Bigg Boss : బిగ్ బాస్ హౌజ్ కి సీల్.. సొంత ఇళ్లకు కంటెస్టెంట్లు, మొత్తం తలక్రిందులు
Bigg Boss Kannada: పర్యావరణ నియమాలు ఉల్లంఘనల నేపథ్యంలో బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 షూటింగ్ స్టూడియోను అధికారులు సీల్ చేశారు. సాయంత్రం 7 గంటలలోపు పోటీదారులు ఇక్కడి నుంచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 స్టూడియో సీల్.. ప్రభుత్వ ఆదేశాలతో మూత
Bigg Boss Kannada Season 12: బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 కు బిగ్ షాక్ తగిలింది. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై రియాలిటీ షో 'బిగ్ బాస్ కన్నడ సీజన్ 12' జరుగుతున్న బిదాడిలోని జోలీవుడ్ స్టూడియోను రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి లాక్ చేసింది. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ పోటీదారులందరూ సాయంత్రం 7 గంటలలోపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు.
పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) జారీ చేసిన నోటీసు తర్వాత, రెవెన్యూ శాఖ అధికారులు స్టూడియోకు చేరుకుని, పోటీదారులందరూ సాయంత్రం 7 గంటలలోపు ఇంటి నుండి బయటకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిణామం బిగ్ బాస్ షోకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
పర్యావరణ నియమాల ఉల్లంఘనలతో Bigg Boss Kannada Season 12 చర్యలు
కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) నిబంధనలను ఉల్లంఘించి, అనుమతులు లేకుండా కార్యకలాపాలు కొనసాగించినందుకు స్టూడియోపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
స్టూడియోకు నీటి, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు (Consent for Operation) లేవని పరిశీలనలో తేలిందని వర్గాలు వెల్లడించాయి. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని అధికారులు పేర్కొన్నారు.
Bigg Boss Kannada Season 12: మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఏమన్నారంటే?
అటవీ, పర్యావరణ-జీవశాస్త్ర శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ.. “రామనగర కార్యాలయం ఇప్పటికే పరిశీలించి నోటీసులు జారీ చేసింది. స్టూడియో యాజమాన్యం అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. కాబట్టి చట్టపరంగా చర్యలు తప్పవు,” అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ఇప్పటికే సైట్‌ను తనిఖీ చేసారని, చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Bigg Boss Kannada Season 12: బిగ్ బాస్ స్టూడియోలోకి ప్రవేశించిన అధికారుల బృందం
మంత్రి ప్రకటన తర్వాత, రెవెన్యూ శాఖ అధికారుల బృందం జోలీవుడ్ స్టూడియో నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకుంది. తహశీల్దార్ తేజస్విని, బిదాడి ఇన్‌స్పెక్టర్ శంకర్ నాయక్, ఆర్.ఐ., వి.ఏ అధికారులు స్టూడియో లోపల తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు మించి స్టూడియో నడుస్తోందని నిర్ధారణ అయితే, స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నట్టు సమాచారం.
Bigg Boss Kannada Season 12: కన్నడ అనుకూల సంస్థల ఆగ్రహం
జోలీవుడ్ స్టూడియో చట్టవిరుద్ధంగా, పర్యావరణానికి హాని కలిగించే విధంగా పనిచేస్తుందనే ఆరోపణలపై కన్నడ అనుకూల సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిదాడిలోని జోలీవుడ్ స్టూడియో ముందు కస్తూరి కన్నడ జనపర వేదిక కార్యకర్తలు నిరసన తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. ఇంత అనధికారిక ప్రదేశంలో బిగ్ బాస్ షోను ప్రారంభించడం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి సందేశం పంపుతున్నారు? జోలీవుడ్ స్టూడియో, బిగ్ బాస్ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ షూటింగ్‌పై ప్రభావం
ఈ ఘటనతో బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రతీ పోటీదారు సాయంత్రం 7 గంటలలోపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయలుదేరాలని ఆదేశాలు జారీ చేయడంతో, షో భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.