ఎన్టీఆర్ భార్యను చూసి వణికిపోయిన స్టార్ హీరోయిన్, ఏం జరిగిందంటే?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీర్తి కిరీటం నందమూరి తారక రామారావు. ఆయనకు అందరు ఎంత గౌరవం ఇచ్చేవారో.. ఆయన భార్య బసవతారకం అన్నా కూడా అంతే విలువ ఇచ్చేవారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ ధర్మపత్ని చేసిన పనికి ఓ హీరోయిన్ వణికిపోయారట. కారణం ఏంటంటే?

ఆ కాలంలో హీరోలంటే అందరు భయపడేవారు. సెట్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్నారంటే సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకునేవారు. హీరోయిన్లు కూడా షార్ట్ లో నటించి కామ్ గా తమ పని తాము చేసుకునేవారు. మరీ ముఖ్యంగా పెద్దాయన ఎన్టీఆర్ సెట్ లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండేవారట. ఆయన కూడా ప్రతీ ఒక్కరికి గౌరవం ఇస్తూ.. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట.
ఈక్రమంలో ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య బసవతారకమ్మకు కూడా అదే గౌవరం లభించేది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్లను బసవతారకమ్మ చాలా ఆప్యాయంగా చూసుకునేవారట. అలనాటి హీరోయిన్ ఊర్వశి శారద ఎన్టీఆర్ గురించి చెపుతూ.. ఆయన ధర్మపత్ని బసవ తారకమ్మ గురించి కూడా ఓ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శారద అప్పట్లో జరిగిన ఓ సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ ఎక్కువగా ఇంటి భోజనమే తీసుకునేవారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణ స్టూడియోలో షూటింగ్స్ జరిగితే ఖచ్చితంగా ఇంటి నుంచే భోజనం వచ్చేది. అంతే కాదు ఆ భోజనం కూడా బసవతారకమ్మే స్వయంగా తెచ్చేవారట. అలా ఓ సందర్భంలో మధ్యాన్నం భోజనం తీసుకుని స్టూడియోకు వచ్చారట.
శారద మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు ఓ అలవాటు ఉంది. ఆయన చిన్నా పెద్దా అదరికి సమానంగా గౌవరం ఇస్తారు. ఏకవచనంతో పిలవరు. ఆయన భార్య కూడా అంతే అందరికి విలువ ఇచ్చేవారు. భోజనం తీసుకువచ్చిన తారకంగారికి ఎన్టీఆర్ చెప్పారట సెట్ లో శారద ఉంది అని. దాంతో ఆమె నేను ఎక్కడున్నాను అని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు. దాంతో నాకు భయంతో వణుకు వచ్చేసింది. నాకోసం వారు రావడం ఏంటి అని అనిపించింది.
అయ్యే అమ్మా మీరు వచ్చారేంటి. నేనే వచ్చి కలిసేదాన్ని కదా అని నేను అన్నాను. ఏమైంది ఇప్పుడు ఎవరొస్తే ఏమి.. అని తారకం గారు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, అని బసవతారకమ్మను గుర్తు చేసుకున్నారు ఊర్వశి శారద. నిజంగా ఆ ఇద్దరు పుణ్య దంపతులు, అంత మంచి వారిని నేను ఎక్కడా చూడలేదు. ఆమె మనసు కూడా ఎన్టీఆర్ మాదిరిగానే గొప్పది అని శారద గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.