47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న సీనియర్ నటుడు, ఎవరో తెలుసా?
46 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఓ సీనియర్ నటుడు... త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. మరి, ఆ హీరో ఎవరో తెలుసా?

Sai Kiran
టాలీవుడ్ లో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు నటుడు సాయి కిరణ్. నువ్వే కావాలి, ప్రేమించు, మనసుంటే చాలు వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ.. హీరో గా తన కెరీర్ ని కొనసాగించలేకపోయారు. కానీ... కొంత గ్యాప్ తర్వాత... ఆయన బుల్లితెరపై రంగప్రవేశం చేశారు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు వంటి సినిమాలతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం అనే సీరియల్ లో తండ్రి పాత్ర చేస్తున్నారు.
రెండో పెళ్లి....
కాగా... ఈ 47ఏళ్ల హీరో... త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. 2010లో సాయి కిరణ్ కి వైష్ణవి అనే యువతితో వివాహం జరిగింది. కొంత కాలం తర్వాత.... మనస్పర్థలతో వారు విడిపోయారు. రీసెంట్ గానే తనతో కలిసి సీరియల్ లో పని చేసిన స్రవంతిని వివాహం చేసుకున్నారు. ఈ వయసులో రెండో పెళ్లా అని చాలా మంది చర్చించుకున్నారు. అయితే... త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఎనిమిదో నెల...
ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిదో నెల అని....మరో నెల రోజుల్లో తమ జీవితంలోకి బిడ్డ రాబోతున్నట్లు ఈ జంట తెలియజేసింది. చాలా మందికి సాయి కిరణ్ ఒక సీరియల్ నటుడుగా మాత్రమే తెలుసు. కానీ... ఆయన ప్రముఖ టాలీవుడ్ సింగర్ పి.సుశీల గారి మనవడు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇక పోతే... త్వరలో పేరెంట్స్ కాబోతున్న సాయికిరణ్, స్రవంతి దంపతులకు మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం...