నిధి అగర్వాల్ కి నిద్ర లేకుండా చేస్తున్న పవన్, ప్రభాస్.. పాపం ఒకటే టెన్షన్!
పేరుకు రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉన్నా నిధి అగర్వాల్ కి ప్రశాంతత లేదు. ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. అసలు ఆ ప్రాజెక్ట్స్

Niddhi Agerwal
ఇటీవల పూజా హెగ్డేకు ఊహించని షాక్ తగిలింది. అస్తవ్యస్తంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం నుండి ఆమె తప్పుకుంది. చెప్పాలంటే పొమ్మనకుండా పొగపెట్టారు. మెయిన్ లీడ్ గా తీసుకుని తర్వాత సెకండ్ హీరోయిన్ చేశారు. శ్రీలీల పాత్రను పెంచి పూజా ప్రాధాన్య తగ్గించారు. దాంతో పూజా తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేసి పక్కకు జరిగింది.
Niddhi Agerwal
కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. వ్యవహారం వేడిగా ఉన్నప్పుడే పనై పోవాలి. ఆలస్యం అయ్యే కొద్దీ మనసులు మారిపోతాయి. అసలు ఫార్మ్ లోని నిధి అగర్వాల్ కి రెండు బంగారం లాంటి ఆఫర్స్ దక్కాయి. ఒకటి హరి హర వీరమల్లు, మరొకటి రాజా డీలక్స్. పవన్ కళ్యాణ్, ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలు ఇవి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
Niddhi Agerwal
టాప్ స్టార్స్ పక్కన ఛాన్స్ రావడంతో నిధి అగర్వాల్ ఎగిరి గంతేసింది. అయితే ఆమె ఆనందం మెల్లగా ఆవిరైపోతుంది. హరి హర వీరమల్లు, రాజా డీలక్స్ చిత్రాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు? ఎప్పుడు విడుదలవుతాయో అంత కన్నా క్లారిటీ లేదు.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. రెండేళ్ల క్రితం స్టార్ట్ చేసినా 50 శాతం షూటింగ్ కాలేదు. నిన్నగాక మొన్న మొదలుపెట్టిన బ్రో విడుదలకు సిద్ధం అవుతుంది. ఓజీ 50 శాతం కంప్లీట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సైతం కొంత మేర పూర్తి చేశాడు. హరి హర వీరమల్లు జోలికి మాత్రం పోవడం లేదు. మరోవైపు వారాహి యాత్ర స్టార్ట్ చేశాడు.
ఎన్నికలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి పవన్ రాజకీయ కార్యక్రమాలు చూస్తుకుంటూ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తాడు. హరి హర వీరమల్లుని టచ్ చేసే ఆలోచన లేదు. 2024 ఎన్నికల తర్వాతే హరి హర వీరమల్లు అంటున్నారు.
ప్రభాస్ రాజా డీలక్స్ పరిస్థితి కూడా అంతే. ఒక షెడ్యూల్ జరిపినట్లు ఉన్నారు. ప్రభాస్ కి జ్వరం అంటూ మధ్యలో ఆపేశారు. సలార్, ప్రాజెక్ట్ కే పూర్తయ్యాకే రాజా డీలక్స్ షూటింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహన్ నటిస్తుంది. నిధి అగర్వాల్ లీడ్ రోల్ చేస్తున్న హరి హర వీరమల్లు, రాజా డీలక్స్ షూటింగ్స్ వాయిదా పడ్డాయి.
దీంతో అసలు ఈ ప్రాజెక్ట్స్ చేయాలా వద్దా? సమయం కేటాయించి ఎదురు చూశాక మనసు మారి ప్రాజెక్ట్స్ నుండి తప్పిస్తే పరిస్థితి ఏంటనే సందేహాలు ఆమెను వెంటాడుతున్నాయి. మొత్తంగా ప్రభాస్, పవన్ నిధి అగర్వాల్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు.