సోనియా పెళ్ళికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ ఎందుకు రాలేదు? పెద్దోడ్ని ఆమె పిలవలేదా?
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల పెళ్లి ఘనంగా ముగిసింది. ఈ పెళ్ళికి పలువురు బుల్లితెర సెలెబ్స్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హజరయ్యారు. అయితే సోనియాకు అత్యంత సన్నిహితుడైన నిఖిల్ రాకపోవడం చర్చకు దారి తీసింది.
Soniya Akula Marriage Photos
నటి సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోనియా ఆకుల ఫస్ట్ వీక్ నుండే తన గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుంది. సీరియల్ నటులు పృథ్వి, నిఖిల్ లతో ఆమె అత్యంత సన్నిహితంగా ఉండేది. వారిద్దరినీ చిన్నోడా, పెద్దోడా అని పిలిచేది. నిఖిల్, పృథ్విలతో సోనియా ప్రవర్తన ఒకింత ఇబ్బందికరంగా అనిపించింది.
Soniya Akula Marriage Photos
సోనియా మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి నడిచింది. పృథ్వి, నిఖిల్ లతో సన్నిహితంగా ఉంటున్న సోనియా.. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ హౌస్లో ప్రేమదేశం మూవీ నడుస్తుంది.. అంటూ కామెంట్స్ వినిపించేవి. నిఖిల్-సోనియా-పృథ్విల బంధం జనాల్లో చాలా తప్పుగా ప్రొజెక్ట్ అయ్యింది. నిఖిల్, పృథ్విల గేమ్ ని సోనియా ప్రభావితం చేస్తుంది. వాళ్ళ నిర్ణయాలు కూడా సోనియా సూచనల మేరకు ఉంటున్నాయని విమర్శలు మొదలయ్యాయి.
Soniya Akula Marriage Photos
సోనియా ఆకుల కేవలం 4 వారాలకే ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుండి బయటకు వచ్చాక.. ఆమె బిగ్ బాస్ నిర్వాహకుల మీద విరుచుకు పడింది. విమర్శలు గుప్పించింది. నన్ను చాలా తప్పుగా చూపించారు. నిఖిల్, పృథ్విలకు నేను ఒక సిస్టర్ గా, మదర్ గా ఫీల్ అయ్యాను. కానీ ఎపిసోడ్స్ లో ముందు వెనుక కట్ చేసి పెడార్థం వచ్చేలా చూపించారని ఆమె ఆవేదన చెందారు. ఒక వారం రీ ఎంట్రీ ఇచ్చిన సోనియా.. నిఖిల్ ని నామినేట్ చేయడంతో పాటు, అతని గేమ్ మీద విమర్శలు చేసింది.
Soniya Akula Marriage Photos
ఇదిలా ఉంటే నిఖిల్ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ అయ్యాడు. కాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక సోనియా తన ప్రియుడు యష్ వీర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. డిసెంబర్ 21న వివాహం ఘనంగా ముగిసింది. సోనియా-యష్ ల వివాహానికి టేస్టీ తేజ, రోహిణి, పల్లవి ప్రశాంత్, ఓంకార్ తో పాటు పలువురు బుల్లితెర సెలెబ్స్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హాజరయ్యారు.
Soniya Akula Marriage Photos
ఇక నిఖిల్, పృథ్విలలో పృథ్వి మాత్రమే పెళ్ళికి వచ్చాడట. సోనియా పెళ్లిలో నిఖిల్ కనిపించకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. నిఖిల్ ని సోనియా పెళ్ళికి పిలవలేదా? లేక అతడే రాలేదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పష్టత కోరాడు. నిఖిల్ మీ వివాహానికి ఎందుకు హాజరు కాలేదని కోరాడు. నేను బిగ్ బాస్ 8లో పాల్గొన్న అందరినీ పిలిచాను. అందులో కొందరు మాత్రమే హాజరయ్యారు. వారి రాకతో నా పెళ్లి మరింత స్పెషల్ గా మారిందని.. ఆమె తెలియజేశారు.
Soniya Akula Marriage Photos
నిఖిల్ బిజీగా ఉండటం వలనే రాకపోయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక సోనియా భర్త యష్ అమెరికాలో ఉంటారని తెలుస్తుంది. ఆయన కొన్ని ఎన్జీవోలు నడుపుతారని సమాచారం. సోనియా కూడా సోషల్ యాక్టివిస్ట్. కొన్ని ప్రాజెక్ట్స్ లో భాగంగా వీరికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది.
Soniya Akula Marriage Photos
సోనియా ఆకుల జార్జి రెడ్డి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ చిత్రంలో హీరో చెల్లి పాత్ర చేసింది. దర్శకుడు ఆర్జీవీ ఆమెకు లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన దిశా ఎన్కౌంటర్ మూవీలో సోనియా ఆకుల నటించింది. అలాగే కరోనా వైరస్ చిత్రంలో కూడా సోనియా ఆకుల నటించారు.