Sreemukhi: కాసుకో అనసూయ శ్రీముఖి వచ్చేస్తుంది... ఉత్కంఠ రేసులో గెలుపెవరిదో?
స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి (Sreemukhi) మరో క్రేజీ ఆఫర్ పట్టేసింది. ఆమె యాంకర్ గా తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ లో వంటల ప్రోగ్రాం ప్రసారం కానుంది. పరోక్షంగా ఆమె అనసూయతో పోటీపడనుంది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా యాప్ ని గ్లోబల్ ఓటిటి సంస్థలకు పోటీ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళుతున్నారు. పాప్యులర్ మూవీస్ తో పాటు ఆసక్తికర కార్యక్రమాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ... తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నారు. బాలయ్య ఓ టాక్ షోకి హోస్ట్ గా మారతారని ఎవరూ... ఊహించలేదు, అల్లు అరవింద్ అది చేసి చూపించారు.
అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్ అన్న మాట వినిపిస్తుంది. బాలయ్య (Balakrishna)అడిగే బోల్డ్ ప్రశ్నలకు గెస్ట్స్ చెప్పే ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ షోపై ఆసక్తి పెంచేస్తున్నాయి. మోహన్ బాబు, నాని గెస్ట్స్ గా వచ్చిన మొదటి రెండు ఎపిసోడ్స్ అత్యంత ఆదరణ దక్కించుకున్నాయి.
ఇదే జోరులో ఆహాలో ఓ వంటల ప్రోగ్రాం ప్లాన్ చేశారు. చెఫ్ మంత్ర పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి ఎంపికయ్యారు. మొదటిసారి ఈ తరహా ప్రోగ్రాం కి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అదే సమయంలో ఆమెకు ఇది ఓ ఛాలెంజ్ అని చెప్పాలి.
కారణంగా ఇటీవల మాస్టర్ చెఫ్ పేరుతో జెమినీలో ప్రసారమైన ప్రోగ్రాం కి సరైన ఆదరణ దక్కలేదు. తమన్నా వంటి స్టార్ హీరోయిన్ ని హోస్ట్ గా పెట్టడంతో, ఈ షో సంచలన విజయం సాధించడం ఖాయం అని భావించారు. అనూహ్యంగా మాస్టర్ చెప్ బ్యాడ్ రేటింగ్ తెచ్చుకుంది. దీనితో తమన్నా (Tamannah) ను తొలగించి, అనసూయ (Anasuya) ను రంగంలోకి దించారు.అయినా పరిస్థితి మారలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో శ్రీముఖి హోస్ట్ గా ఉన్న చెఫ్ మంత్ర ఆహాలో సక్సెస్ టాక్ తెచ్చుకుంటే... అనసూయ ఇమేజ్ డామేజ్ అయినట్లే. తమన్నా, అనసూయ కంటే శ్రీముఖినే బెటర్ అన్న టాక్ ప్రచారం అవుతుంది. పరోక్షంగా ఈ విషయంలో అనసూయ, శ్రీముఖి మధ్య రేస్ మొదలైనట్లే అని ఇండస్ట్రీ టాక్.
ఇక ఫస్ట్ ఎపిసోడ్ కి శ్రీముఖి సిద్ధం అయ్యారు. చెఫ్ మంత్ర ఎపిసోడ్ కోసం ట్రెండీగా సిద్ధమైన శ్రీముఖి ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ గా మారాయి. ఆమె అందరికి ఫిదా అయిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నటిగా కూడా శ్రీముఖి ఆఫర్స్ పట్టేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ గా మారిన శ్రీముఖి... ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలలో శ్రీముఖి చిన్న చిన్న పాత్రలు చేశారు. ఇటీవల విడుదలైన నితిన్ మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య రోల్ చేశారు.