- Home
- Entertainment
- TV
- Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ యష్మీ, శ్రీసత్య లు తమ సపోర్ట్ కళ్యాణ్ కి అంటూ ప్రకటించారు. వీరిద్దరూ నిన్న లైవ్ లోకి వచ్చి మరీ.. తనూజ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం గమనార్హం.

బిగ్ బాస్ 9 తెలుగు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. వచ్చే ఆదివారం ఈ సీజన్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉన్నారు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్, సంజనా ఉన్నారు. వీరిలో తనూజ, కళ్యాణ్ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ లు మూడో స్థానం కోసం చాలా గట్టిగా పోటీ పడుతున్నారు.
అయితే...విన్నర్ రేసులో ఉన్న తనూజ, కళ్యాణ్ కి కొందరు బీభత్సంగా సపోర్ట్ చేస్తుంటే... మరి కొందరు భయంగా నెగిటివ్ చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తం తనూజ చుట్టే తిరిగిందని.. ఇమ్మాన్యుయల్ కామెడీతోనే సీజన్ నడిచిందని.. వీళ్లిద్దరూ కాకుండా కళ్యాణ్ ఎలా విన్ అవుతాడని... రివ్యూవర్స్ కారణంగానే కళ్యాణ్ విన్నింగ్ రేసులోకి వచ్చాడు అని చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కళ్యాణ్ విన్నింగ్ రేసు లో ఉండటానికి కూడా పనికిరాడు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
కళ్యాణ్ కి సపోర్ట్...
అయితే... కళ్యాణ్ కి సపోర్ట్ చేసేవాళ్లు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నారు. వారిలో సీరియల్ నటులు, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉండటం విశేషం. నిజానికి టీవీ ఇండస్ట్రీకి చెందిన తనూజకి వీళ్లు సపోర్ట్ చేస్తారని అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. వాళ్లే తనూజకి నెగిటివ్ గా మాట్లాడుతూ ఉండటం విశేషం. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చిన శ్రీసత్య, సీజన్ 8కి వచ్చిన యష్మీ... ఇద్దరూ ఆన్ లైన్ లో లైవ్ లోకి వచ్చి మరీ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు.
తనూజ చరిత్ర మాకు తెలుసు.. యష్మీ, శ్రీ సత్య..
తనూజ మీద మీకు జెలసీ ఉందని... అందరూ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. దానిపై యష్మీ, శ్రీ సత్య సీరియస్ అయ్యారు. ‘ తనూజ చరిత్ర నాకు తెలుసు’ ని యష్మీ అంటే.. నాకు కూడా తెలుసురా అంటూ సత్య కూడా అనడం గమనార్హం. ఎలాంటి గేమ్ ఆడకుండా కేవలం పీఆర్ పెట్టుకోవడం వల్లే.. తనూజ ఇప్పుడు టాప్ లో ఉందని వీళ్లు అనడం విశేషం. ఇలా తాము కూడా పీఆర్ లను పెట్టుకొని ఉంటే.. తాము కూడా విన్ అయ్యే వాళ్లమని.. అంత పీఆర్ లకు ఖర్చు చేసే అంత డబ్బు తమకు లేదని కామెంట్ చేశారు. ‘ నన్ను అందరూ తనూజతో కలిసి నువ్వు ముద్ద మందారంలో నటించావు కదా.. తన మీద జెలసీ తో ఇలా మాట్లాడుతున్నావ్ అని అందరూ నన్ను అంటున్నారు.. నాకు అసలు అలాంటీ జెలసీ ఏమీ లేదు’ అని సత్య క్లారిటీ ఇచ్చింది. ‘ అమ్మాయికి అమ్మాయి కూడా హెల్ప్ చేయలేరా? అని అంటున్నారు.. మరి మాకు ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు.. టాప్ 5 లో ఎందుకు ఉంచలేదు?’ అని యష్మీ నెటిజన్లను ప్రశ్నించడం విశేషం. ఇక వీరిద్దరూ చివరి రోజు.. కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ ఆ కాల్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వీరి లైవ్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
వీరికి తోడు పాత కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, గీతూ రాయల్, ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఆశా షైనీ, ప్రియ, శ్రీజ వీళ్లంతా కూడా కళ్యాణ్ కే సపోర్ట్ చేయడం విశేషం. వీరంతా కూడా నిన్న లైవ్ లో పాల్గొన్నారు.

