MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఫస్ట్ సినిమాతోనే పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌కి చెమటలు పట్టించిన ఒకే ఒక్కడు.. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయ్యింది ఎవరో తెలుసా?

ఫస్ట్ సినిమాతోనే పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌కి చెమటలు పట్టించిన ఒకే ఒక్కడు.. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయ్యింది ఎవరో తెలుసా?

స్టార్స్ వారసులుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణించారు పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌. కానీ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి వీరికి చెమటలు పట్టించాడొక హీరో.

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 10 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నువ్వు నేను మూవీకి 25 ఏళ్లు
Image Credit : stockPhoto

నువ్వు నేను మూవీకి 25 ఏళ్లు

తెలుగు సినీ చరిత్రలో కొన్ని ప్రేమకథలు కాలం మారినా ప్రేక్షకుల జ్ఞాపకాల్లోంచి చెరిగిపోవు. అలాంటి చిత్రాల్లో ‘నువ్వు నేను’ ఒకటి. ఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2001 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేటికి ఈ సినిమా విడుదలై సరిగ్గా 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఒక సాధారణ యువకుడిని స్టార్‌గా నిలబెట్టిన ఈ చిత్రం.. అప్పటి యువత ప్రేమ, స్నేహం, కుటుంబాల మధ్య సంఘర్షణలను తెరపై ఎంతో సహజంగా చూపించి సంచలనం సృష్టించింది. ఉదయ్‌ కిరణ్‌ అనే కొత్త కుర్రాడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంతేకాదు ఓవర్‌నైట్‌లో మనోడిని స్టార్‌ని చేసింది. అదే సమయంలో స్టార్‌ వారసులు అయిన పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ లకు చెమటలు పట్టించిందీ మూవీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లవ్‌ స్టోరీస్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన నువ్వు నేను
Image Credit : stockPhoto

లవ్‌ స్టోరీస్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన నువ్వు నేను

‘చిత్రం’తో దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ కాంబినేషన్‌కు వచ్చిన క్రేజ్‌ను మరింత పెంచేలా ‘నువ్వు నేను’ రూపొందింది. తేజతో పాటు దశరథ్ కథకు రూపకల్పన చేయగా, పి. కిరణ్ నిర్మాతగా వ్యవహరించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, ఆర్.పి. పట్నాయక్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో హీరో రవి.. సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు కాగా, హీరోయిన్ వసుంధర పాల వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన అమ్మాయి. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొంటూ వారి ప్రేమ సాగడం అప్పటి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో అనితకు అధికారికంగా హీరోయిన్‌గా పరిచయం జరిగింది. మరోవైపు సునీల్ పోషించిన కాలేజ్ యువకుడి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత, కాలేజ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు బలంగా మారాయి. తేజ తనదైన సహజమైన టేకింగ్‌తో పాత్రలను, వారి భావోద్వేగాలను తెరపైకి తీసుకురావడం సినిమాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

35
పాటలు.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ ..  ఓవర్‌ నైట్‌ స్టార్‌
Image Credit : stockPhoto

పాటలు.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ .. ఓవర్‌ నైట్‌ స్టార్‌

‘నువ్వు నేను’ విజయానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం మరో ప్రధాన కారణం. ‘ప్రియతమా ఓ ప్రియతమా’, ‘నువ్వే నువ్వే’, ‘నా గుండెల్లో’, ‘నీ కోసమే’, ‘నువ్వే నాకు ప్రాణం’ వంటి పాటలు అప్పట్లో కాసెట్ల నుంచి ప్రతి చోటా వినిపించేవి. తొమ్మిది పాటలతో రూపొందిన ఆల్బమ్ ఆ రోజుల్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ విజయంతో పాటు ‘నువ్వు నేను’ అవార్డుల పరంగానూ సంచలనం సృష్టించింది. ఈ సినిమా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు తేజ, ఉత్తమ నటుడు ఉదయ్ కిరణ్, ఉత్తమ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఐదు నంది అవార్డులు కూడా దక్కించుకుంది. తేజ, తనికెళ్ల భరణి, సునీల్, రసూల్ ఎల్లోర్, ఆర్.పి. పట్నాయక్‌లు నంది అవార్డులతో సత్కరించబడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలోని నటనకు ఉదయ్ కిరణ్ అందుకున్న ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయన కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఆయన్ని ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ని చేసింది. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ వంటి వరుస విజయాలతో ఉదయ్ కిరణ్‌కు ‘హ్యాట్రిక్ హీరో’, ‘లవర్ బాయ్’ అనే ఇమేజ్ బలపడింది.

45
25 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్!
Image Credit : stockPhoto

25 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్!

కాలం మారింది.. సినిమాలు చూసే విధానం మారింది.. కానీ ‘నువ్వు నేను’పై ప్రేక్షకుల ప్రేమ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా 90ల చివర్లో, 2000ల ప్రారంభంలో పెరిగిన తరానికి ఈ సినిమా కేవలం ఓ ప్రేమకథ కాదు—ఓ జ్ఞాపకం. ఉదయ్ కిరణ్ అమాయకమైన స్క్రీన్ ప్రెజెన్స్, తేజ టేకింగ్, ఆర్.పి. పట్నాయక్ సంగీతం కలిసి ఈ చిత్రాన్ని ఓ తరం ఫేవరెట్‌గా మార్చాయి. 25 ఏళ్లు పూర్తయినా ‘నువ్వు నేను’ ఇంకా కొత్తగానే అనిపిస్తుందంటే.. అది కేవలం సినిమా విజయం కాదు, ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న శాశ్వత స్థానం. ఉదయ్‌ కిరణ్‌ ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన 2014లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

55
పవన్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ లకు చెమటలు
Image Credit : stockPhoto

పవన్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ లకు చెమటలు

ఇదిలా ఉంటే సినిమా విడుదల సమయంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. మరోవైపు మహేష్‌ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి స్ట్రగుల్‌ అవుతున్నాడు. అలాగే ఎన్టీఆర్‌ అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే వీరంతా స్టార్‌ వారసులు. పవన్‌.. చిరంజీవి తమ్ముడిగా వచ్చి తనకంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. మహేష్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్‌.. నందమూరి మూడోతరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వీరిపై ఆడియెన్స్ లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాంటి సమయంలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా `నువ్వు నేను` అనే సినిమాతో హీరోగా పరిచయం ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు ఉదయ్‌ కిరణ్‌. ఈ సినిమా తర్వాత మనోడి క్రేజ్‌, సినిమా సాధించిన రికార్డ్ లు పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌లకు చెమటలు పట్టించాయంటే అతిశయోక్తి కాదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
పవన్ కళ్యాణ్
ఉదయ్ కిరణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Related Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ వల్లే రమేష్‌ బాబు కెరీర్‌ కొలాప్స్, అందులో మహేష్‌ కూడా భాగమే.. ఏం జరిగిందంటే?
Recommended image2
Yash Net Worth: రూ.300తో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యశ్‌ ఆస్తులు ఇప్పుడు ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved