక తమిళ సినిమాలు చేస్తుందో లేదని అని ఉదయనిధి సరదాగా వ్యాఖ్యానించారు. ఆ మాటల్లో ఇక ఎలాంటి అర్థం లేదని అంటున్నారు.