Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్

ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్

ఉదయ్‌ కిరణ్‌ కి చిరంజీవి అంటే ఇష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే సినిమాల్లోకి వచ్చాడు. కానీ సినిమాల పరంగా ఉదయ్‌ కిరణ్‌ ఫాలో అయిన హీరో వేరే ఉన్నారు.   

Aithagoni Raju | Published : May 18 2025, 03:19 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Uday Kiran,  Chiranjeevi

Uday Kiran, Chiranjeevi

టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌ ఒక తారలా వెలిగి అంతలోనే కనుమరుగయ్యాడు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఒక మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్‌గా ఎదిగాడు. అలా వెలిగాడు. కానీ కెరీర్‌ పరమైన పొరపాట్లు, పరాజయాలు ఆయన కెరీర్‌ని డౌన్‌ చేశాయి. లైఫ్‌కే ముగింపు పలికాయి. 

26
uday kiran

uday kiran

ఉదయ్‌ కిరణ్‌కి మెగాస్టార్‌ చిరంజీవి అంటే ఇష్టం. ఆయన సినిమాల కోసం ఏకంగా స్కూల్‌, కాలేజీలు ఎగ్గొట్టేవారట. చిరంజీవి సినిమా వచ్చిందంటే మొదటి రోజు, లేదంటే రెండో రోజో కచ్చితంగా చూడాల్సిందే. అంతగా మెగాస్టార్‌ని ఆరాధించాడు ఉదయ్‌ కిరణ్‌. ఆయన్ని స్పూర్తిగా తీసుకునే సినిమాల్లోకి వచ్చాడు. చిరంజీవిపై అభిమానాన్ని ఆయన చాలా సార్లు వెల్లడించారు. 
 

Related Articles

19 ఏళ్ల వరకు హీరోయిన్‌గా పెరిగిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?, ఇంట్లో అమ్మాయిలు లేని లోటు తీర్చిన వైనం
19 ఏళ్ల వరకు హీరోయిన్‌గా పెరిగిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?, ఇంట్లో అమ్మాయిలు లేని లోటు తీర్చిన వైనం
మెగా 157: రూ.18 కోట్లు డిమాండ్ చేసిన నయనతార ? చిరు కోసం అంత త్యాగం చేసిందా..
మెగా 157: రూ.18 కోట్లు డిమాండ్ చేసిన నయనతార ? చిరు కోసం అంత త్యాగం చేసిందా..
36
chiranjeevi, uday kiran

chiranjeevi, uday kiran

`చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` వంటి హ్యాట్రిక్‌ విజయాలతో స్టార్‌ గా ఎదిగాడు ఉదయ్‌ కిరణ్‌. చిరంజీవి దృష్టిలో పడ్డాడు. అంతేకాదు ఆయన్ని కలిశాడు.

ఈ క్రమంలో చిరంజీవి కూడా ఉదయ్‌ కిరణ్‌ని చేరదీశాడు. సపోర్ట్ చేశారు. ఏకంగా పిల్లని(సుస్మిత)ని ఇచ్చి పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్‌ అయిన విషయం తెలిసిందే. 
 

46
aamir khan

aamir khan

ఇదిలా ఉంటే ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఆయన ఆరాధించే సూపర్‌ స్టార్‌ చిరంజీవి కాదు. సినిమాల్లోకి వచ్చాక ఆయన మైండ్‌ సెట్‌ మారింది. మరో సూపర్‌ స్టార్‌ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు.

ఆయన ఎవరో కాదు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌. ఉదయ్‌ కిరణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. తన కెరీర్‌ని అమీర్‌ లాగా ప్లాన్‌ చేసుకోవాలనున్నారట. అమీర్‌ ఖాన్‌ దేనికదే విభిన్నమైన సినిమాలు చేస్తారు. నటుడిగా మెప్పిస్తారు. ఆయన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద అదరగొడతాయి. 
 

56
uday kiran

uday kiran

ఈ క్రమంలో తన కెరీర్‌ని అమీర్‌ ఖాన్‌ లాగాప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నా అని తెలిపారు ఉదయ్‌ కిరణ్‌. హ్యాట్రిక్‌ విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. `అమీర్‌ ఖాన్‌ లాగా ఒక సినిమాకు మరొక మూవీకి సంబంధం లేకుండా ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండేందుకు కృషి చేస్తున్నా.

ఇటీవల `లగాన్‌` చూశాక అలాంటి సినిమానే చేయాలనే కోరిక కలిగింది. నటనకు అవకాశం ఉంటే నెగటివ్‌ రోల్స్ కూడా చేయడానికి వెనకాడను. ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది` అని తెలిపారు ఉదయ్‌ కిరణ్‌. 
 

66
uday kiran

uday kiran

`చిత్రం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `కలుసుకోవాలని` చిత్రాలతో విజయాలు అందుకున్నారు ఉదయ్‌ కిరణ్‌. మధ్యలో రెండు యావరేజ్‌లు పడ్డాయి. మళ్లీ `నీ స్నేహం`, `నీకు నేను నాకు నువ్వు`, `ఔనన్నా కాదన్నా` చిత్రాలతో సక్సెస్‌ సాధించారు.

స్టార్‌ అయిపోయాడు ఉదయ్‌. ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. `గుండె ఝల్లుమంది` ఫర్వాలేదు, కానీ పెద్ద హిట్‌ కాదు, అప్పటికే కెరీర్‌ డౌన్ అయ్యింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉదయ్‌ కిరణ్‌ 2014 జనవరి 5న బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
ఉదయ్ కిరణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories