MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • పల్లవి ప్రశాంత్ దెబ్బకు నాగార్జున మైండ్ బ్లాక్... సంచలన నిర్ణయం, నెక్స్ట్ ఎవరు?

పల్లవి ప్రశాంత్ దెబ్బకు నాగార్జున మైండ్ బ్లాక్... సంచలన నిర్ణయం, నెక్స్ట్ ఎవరు?

పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ వివాదంలో హోస్ట్ నాగార్జున ఇమేజ్ కూడా డామేజ్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది.

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 24 2023, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ తెలుగు 7 వివాదాలు రాజేసింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ ఇందుకు కారణం కాగా, నాగార్జున ఇమేజ్ కూడా దెబ్బతింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రశాంత్ అరెస్ట్ కాగా, ఈ వివాదం మీద బిగ్ బాస్ యాజమాన్యం, హోస్ట్ నాగార్జున స్పందించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే ముగిసింది. అన్నపూర్ణ స్టూడియో ఎదుట అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోట్లకు దిగారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ ధ్వంసం చేశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉంది. వెనుక గేటు నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని పోలీసులు టైటిల్ విన్నర్ ప్రశాంత్ కి సూచించారు. పోలీసుల ఆంక్షలు పక్కన పెట్టి ప్రశాంత్ ర్యాలీ చేశాడు. 

37

పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పై బయటకు వచ్చాడు. పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట వింటే అతడు అరెస్ట్ అయ్యేవాడు కాదు. ఫ్యాన్స్ గొడవలతోనే వివాదం ముగిసేది. టైటిల్ విన్నర్ అరెస్ట్ కావడంతో బిగ్ బాస్ షో పరువు పోయింది. 

 

47
Actor Nagarjuna

Actor Nagarjuna

బిగ్ బాస్ షో ప్రతినిధిగా హోస్ట్ నాగార్జున కనిపిస్తున్నారు. ఈ క్రమంలో వివాదంలోకి నాగార్జునను లాగారు. పల్లవి ప్రశాంత్ ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తారు. హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకుల మీద కూడా కేసులు వేయాలి, అరెస్టులు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 

57
Actor Nagarjuna

Actor Nagarjuna

హైకోర్ట్ న్యాయవాది అరుణ్ కుమార్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకుల మీద కూడా కేసులు పెట్టాలి. చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి ఆయన మరింత బద్నామ్ అయ్యారు. 

67

ఈ క్రమంలో నెక్స్ట్ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేయకపోవచ్చు. పల్లవి ప్రశాంత్ చేసిన రచ్చకు ఆయన తప్పుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుండి తప్పుకుంటే, ఎవరు బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా ఎంట్రీ ఇస్తారనే చర్చ మొదలైంది. 

 

77

గతంలో ఎన్టీఆర్, నాని బిగ్ బాస్ హోస్ట్స్ గా వ్యవహరించారు. సినిమాలతో బిజీ కావడం వలన ఎన్టీఆర్ తప్పుకున్నారు. ఇక నాని హోస్ట్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదనే కామెంట్స్ వినిపించాయి. చూడాలి నాగార్జున కాదంటే ఆయన స్థానంలోకి ఎవరు వస్తారో... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా
Recommended image2
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image3
Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved